Breaking News

ఘనంగా 'తెలంగాణ కథలు'ను ప్రారంభించిన ఓనమాలు..!

Published on Mon, 06/02/2025 - 13:53

ప్రాంతీయ పాక వారసత్వం, సాంస్కృతిక వారసత్వాన్ని  ఉత్సవంగా జరుపుకోవాలనే  ఆశయంతో తెలంగాణ కథలు’ను ఘనంగా ప్రారంభించింది ’ఓనమాలు‘. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం (జూన్ 2)కి   సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమం,  తెలంగాణ ప్రాంత వంటకాలు, కళలు, కథలను పండుగలా నిర్వహించింది. చిత్రనిర్మాతలు, కవులు, జర్నలిస్టులు, రచయితలు, కార్యకర్తలు , ఆహార ప్రియులను ఒకచోటకు చేర్చి, వారికి  అద్భుతమైన అనుభవాన్ని అందించింది అనడంలో సందేహం లేదు.

ఈ వేడుకలో కరీంనగర్ మహిళలు తయారుచేసిన సర్వపిండి, బక్షాలు, జొన్న రొట్టె, కామారెడ్డి నుంచి మక్క పేలాలు, వంటి సాంప్రదాయ వంటకాలతోపాటు స్థానికంగా లభించే పండ్లు  ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.  ముఖ్యంగా ఆదిలాబాద్ నుంచి గోండులు, మహువా సమాజానికిచెందిన  గుస్సాడి నృత్యం సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఇవన్నీ ఈ  వేడుకకు ఉత్సాహభరితమైన  ప్రాంతీయ సౌరభాలను సమరకూర్చాయి. 

“తెలుగును ఒకమాటలో వర్ణించలేం.  ఒకే ఒక్క సాధారణ స్వరంలో చెప్పలేం. ఇది  వెయ్యి సూక్ష్మ కథలతో, అనేక ఉప-ప్రాంతీయ వైవిధ్యాలతో  జమిలిగా అల్లిన  కథ.  దీన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి,  వినడానికి, కనుమరుగవుతున్న వాటిని సంరక్షించడానికి మేము ఇప్పుడు తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, హైదరాబాద్ కోసం సూక్ష్మ-ప్రాంతీయ సంఘాలను నిర్మిస్తున్నాము, ”అని ది క్యులినరీ లాంజ్ CEO , ఓనమాలు ఉద్యమంలో కీలక  సూత్రధారి గోపి బైలుప్పల అన్నారు. “ఈసారి, ప్రయాణం ఎప్పుడూ లేనంతగా ఇంటికి దగ్గరగా ఉంది.” అని పేర్కొన్నారు.

ఈ ప్రాంతీయ సంఘాలు నెలవారీ మాస్టర్‌క్లాస్‌లు, సాంస్కృతిక చర్చలను నిర్వహిస్తాయి, ఔత్సాహికులకు స్థానిక ఆహారం, సాహిత్యం, సంప్రదాయాలను అన్వేషించడానికి ఒక వేదికను అందిస్తాయన్నారు. ఈ దృష్టి కేంద్రీకృత సమాజ కార్యక్రమాల శ్రేణిలో తెలంగాణ కథలు మొదటి అధ్యాయం. ఈ కార్యక్రమంలో అన్విక్షికి పబ్లిషర్స్ వ్యవస్థాపకుడు వెంకట్ సిద్ధా రెడ్డి కూడా పాల్గొన్నారు.

ఆయన పాక పునరుజ్జీవనం, సాహిత్య పునరుజ్జీవనం మధ్య  ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు “అన్విక్షికి తెలుగు సాహిత్యాన్ని పునరుద్ధరించే దృక్పథంతో స్థాపించారు. స్థానిక వ్యాపారాలలో చిన్న స్వయం-సేవ పుస్తక దుకాణాలు, చలనచిత్ర నిర్మాణ కార్యాలయాలలో లైబ్రరీల ద్వారా తాము తమ పరిధిని విస్తరిస్తున్నామని  వెంకట్ తెలిపారు. ఈ చొరవ పాఠకుల సంఖ్యను, ఆదాయాన్ని అందిస్తూనే ఆయా ప్రదేశాలకు సాంస్కృతిక విలువను జోడిస్తుందని ఆయన అన్నారు. 

ఈ కార్యక్రమంలో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న  చిత్రం ’బలగం‘తో  అవార్డు గెలుచుకున్న దర్శకుడు వేణు యెల్దండి,  మరో అవార్డు గ్రహీత, తెలుగు రచయిత పెద్దింటి అశోక్ కుమార్  పాల్గొన్నారు.   ఈ సందర్భంగా వారు ది క్యులినరీ లాంజ్‌లో అన్విక్షికి  ప్రత్యేక పుస్తకాల  షెల్ఫ్‌ను  ప్రారంభించారు.

ప్రముఖ విద్యావేత్త, నటీ గీతా భాస్కర్, సీనియర్ జర్నలిస్ట్ అమర్, ప్రెస్ అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస రెడ్డి, ప్రముఖ చిత్రకారుడు ఏలే లక్ష్మణ్ తదితరులు ఈ కార్యక్రమానికి విచ్చేసి తెలంగాణ వంటలను ఆస్వాదించి, నిర్వహకులను అభినందించారు.

బలగం డైరెక్టర్ వేణు మాట్లాడుతూ సర్వపిండి, బక్షాలను గురించి ఈతరం పిల్లలకు తెలియదనీ, భవిష్యత్ తరానికి తెలంగాణ పురాతన వంటకాల గురించి తెలియజేయడానికి ఓనమాలు చేస్తున్న ప్రయత్నం గొప్పదనీ ప్రస్తుతించారు. ఈ కార్యక్రమాన్ని అందరూ ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.

ఓనమాలు గురించి
తెలుగు మాట్లాడే రాష్ట్రాలలోని వైవిధ్యమైన పాక వారసత్వాన్ని సంరక్షించడం, డాక్యుమెంట్ చేయడం, వాటిని ముందుతరాలకు అందించే లక్ష్యంతో 2024లో లాంచ్ అయింది ’ఓనమాలు‘ అనే కమ్యూనిటీ ఇనీషియేటివ్. సూక్ష్మ వంటకాలను అన్వేషించడం, పురాతన వంటకాలను పునరుద్ధరించడం, పరిశోధన, వాటి గురించి సవివరంగా చెప్పడం, ఆచరణాత్మక అనుభవాల ద్వారా కమ్యూనిటీలను నిమగ్నం చేయడమే ఓనమాలు లక్ష్యం. 

డాక్టర్ ఎ.వి. గురవా రెడ్డి KIMS-SUNSHINE హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్స్ (ITEC), పరిశ్రమలు అండ్‌ వాణిజ్య విభాగాలకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, తెలంగాణలో సీనియర్ IAS అధికారి జయేష్ రంజన్ ’ఓనమాలు‘ను  ప్రారంభించారు. గత సంవత్సరంలో ఓనమాలు 27,500 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి, పెద్దలు, రైతులు, గృహ వంటవారు. ఇతర నిపుణులను కలిసి, కనుమరుగవుతున్న రుచులను, మరచిపోయిన పాక పద్ధతులను తిరిగి గుర్తించారు. 

ఈ వేదిక ఫ్లూట్ రిసిటల్స్, పాక థియేటర్ ప్రదర్శనలు, సాంప్రదాయ రుచికరమైన వంటకాలను అందించే లైవ్ ఫుడ్ స్టేషన్‌ల నిర్వహణతో రుచి, సంప్రదాయం ద్వారా తరాల అంతరాలను తగ్గిస్తోంది. తెలుగు పాక పరి జ్ఞానాన్ని సంరక్షించి, గర్వంగా  అందించేలా వంట మ్యూజియంను స్థాపించడం, ట్రైనింగ్  వర్క్‌షాప్‌లను నిర్వహించడంతోపాటు,  గృహిణులు, చెఫ్‌లు, ఆహార చరిత్రకారులు, సాంస్కృతిక నిపుణులతో సహకారాన్ని పెంపొందించడం  అనేవి ఓనమాలు భవిష్యత్ ప్రణాళికలు.

(చదవండి: Kerala Teacher: ఆ మాస్టార్‌ అంకితభావానికి మాటల్లేవ్‌ అంతే..! ఏకంగా 20 ఏళ్లుగా..)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)