Breaking News

నాన్‌స్టిక్‌ పాన్‌తో పెరుగుతున్న టెఫ్లాన్‌ ఫ్లూ కేసులు!

Published on Tue, 07/30/2024 - 11:12

నాన్‌స్టిక్‌ వంట సామానులు వాడొద్దని ఎన్నేళ్లుగానో నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల ఆరోగ్యానికి మంచిది కాదని విన్నాం. కానీ ఇటీవల ఈ నాన్‌స్టిక్‌ కుక్‌వేర్‌ల వాడకం వల్ల యూఎస్‌లో సరికొత్త వ్యాధి వెలుగులోకి వచ్చింది. వాటిని అధికంగా వేడిచేయడం వల్లే  ఈ వ్యాధి వస్తున్నట్లు పరిశోధనలో తేలింది. అసలేంటి వ్యాధి? అందుకు నాన్‌స్టిక్‌ పాన్‌ ఎలా కారణం..?.

నాన్‌స్టిక్‌ పాన్‌లు అధికంగా వేడి చేయడం వల్లే పాలిమర్‌ ఫ్యూమ్‌ ఫీవర్‌ వంటి ఫ్లూ మాదిరి వ్యాధులు వస్తున్నాయని సుమారు మూడు వేలకు పైగా నివేదికలు చెబుతున్నాయి. అందుకు నాన్‌స్టిక్‌ కుక్‌వేర్‌ల్లో ఉపయోగించే రసాయన పూత కారణమని గత 20 ఏళ్లుగా లాభప్రేక్ష లేని సంస్థ యూఎస్‌ పాయిజన్‌ సెంటర్స్‌ చెబుతున్నాయి. ఈ వంట సామానుల్లో వాడే కెమికల్స్‌ కారణంగా పాలిమర్‌ ఫ్యూమ​ ఫీవర్‌కి సంబంధించిన కేనులు 267కి పైగా నమోదయ్యాయి. 

టెఫ్లాన్‌లోని ప్రధాన పదార్థం. పాలిటెట్రాఫ్లోరోఎథిలిన్(పీటీఎఫ్‌ఈ). అందువల్లే దీన్ని వందల ఏళ్లుగా నిపుణులు ప్రమాదకరమైన కెమికల్స్‌తో కూడిన పాన్‌లని చెబుతున్నారు. అన్ని  నాన్‌స్టిక్ వంటసామాను సెట్‌లు పీఎఫ్‌ఏఎస్‌(పర్ పాలీఫ్లోరోఅల్కైల్ పదార్ధాలు) కెమికల్‌ ఉంటుందని అన్నారు. మనం ఈ నాన్‌స్టిక్‌ పాత్రను దాదాపు 500 డిగ్రీల ఫారెన్‌హీట్‌ కంటే ఎక్కువగా వేడి చేసినప్పుడూ..దానిపై ఉండే ఈ రసాయన  పూత విరిగిపోయిన లేదా డ్యామేజ్‌ అయినప్పుడూ ఈ "టెఫ్లాన్ ఫ్లూ"కి దోహదపడే పొగలను విడుదలవడం జరుగుతుంది. 

అందువల్ల దీనిలో వండే పదార్థాలు మనకు అనారోగ్యాలను కలుగుజేస్తాయని తెలిపారు. అందువల్ల టెఫ్లాన్‌ పూతతో కూడిన పాన్లు అధిక్ష ఉష్ణోగ్రత వద్ద వేడి చేయొద్దని హెచ్చరిస్తున్నారు. అంతేగాదు జర్మనీలో జరిపిన అధ్యయనంలో పరిశోధకులు ఖాళీ నాన్‌స్టిక్‌ ప్యాన్‌లను అరగంట పాటు వేడి చేయడం ద్వారా పీఎఫ్‌ఏఎస్‌ ఉద్గారాలు విడుదలవ్వుతున్నట్లు గుర్తించారు. దాదాపు 698 డిగ్రీల ఫారెన్‌హీట్‌ ఉష్ణోగ్రతకు చేరుకున్నప్పుడూ పాన్‌ అత్యధిక ఉద్గారాలను విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. సాధారణ ఉష్ణోగ్రత వద్ద మానవ ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేదని పరిశోధకులు చెబుతున్నారు. అందువల్ల నిపుణులు నాన్‌ స్టిక్‌ కుక్‌వేర్‌ని ఎప్పుడూ ముందుగా వేడి చేయకూడదని నొక్కిచెబుతున్నారు. 

తక్కువ మంట మీద వండితే ఎలాంటి సమస్య ఉండదు గానీ, వేడి చేసిన నాన్‌స్టిక్‌ పాన్‌లో కర్రిని అలా ఉంచేయడం వల్ల కూడా పాలిమర్‌ ఫ్యూమ్‌ ఫీవర్‌ వస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అంతేగాదు టెఫ్లాన్‌తో పూసిన పాన్‌పై ఒక్క స్క్రాచ్ తొమ్మిది వేల కణాలను ఉత్పత్తి చేస్తుందని, ఇది మానవ శరీరంలో మూత్రపిండాలు, వృషణాలకు సంబంధించిన కేన్సర్‌ ప్రమాదాలకు కారణమవుతుందని హెచ్చరించారు. అలాగే వంట చేసేటప్పుడూ తప్పనిసరిగా ఎగ్జాస్ట్ ఫ్యాన్లు లేదా ఓపెన్ విండోలను కూడా ఉపయోగించాలని సూచించారు పరిశోధకులు. 

(చదవండి: వాల్‌నట్స్‌ తింటున్నారా..?ఐతే అలాంటివాళ్లు మాత్రం..!)
 

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)