Breaking News

ఐఐటీ, ఎంబిఏ వంటి డిగ్రీలు చేయలేదు.. కానీ ఏడాదికి రూ. 70 లక్షల శాలరీ..!

Published on Tue, 08/05/2025 - 16:56

డిగ్రీల మీద డిగ్రీలు చేయడం కాదు. చదువుకి తగ్గ ఉద్యోగం, వేతనం అందుకున్నవాడే అసలైన అదృష్టవంతుడు. అలాంటి లక్‌ కొందరికే సొంతం. కానీ ఇక్కడొక వ్యక్తి మాత్రం అలాంటి పెద్ద పెద్ద చదువులు చదవకుండానే జస్ట్‌ రెండు ఉద్యోగాల మారి..ఏకంగా రూ. 26 లక్షల నుంచి రూ. 70 లక్షల వేతనం అందుకుంటున్నాడు. అందుకు సంబంధించిన పోస్ట్‌ ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ పోస్ట్‌ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌గా మారి రకరకాల చర్చలకు తెరలేపింది. 

సౌరబ్‌ యాదవ్‌ అనే వ్యక్తి ఎలాంటి ఐఐటీ డిగ్రీలు, ఎంబిఏ డిగ్రీలు పూర్తి చేయలేదు. కేవలం కష్టపడి ఈ భారీ స్థాయిలో జీతాన్ని అందుకుంటున్నాడు. జస్ట్‌ రెండు ఉద్యోగాలు మారుతూ భారీ స్థాయిలో వేతనం అందుకునే రేంజ్‌కి ఎదిగాడు. 

తొలి ఉద్యోగంలో ఏడాదికి రూ. 26 లక్షలు తీసుకోగా, రెండో ఏడాది రూ. 28 లక్షలు, మూడో ఏడాది రూ. 70 లక్షలు అందుకునే స్థాయికి చేరుకున్నాడు. అదంతా కేవలం తన హార్డ్‌ వర్క్‌తోనే ఈ ఘనతను సాధించాడు. ఈ విషయాన్ని ఒక సాఫ్ట్‌వేర్‌ టెక్కీ నెట్టింట పోస్ట్‌ చేయడంతో పెద్ద దుమారం రేపి చర్చలకు దారితీసింది. ఉన్నత చదువులు చదివితే భారీ స్థాయిలో వేతనం ఇస్తారన్న అపోహా ఈ పోస్ట్‌తో తొలిగిపోతుందని కొందరూ. 

అతడు పనిచేసే చోట వాతావరణం ఎలా ఉండేది, ఎలా తన పై అధికారులను ఆ స్థాయిలో జీతాలు ఇవ్వమని చర్చించాడు తదతరాల గురించి తెలుసుకోవాలనుంది అంటూ పోస్టులు పెట్టారు. ఈ పోస్ట్‌ కష్టపడితే అనితర సాధ్యమైనది కూడా సాధించొచ్చు అన్నే విషయాన్ని హైలెట్‌ చేసింది కదూ..!.

(చదవండి: భారత్‌ వ్యక్తినే పెళ్లి చేసుకోవడానికి రీజన్‌..! రష్యన్‌ మహిళ పోస్ట్‌ వైరల్‌)

 

#

Tags : 1

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)