Breaking News

అమెరికా ఉద్యోగాన్ని కాదని వ్యవసాయం..! ఏకంగా ఆరుసార్లుకు పైగా..

Published on Thu, 08/27/2026 - 12:10

చాలామంది పెద్ద పెద్ద రిస్క్‌లు తీసుకుని అలవోకగా విజయాలందుకుంటుంటారు. హాయిగా మంచి పొజిషనల్‌ ఉన్న లైఫ్‌ని కొందరు కిక్‌ కోసం.. కష్టాల్లోకి వెళ్లి మరి.. సక్సెస్‌ని పట్టుకునేందుకు వెంపర్లాడుతుంటారు. అయితే ఆ క్రమంలో వచ్చే అపజయాలకు ఆగిపోకుండా ధైర్యంతో ముందుకు సాగితేనే గెలుపు పిలుపు వినిపిస్తుంది. అచ్చం అలానే చేశాడు ఈ వ్యక్తి. ఒకటి, రెండు సార్లు కాదు..ఏకంగా ఎన్నిసార్లు ఓటమి పలకరించి భయపెట్టిందో తెలిస్తే విస్తుపోతారు. మరి చివరికి సక్సెస్‌ అందుకున్నాడా అంటే..

అతడే శశికుమార్‌ అనే పారిశ్రామికవేత్త. అతడి స్ఫూర్తిదాయక కథ నిజంగా యువతకు పెద్ద పాఠం, కనువిప్పు కలిగించే స్టోరీ కూడా.  ఈ టెకీ అమెరికాలోని విప్రోలో హాయిగా ఐటీ ఉద్యోగిగా బిందాస్‌ లైఫ్‌ని లీడ్‌ చేస్తున్నాడు. అయినా సరే ఏదో వెలితి వెంటాడుతూ ఉండటంతో..ఉన్న సౌకర్యవంతమైన ఉద్యోగాన్ని కాదని వ్యవసాయం చేయాలని అగ్రికల్చర్‌ రంగంలోకి దిగాడు. ఇది అలాంటి ఇలాంటి భారీ రిస్క్‌ కాదు. 

ఎందుకుంటే ప్రస్తుతం వ్యవసాయం ఏ పరిస్థితుల్లో ఉందో తెలియంది కాదు. పంటలు పండినా..గిట్టుబాటు ధరలేక విలవిలలాడుతున్నారు రైతన్నలు. అలాంటి టైంలో ఈ టెకీ అతిపెద్ద సాహసం చేసి మరి వ్యవసాయంలోకి దిగాడు. తను తీసుకున్న ఈ అనుహ్య నిర్ణయం ఎన్నిసార్లు అగ్నిపరీక్ష పెట్టిందో తెలిస్తే కంగుతింటారు. మొదట్లో రైతులకు తన వంతుగా సాయం చేద్దామని అక్షయకల్ప పేరుతో వ్యవసాయానికి సంబంధించిన వ్యాపారాన్ని ప్రారంభించాడు. 

అందుకోసం కార్పొరేట్‌ జీవితానికి స్వస్తి పలికి మరి పూర్తిస్థాయిలో ఇందులో కొనసాగాలని భావించాడు. అయితే శశికుమార్‌ ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా పదిసార్లు దివాళ పరిస్థితికి వచ్చేశాడు. మరొకరు ఎవరైనా తక్షణమే ఇది తనకు సరైనది కాదని వెనుదిరిగేవారేమో..కానీ శశి కుమార్‌ అదుకు ససేమిరా అంటూ మొండిగా ముందుకుసాగాడు. భార్య అండ దండతో ఆమె దాచిన రూ. 30 లక్ష పొదుపు సాయంతో కష్టాల్లో ఉన్న కంపెనీనిని నిలదొక్కుకునేలా చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉండేవాడు. 

అతడు స్థాపించిన అక్షయకల్ప అనేది సర్టిఫైడ్‌ ఆర్గానిక్‌ డైరీ సంస్థ. రసాయనాలు లేని పాలు, పాల ఉత్పత్తులు, ఆర్గానిక్‌ ఆహారాలను అందించే సంస్థ. అయితే అతడు చివరికి చాలా కష్టాలు పడి విజయవంతంగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని నడపడం ప్రారంభించాడు. అంతేగాదు రైతులకు ప్రతి నెలరూ. 1.28 లక్షలు చొప్పున వార్షికంగా రూ. 480 కోట్లు పైనే చెల్లిస్తున్నాడు. ఈ రోజు అక్షయకల్పలో 2800 మంది రైతులు ఉన్నారు. అంతేగాదు ఈ కంపెనీ ప్రతి నెల ఏకంగా రూ. 60 కోట్ల లాభం చొప్పున ఏడాదికి దాదాపుగా రూ. 600 కోట్లుపైనే ఆర్జిస్తుండటం విశేషం. 

అంతేగాదు అతడు తీసుకున్న నిర్ణయాన్ని తండ్రి గట్టిగా వ్యతిరేకించాడట కూడా. పైగా తాను చేసిన వ్యవసాయ కష్టాన్నే తన కొడుకు ఎంచుకోవడం అస్సలు నచ్చలేదట. అమెరికాలో మంచి ఉద్యోగాన్ని కాదనుకున్నాడనే కోపంతో కుమారుడితో దాదాపు ఎనిమిదేళ్లు మాట్లాడటమే మానేశాడట. చివరికి స్వయంగా తండ్రే మెచ్చుకునేలా వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించాడు..రైతులకు అండదండగా నిలిచాడు. నెటిజన్లు అతడి అపారమైన పట్టుదలకు పిదా అవ్వుతూ గ్రేట్‌ సార్‌ మీరు, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో కూడా దీన్ని ప్రారంభించొచ్చు కదా అంటూ పోస్టులు పెట్టారు.  

(చదవండి: 16 ఏళ్ల స్టూడెంట్‌ ఘనత..! తండ్రికే జీతం ఇస్తున్న తనయుడు..)

 

Videos

రాజీనామా చెయ్! నీకు రోజులు దగ్గర పడ్డాయి ధూళిపాళ్ల నరేంద్ర... బ్రాహ్మణుల ఉసురు ఊరికే పోదు

పందితో 30 నిమిషాల ఫైట్.. 14 ఏళ్ల కుర్రాడి దమ్ము చూస్తే షాక్!

ఇరుముడి హిట్‌తో రవితేజ దశ తిరిగిందా?

నేపాల్ వరదలకు అసలు కారణమేంటి? మరో ముప్పు ఎందుకు?

మరో జలవిలయం.. ప్రాణభయంతో జనం పరుగులు

నేపాల్ వరదల్లో.. ఏపీ, తెలంగాణ యాత్రికులు గల్లంతు

జిమ్ ట్రైనర్ సతీష్ రెడ్డి హత్య.. సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు

అమ్మవారికి మంగళ సూత్రాలు సమర్పించిన అంబటి మురళి

"కొడుకా ఎక్కడున్నావురా నాన్నా”.. తండ్రి ఆరాటం కంటతడి పెట్టిస్తోంది!

కరెంట్ పోల్ ఎక్కిన తాగుబోతు.. గంటపాటు టెన్షన్

Photos

+5

ఓనం వేడుకలో కృతి శెట్టి.. (ఫోటోలు)

+5

సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన తార మంజు వారియర్..(ఫోటోలు)

+5

ఫ్యామిలీతో అనుపమ ఓనం సెలబ్రేషన్స్.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : చార్మినార్ వద్ద ఘనంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు (ఫొటోలు)

+5

రాఖీ పౌర్ణమి.. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సందడే సందడి (ఫొటోలు)

+5

'టాక్సిక్' మూవీ ట్రెండింగ్ లో నయనతార (ఫొటోలు)

+5

హీరోయిన్ మానస వారణాసి ఓనం సెలబ్రేషన్స్.. (ఫొటోలు)

+5

నేపాల్‌లో వరద బీభత్సం... (ఫొటోలు)

+5

'రోమాంచకం' మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

దుబాయిలో తన డ్యాన్స్ స్టూడియోలో పూర్ణ ఓనం సెలబ్రేషన్స్ (ఫొటోలు)