Breaking News

టెక్‌ మిలియనీర్‌ హెల్తీ స్కిన్‌ చిట్కాలు..!

Published on Sun, 09/29/2024 - 16:42

అమెరికన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ బ్రయాన్‌ జాన్సన్‌ గురించి ప్రత్యేకంగ చెప్పాల్సిన పనిలేదు. నిత్య యవ్వనంగా ఉండేందుకు కోట్లు ఖర్చుపెడుతున్న వ్యక్తిగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. 46ఏళ్ల ఈ టెక్‌ మిలియనీర్‌ తన జీవ సంబంధ వయసును తిప్పికొట్టి 18 ఏళ్ల కుర్రాడిలా యవ్వనంగా కనిపించాలని సప్లిమెంట్లతో కూడిన కఠిన ఆహార నియమావళిని అనుసరించేవాడు. 

దీన్ని తన బ్లూప్రింట్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా ఎప్పటికీ యవ్వనంగా ఉండేలా ప్రయోగానికి పూనకున్నాడు. అందుకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ నెటిజన్లతో షేర్‌ చేసుకునేవారు. తాజగా ఆయన తన వయసు రీత్యా చర్మంలో వచ్చే మార్పులను అందుకు తీసుకోవాల్సిన చిట్కాలను గురించి వివరించాడు. అందుకోసం తాను ఏం చేస్తున్నాడో కూడా వివరించాడు. 

అవేంటంటే..బ్రయాన్ జాన్సన్ 46 ఏళ్ల వయసులో చర్మ సంరక్షణ గురించి అంతగా పట్టించుకోలేదని చెప్పుకొచ్చారు. అందువల్ల వృధాప్య లక్షణాలు వచ్చి తన చర్మం ఎలా ముడతలు పడినట్లయ్యిందో తెలిపారు. అంతేగాదు తన జీవ సంబంధమైన వయసుని తిప్పికొట్టి చర్మం కాంతిగా కనిపించేందుకు ఆరోగ్యకరమైన ఆహారంపై దృష్టిపెట్టడం అత్యంత అవసరమని అన్నారు. 

వడదెబ్బ, సరైన ఆహారం తీసుకోకపోవడం, తగిన బాడీ క్రీమ్‌లు వాడకపోవడం తదితర కారణాల వల్ల చర్మం తొందరగా ఆకర్షణీయతో కోల్పోతుందన్నారు. ఫలితంగా వయసు పెద్దగా కనిపించేలా చేస్తుందని అన్నారు. ప్రస్తుతం తన చర్మం మెరుగుపడి 37 ఏళ్ల వయసు వారిలా కనిపిస్తుందని కూడా చెప్పారు. అలాగే ఆరోగ్యకరమైన చర్మం కోసం కొన్ని చిట్కాలు కూడా షేర్‌ చేశారు. వ్యాయామం, నిద్రకు ప్రాధాన్యత ఇవ్వడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం తదితరాలే చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయని అన్నారు. అలాగే సన్‌స్క్రీన్‌ లోషన్‌లు వంటి ఉపయోగించి చర్మ దెబ్బతినకుండా కాపాడుకోవాలని చెప్పారు. 

అందుకోసం తాను అనుసరిస్తున్న కఠిన ఆహార నియమావళి గురించి తెలిపారు. అలాగే ఉదయం, రాత్రి వేళలు తప్పనిసరిగా ముఖం కడగడం, మినరల్‌ సన్‌స్క్రీన్‌ను పూయడం, మాయిశ్చరైజర్లను వాడటం వంటివి చేస్తానని అన్నారు. చర్మం ఆరోగ్యం కోసం  నియాసినామైడ్, విటమిన్ సి, హైలురోనిక్ యాసిడ్, ప్రిస్క్రిప్షన్ ట్రెటినోయిన్ వంటి నిర్దిష్ట క్రీముల వినియోగాన్ని కూడా వివరించారు. ప్రతి ఒక్కటి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచి, నష్టాన్ని నివారిస్తాయని చెప్పారు. అలాగే చర్మసంరక్షణ ఉత్పత్తులో తరుచుగా కనిపించే ఎండోక్రైన్ డిస్‌రప్టర్‌లు మంచివి కావని, ఇది వన్యప్రాణులు, మానవుల ఆరోగ్యానికి హానికరమైనవని చెప్పుకొచ్చారు. 

తన చర్మం నిత్య యవ్వనంగా కనిపించేలా టిక్సెల్, సోఫ్‌వేవ్, యు స్కల్ప్ట్రా వంటి చికిత్సలను ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఇవి కొల్లాజెన్‌ ఉత్పత్తిని ప్రేరేపించి చర్మ దృఢత్వాన్ని మెరుగుపరుస్తాయని అన్నారు. దీంతోపాటు రెడ్‌లైట్‌ థెరపీ, మచ్చలు లేని చర్మం కోసం అక్యుటేన్ మైక్రోడోసింగ్ వంటి వాడకం గురించి కూడా చెప్పారు జాన్సన్‌. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

 

(చదవండి: పంజాబ్‌ సీఎంకి లెప్టోస్పిరోసిస్ నిర్ధారణ! అంటే ఏంటీ? ఎందువల్ల వస్తుంది?)

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)