Breaking News

ఐవీఎఫ్‌ రాజధాని.. తమిళనాడు!

Published on Sat, 01/10/2026 - 09:16

దేశంలో 2026 జనవరి 6 నాటికి మొత్తం 2,650 ఐవీఎఫ్‌ క్లినిక్స్‌ ఉన్నాయి. ఇందులో 25 శాతానికిపైగా క్లినిక్స్‌తో.. భారతదేశపు ఐవీఎఫ్‌ క్లినిక్‌ల రాజధానిగా తమిళనాడు అవతరించిందని ‘నేషనల్‌ ఎ.ఆర్‌.టి. (అసిస్టెడ్‌ రీప్రొడక్టివ్‌ టెక్నాలజీ), సరోగసీ రిజిస్ట్రీ; ఎస్‌.ఆర్‌.ఎస్‌. (శాంపిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టమ్‌) రిపోర్ట్‌ – 2023 గణాంకాలు చెబుతున్నాయి. కృత్రిమ విధానంలో సంతాన భాగ్యం ప్రసాదించే చికిత్సా విధానమే ఇన్‌ విట్రో ఫెర్టిలైజేషన్‌. దీనికి గతంలో ఎన్నడూ లేనంతగా దేశంలో ఇప్పుడు క్రేజ్‌ పెరిగింది. ఫలితంగా క్లినిక్కులూ పెరుగుతున్నాయి. నేషనల్‌ ఎ.ఆర్‌.టి. (అసిస్టెడ్‌ రీప్రొడక్టివ్‌ టెక్నాలజీ), సరోగసీ రిజిస్ట్రీ గణాంకాల ప్రకారం దేశంలో అత్యధిక ఐవీఎఫ్‌ క్లినిక్‌లు తమిళనాడులో ఉన్నాయి. ఎంత ఎక్కువగా అంటే రెండో స్థానంలో ఉన్న గుజరాత్‌లో 361 ఉంటే.. దాదాపు వాటికి రెట్టింపుగా 669 క్లినిక్‌లు ఉండటంతో సంతాన సాఫల్య చికిత్సలకు తమిళనాడు ప్రధాన కేంద్రంగా మారింది.

సామాజిక కారణాలు
తమిళనాడులో ఐవీఎఫ్‌ క్లినిక్‌లు అత్యధిక స్థాయిలో ఉండటానికి సామాజిక, ఆరోగ్య అంశాలను రిజిస్ట్రీ ప్రధాన కారణాలుగా చూపింది. తగ్గుతున్న జననాల రేటు, ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోవటం, కెరీర్‌పై దృష్టి పెట్టటం వంటి వాటి వల్ల ఆ రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు జాతీయ సగటు (2.0) కంటే కూడా బాగా తగ్గిపోయి ఐవీఎఫ్‌ చికిత్సలకు డిమాండ్‌ పెరిగిందని విశ్లేషించింది. అంతేకాదు, తమిళనాడులో ప్రైవేట్‌ వైద్య రంగం అధునాతన సదుపాయాలతో ఉంది. కొత్త సాంకేతికతను వెంటవెంటనే అందిపుచ్చుకుంటోంది. అందువల్ల సంతాన సాఫల్య చికిత్సలు ఆ రాష్ట్రంలో సులువుగా అందుబాటులోకి వస్తున్నాయని తెలిపింది.

చట్టబద్ధమైన నమోదు
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎ.ఆర్‌.టి. నియంత్రణ చట్టం, తమిళనాడులోని క్లినిక్‌లు తమ పేర్లను నమోదు చేసుకోవటంలో పారదర్శకంగా ఉండేందుకు దోహదపడుతోందని రిజిస్ట్రీ తెలిపింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ నిబంధనల అమలు మెరుగ్గా ఉండటం వల్ల కూడా అధికారిక లెక్కల్లో క్లినిక్‌ల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. చెన్నై వంటి నగరాలు ఇప్పు­డు కేవలం తమిళనాడుకే కాకుండా, దేశవ్యాప్తంగా, ఇతర దేశాల నుంచి వచ్చే వారికి కూడా ‘ఫెర్టిలిటీ హబ్‌’గా మారాయి. నిపుణులైన డాక్టర్లు, అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉండటం కూడా తమిళనాడుకు ఈ గుర్తింపును తెచ్చిపెట్టిందని పేర్కొంది.

ఆ రాష్ట్రాల్లో ఎక్కువగా..
గణాంకాల ప్రకారం చూస్తే.. దేశంలో సంతానోత్పత్తి రేటు తక్కువగా ఉన్న తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక వంటి కొన్ని రాష్ట్రాల్లో ఈ ఐవీఎఫ్‌ క్లినిక్కులు  ఎక్కువగా ఉన్నాయి. మహారాష్ట్ర, కేరళలలో సంతానోత్పత్తి రేటు తక్కువగా ఉన్నప్పటికీ క్లినిక్‌లు ఎక్కువగా లేవు.


 

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)