Breaking News

నటి స్నేహ ఫిట్‌నెస్‌ సీక్రెట్‌..! ఆ డైట్‌ బాగా పనిచేస్తోంది..కానీ అది మాత్రం..

Published on Mon, 06/16/2025 - 17:01

టాలీవుడ్‌ నటి స్నేహ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళం నుంచి వచ్చినా..తెలుగు ప్రేక్షకుల అశేష ఆదరాభిమానాలు పొందిన నటి. ఫ్యామిలీ ఓరియంటెడ్‌ మూవీలతో అలరించిన హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంది. నాలుగు పదుల వయసులో కూడా అంతే అందం గ్లామర్‌తో తన అభిమానులను కట్టిపడేస్తోంది స్నేహ. అంతలా వన్నెతరగని లావణ్యంతో కట్టిపడేసే స్నేహ ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ ఏంటో చూద్దామా..!.

తమిళంలో పున్నాగై అరిసిగా పిలిచే స్నేహ వెయిట్‌లాస్‌ ట్రైనింగ్‌ తర్వాతే తాను చాలా స్ట్రాంగ్‌ ఉన్నట్లు భావిస్తున్నాని పేర్కొంది. తాను ఆహారపరంగా చాలా క్లీన్‌ అండ్‌ నీట్‌గా తింటానని చెబుతోంది. అంతేగాదు రోజులో ఎన్ని కేలరీలు తీసుకుంటాననే దానిపై పూర్తి ఫోకస్‌ పెడాతానంటోంది. 

నెలకు ఒక్కసారి తప్ప చక్కెర తీసుకునే ఛాన్సే లేదంటోంది. ఆహారం అనేది పిండిపదార్థం, ఖనిజాలు, ఫైబర్‌, ప్రోటీన్ల మిశ్రమం అందువల్ల సమతుల్యంగా తీసుకోవడం అనేది అత్యంత ముఖ్యం అని చెబుతోంది. అంతేగాదు ఎక్కువ నీళ్లు తీసుకుంటానని అంటోంది. శుభ్రమైన నీరు, చక్కటి ఆహారం తన దినచర్యలో భాగమని అంటోంది. ఉప్పు, మసాలా చాలా తక్కువగా తీసుకుంటానంటోంది. ఇక వ్యాయామాల పరంగా..యోగా, ఏరోబిక్‌ వంటి అన్ని వర్కౌట్లు చేస్తానంటోంది.

 

నిపుణుల సూచన..
చక్కెర కలిగిన ఆహారాలు  రక్తంలోని చక్కెర స్థాయిలను, ఇన్సులిన్‌ స్థాయిలను పెంచుతాయి. పైగా తిన్న వెంటనే కొవ్వు నిల్వ, ఆకలిని పెంచుతుంది. ముఖ్యంగా సోడాలు, కాఫీలు, ప్యాక్‌ చేసిన ఆహారాలు, కడుపు నిండినట్లు ఉంటాయి గానీ, సరైనా ఆహార ఎంపికలు కావని చెబుతున్నారు వైద్యులు. ఎవ్వరైన చక్కెరను తీసుకోవడం తగ్గిస్తే..రోజువారీ కేలరీల్లో దాదాపు 200–500 కేలరీలు తగ్గినట్లేనట. అంటే వ్యక్తి వారానికి 0.5 నుంచి 1 కిలో బరువు తగ్గడానికి దారితీస్తుంది. ఇది సమగ్ర ఆరోగ్య విధానానికి సరైనది చెబుతున్నారు. 

అలాగే బరువు అదుపులో ఉండటం అనేది మంచి ఆహారపు అలవాట్లు, శారీర శ్రమ, మంచి నిద్ర, ఒత్తిడి నిర్వహణ  వంటివే కీలకపాత్ర పోషిస్తాయని చెబుతున్నారు. ఇక నూనె, ఉప్పు, మసాలాలు తగ్గించడం అనేది మంచి జీర్ణక్రియకు ఇది సరైన పద్ధతని అన్నారు. పండ్లు, కూరగాయలు, ఇంట్లో వండిన భోజనం తదితరాల నుంచే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. ఫలితంగా హైడ్రేటెడ్‌గా ఉండటమే కాకుండా బరువు కూడా అదుపులోనే ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. 

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరిన్ని వివరాల కోసం వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం

(చదవండి: మోడ్రన్‌ బామ్మ..! ఆమె చేసే వర్కౌట్లు చూస్తే షాకవ్వుతారు)

 

#

Tags : 1

Videos

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు