Breaking News

ఏఐ రూపంలో అలరించబోతున్న అలనాటి చందమామ కథలు

Published on Fri, 01/05/2024 - 14:47

పండు వెన్నెల్లో శ్వేతవర్ణంలో వెలిగిపోయే చందమామను చూపిస్తూ అమ్మ గోరు ముద్దలు పెడుతుంటే ఆ హాయిదనం అలాగే ఉండాలనిపిస్తుంది. అమ్మ ప్రేమ ఎంత మాధుర్యమో ... అమ్మ భాష కూడా అంతే తియ్యదనం. తేనెలూరే తెలుగు భాషలో కథలను చెబుతూ అమ్మ తినిపిస్తుంటే ఊహా ప్రపంచాన్ని చుట్టి వచ్చేస్తూ ఉంటాం. అలాంటి చందమామ కథలను మళ్లీ వినాలని ఉందా.. ఆ కథలను కొత్తగా చూడాలని ఉందా. అయితే మీ ఆశ, ఆకాంక్ష తీరే రోజు దగ్గరకొచ్చేసింది.

టెక్నాలజీ పరుగులు పెడుతున్న ఈ రోజుల్లో, నాగరికత కొత్త పుంతలు తొక్కుతున్న ఈ కాలంలో .. నాటి నీతికథలు, సాహసగాథలు నేటి పిల్లలకు ఎంతో అవసరం. అందుకే అదే టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ స్వేచ్ఛ సంస్థ చందమామ కథలను ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్ టూల్ ద్వారా సరికొత్తగా మనకు అందిస్తుంది. నేడు మన మొబైల్ లో వాడే తెలుగు అక్షరాలు ఈ స్వేచ్ఛ సృష్టించినవే. అదే స్వేచ్ఛ నేడు ఈ అద్భుతమైన అందమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

40 వేల కథలను ఇప్పటికే అప్ లోడ్ చేసిన స్వేచ్ఛ బృందం .. సరికొత్త కథలు వచ్చేలా టూల్ ను కూడా సిద్ధం చేసింది. అమృతగాథలను సృష్టించే ఈ వినూత్న కార్యక్రమానికి తెలుగు సాహితీవేత్తలు, రచయితలు, కవులతో పాటు, మాతృభాషపై మమకారం కలిగిన ప్రతి ఒక్కరికీ ఆహ్వానం పలుకుతున్నామని నిర్వాహకులు తెలిపారు. రేపు (శనివారం 2024 జనవరి 6వ తేదీ) ఈ ఆవిష్కరణ జరగనుంది. గచ్చిబౌలి స్వేచ్ఛ ఆఫీసులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)