Breaking News

Hi నాన్న.. కష్టాల కొలిమిలో... నవ్వుల కలిమి

Published on Thu, 06/18/2026 - 08:17

నా ఇరవయ్యవ ఏట అరవై కూడా దాటకుండా వెళ్లిపోయాడు మా నాన్న. ఒక చిన్న సంసారం... భార్య జయమ్మ, ముగ్గురు పిల్లలు సుజాత, నరసింహమూర్తి, గోపి, అమ్మ సుబ్బమ్మ, తమ్ముడు రాములు.. వీళ్ల కోసం ఆయన జీవితమంతా పోరాడాడు. తెనాలి మసోడి షెడ్‌ మా నాన్న కొంజేటి వెంకటేశ్వర్లు ఆఫీస్‌. ఆయన నడిపే లారీతో పాటు ఆయన స్నేహితులు ఉండే చోటు కూడా అదే.

ఎనిమిదేళ్లుంటాయ్‌ నాకప్పుడు. వర్షం పడ్డ కాసేపటికి నాన్న చేయి పట్టుకుని షెడ్డుకి వెళ్లా. మా నాన్న స్నేహితుడితో ‘‘ఒరేయ్‌ ఇవ్వాళ నీ డ్యూటీకి నేను వెళతాను. నా కూతురు పుట్టినరోజు వస్తోంది. దానికి ఏమైనా ఇవ్వడం మాట సరే కనీసం భోజనం..’’ దుఃఖం ఎక్కువైతే గొంతు మూగబోతుంది. నా తండ్రి గొంతు బరువుగా మాట్లాడిన ఆ క్షణం నాకింకా గుర్తుంది. అప్పటికే నాలుగు రోజులు డ్యూటీ చేసిన మనిషి. అయినా మళ్లీ స్నేహితుడి దగ్గర లారీ తాళం తీసుకుని, తెనాలి అంబమ్మ హోటల్‌ భోజనం కట్టించుకుని ఇంటికొచ్చాడు. అమ్మ వడ్డిస్తుంటే నేను గబగబా తింటున్నా. వాకిట్లో ఉన్న నాన్నని చూసి ‘నాన్నా! నువ్వు రావేం’ అన్నాను. భుజం మీదున్న తువ్వాలుతో కళ్లు తుడుచుకుంటున్నాడు. అర్థం కాలేదు నాకు.. ఆ వయసులో ఆకలి మీదున్న దృష్టి మా నాన్న కళ్ల మీదకి పోలేదు..

ఎర్ర పరికిణీ వేసుకుని స్కూలుకి వెళ్లడం, ఆపై కాలేజీ దాని తర్వాత పెళ్లి, పిల్లలు.. ఇలా నా చుట్టూ అల్లిన జీవితపు మల్లెతోటలో ఆనందాన్ని మాత్రమే నింపిన ఆయన, తన జీవితంలోని కష్టాల ముళ్ల కంచెల్ని మాత్రం నాకు తెలియకుండా దాచేశాడు. తన స్నేహితులు ఆయన్ని సావిత్రి అంటూ పిలిచేవారు. సతీనాటకంలో సావిత్రి వేషంలో చాలా బాగా చేశాడని అలా అంటారంతా.. కాని మేం పెద్దవాళ్లవుతున్న కొద్దీ ఆయన నాటకాలకు దూరమయ్యాడు. మాకోసమే నాటకాలొద్దనుకున్నాడని, మాకు మూడు పూటలా అన్నం పెట్టేందుకు తనొక్కపూటే తింటున్నాడని, ఆయన మాతో ఉన్నన్నినాళ్లూ తెలియలేదు. కష్టాల కొలిమిలో కాలుతున్నా నిలువెత్తు చిరునవ్వుకి చిరునామాగా నిలిచి నా ఎదుగుదలని చూడకుండానే వెళ్లిపోయావు నాన్నా!.. నీకంటూ మేమేమీ ఇవ్వలేకపోయినా.. నువ్విచ్చిన మొండిధైర్యం, పట్టుదల, శక్తి మాకు వరం.


– సి. సుజాత, రచయిత్రి, జర్నలిస్ట్‌

నిర్వహణ: శ్రావణ్‌ జయ

  • మీరు కూడా మీ నాన్నతో ఉన్న ఓ మంచి జ్ఞాపకాన్ని మీ నాన్న ఫొటోతో సహా ఈ కింది నంబర్‌కు మెయిల్‌ లేదా వాట్సాప్‌ చేయండి. 9281020501, sakshifamily3@gmail.com

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)