Breaking News

పాపం.. పిల్లి అనుకుని పాంపర్‌ చేశాడు, అసలు సంగతి ఇదీ!

Published on Wed, 10/29/2025 - 13:12

సోషల్‌ మీడియా విశేషాల పుట్ట. మంచో, చెడో, విశేషమో, వికారమో ఏదో ఒక వీడియో నెట్టింట సందడి చేస్తూనే ఉంటుంది. తాజాగా  ఒక వీడియో ఎక్స్‌లో  చక్కర్లు కొడుతోంది.  మరీ ముఖ్యంగా ఫేక్‌ వీడియోలు,  ఏఐ వీడియోలు  తెగ  వైరల్‌ అవుతున్న నేపథ్యంలో  అప్రమత్తంగా ఉండాలి.   ఇపుడు మీరు చదవబోయేది  అలాంటిదే..


మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రలో ఉన్న పెంచ్‌ నేషనల్‌ పార్క్‌ సమీపంలో అక్టోబర్‌ 4వ తేదీన ఒక వింత సంఘటన చోటు చేసుకుంది.  52 ఏళ్ల కూలీ రాజు పటేల్ పుల్‌గా మద్యం తాగి  రోడ్డుపై వెళుతున్నాడు.  అయితే ఇటీవలి వర్షాలు వరదల కారణంగా , సమీపంలోని పెంచ్ టైగర్ రిజర్వ్  బయటకు వచ్చిన చిన్న బెంగాల్‌ టైగర్‌ రోడ్డుపైకి వచ్చింది.  అటు బెంగాల్‌ టైగర్‌, ఇటు రాజు.. ఇద్దరూ  తారసపడ్డాడు.  అర్థరాత్రి  దాన్ని పిల్లి అనుకున్న రాజు దాన్ని మెల్లిగా  బుజ్జగించడం   మొదలు పెట్టాడు.  ఒక చేత్తో బాటిల్‌ పట్టుకొని  నెత్తిమీద  సున్నితంగా నిమిరాడు. అంతే​కాదు..దానికీ  ఓ చుక్క తాగిద్దామని  ప్రయత్నించాడు.  ​కానీ ఆ పులి పట్టించుకోలేదు.  ఏయ్‌.. పిల్లీ  పక్కకు వెళ్లు అంటూ తాగిన మత్తులో గొణిగాడు.  ఇది చూసి  ఆ పులి పట్టించుకోలేదు. ఇంత జరుగుతున్నా అది ఏమీ అనలేదు. దీంతో బతికిపోయాడు రాజు.  పుస్సీ కేట్‌ అనుకుంటూ అక్కడినుంచి సర్దుకున్నాడు. దాదాపు 10 నిమిషాల ఈ తంతు అంతా సీసీటీవీలో రికార్డైంది. తరువాత అటవీ అధికారులు స్పాట్‌లైట్లు, తేలికపాటి ట్రాంక్విలైజర్లతో వచ్చి అలసిపోయిన పులిని తెల్లవారుజామున 3 గంటలకు అడవిలోకి తిరిగి పంపించారు. ఎవరికీ  ఎలాంటి హాని జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నాడు. అయితే  రాజు  మాత్రం ఇప్పుడు భారీ పోలీసు రక్షణలో ఉన్నాడట. అతని సోషల్ మీడియా ఖాతాను బ్లాక్ చేశాడు . మరోవైపు  అంత ధైర్యం ఎలా వచ్చింది..  నీవు తాగిన  డ్రింక్‌ రెసిపీ  చెప్పు భయ్యా.. అంటూ పెళ్లైన మగాళ్లు వెంటబడుతున్నారంటూ పలు జోక్స్‌ పేలుతున్నాయి. @dekhane_mukul  నిజంగా జరిగిందే అంటూ షేర్‌ చేసిన ఈ వీడియో నెట్టింట  హల్‌ చల్‌ చేసింది. అసలు నిజం ఏమి మాత్రం వేరేలా ఉంది. 

అయితే  ఇది ఏఐ జెనరేటెడ్‌ వీడియో అని  ఫారెస్ట్‌ అధికారు ఒకరు స్పందించారు. ఇలాంటి వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు

— Mukul Dekhane (@dekhane_mukul) October 29, 2025

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)