Breaking News

Surabhi Yadav: జ్ఞాపకాలకు జీవం..

Published on Sun, 06/30/2024 - 04:35

ఇంట్లో పెద్దవాళ్లు ఎవరైనా మరణిస్తే వారు వాడిన వస్తువులను జ్ఞాపకంగా భద్రపరచుకుంటాం. కొందరు ఆ వస్తువులు ఎందుకులే అని ఎవరికైనా ఇవ్వటమో.. అమ్మేయడమో చేస్తుంటారు.  మీరట్‌కు చెందిన సురభి యాదవ్‌ మాత్రం తన అత్తగారు మరణించాక ఆమె గుర్తుగా ఉన్న వస్తువులను ఉపయోగంలోకి తెచ్చి, వాటికి తిరిగి జీవం పోయాలనుకుంది. అత్తగారి జ్ఞాపకాలుగా మిగిలిన వస్తువుల్లో 300 రకాల మొక్కలను పెంచుతూ.. ఇంటికి కొత్త కళను తీసుకొచ్చింది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..

‘మా అత్తగారు కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌లో పోయారు. ఆవిడ లేని మా ఇల్లు కళ కోల్పోయినట్టు.. దిగులుగా అనిపించేది. ఇంట్లో మా అత్తగారు ఉపయోగించినవి, ఆమె సేకరించిన పాత్రలు చాలా ఉన్నాయి.

అవి ఆమె 30ఏళ్ల కష్టానికి ప్రతీకలు. ఆవిడ జ్ఞాపకాలు. వాటికి కొత్తరూపం ఇచ్చి రోజువారీ వాడకంలోకి తెస్తే ఆవిడ మా మధ్య తిరిగినట్టే ఉంటుంది కదా.. ఎప్పటిలాగే ఇల్లు కళకళలాడుతుంది కదా అనిపించింది. అంతేకాదు దానివల్ల ఎంతోకొంత పర్యావరణానికి మా వంతు సాయం చేసినట్టవుతుంది అనిపించింది. అందుకే మా అత్తగారి కాలంనాటి  సీసాలు, పాత్రలు, లాంతర్లు, ఫ్యాన్‌.. వంటివాటిని అందమైన ప్లాంటర్స్‌గా మార్చాను. నాకు ఎంతో ఊరట కలిగింది. ఒక అవగాహనా వచ్చింది.

దాంతో మిగిలిన వస్తువుల్లో కొన్నిటిని అందమైన బొమ్మలుగా మార్చాను. ఇంకొన్నిట్లో మొక్కలను పెంచడం మొదలుపెట్టాను. ఇప్పుడు మా టెర్రస్‌ గార్డెన్‌లో పూలు, కూరగాయలు సహా 300 రకాల మొక్కలున్నాయి. నేనేం పెద్ద గార్డెనర్‌ని కాదు. నాకు తోచినట్టుగా ఓ చిన్నతోటతో మా అత్తగారి ప్రపంచాన్ని సజీవంగా మార్చేశాను!’ అని చెబుతుంది సురభి యాదవ్‌.
 

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)