Breaking News

ఏమున్నాడు రా బాబు.. మహేశ్‌ అందానికి సీక్రెట్‌ ఏంటి?

Published on Mon, 07/31/2023 - 13:28

టాలీవుడ్‌ మోస్ట్‌ హ్యాండ్సమ్‌ హీరో ఎవరంటే సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు అనే ఠక్కున చెప్పేస్తారు. అమ్మాయిల కలల రాకుమారుడిగా మహేశ్‌కు విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. నాలుగు పదుల వయసులోనూ పాతికేళ్ల కుర్రాడిలా కనిపిస్తారు మహేశ్‌. వయసు పెరిగే కొద్దీ ఆయన అందం మరింత పెరుగుతుందా అనే సందేహం ఎవరికైనా వస్తుంది.

ఏమున్నాడు రా బాబు, అచ్చం హాలీవుడ్‌ కటౌట్‌ అంటూ మహేశ్‌ లుక్స్‌కి ఫ్యాన్స్‌ ఆశ్చర్యపోతుంటారు. అమ్మాయిల మనసు కొల్లగొట్టడంలో మహేశ్‌ తర్వాతే ఎవరైనా. మరి మహేశ్‌ ఏం తింటాడు? 50కి దగ్గరవుతున్నా ఇంత హ్యాండ్స్‌మ్‌గా, ఛార్మింగ్‌ లుక్‌ ఎలా మెయింటైన్‌ చేయగలుగుతున్నాడు? ఆయన అందం వెనుకున్న సీక్రెట్స్‌ ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. 

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు అందం గురించి అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా అసూయపడుతుంటారు. ప్రతి సినిమాకి సరికొత్త లుక్‌లో కనిపిస్తూ ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేస్తుంటాడు మన సూపర్‌స్టార్‌. దీంతో ఆయన గ్లామర్‌ వెనుకున్న సీక్రెట్‌ ఏంటో తెలుసుకోవాలని హీరో,హీరోయిన్లు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా మహేశ్‌ బాబు తన ఫ్యామిలీతో లండన్‌ ట్రిప్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ దిగిన పలు ఫోటోలను మహేశ్‌ భార్య నమ్రత సోషల్‌ మీడియా వేదికగా పంచుకోగా, మహేశ్‌ యంగ్‌ లుక్‌కి నెటిజన్లు ఫిదా అయ్యారు. దీంతో ఆయన ఫిట్‌నెస్‌, డైట్‌ విషయం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది.

గతంలో సర్కారు వారి పాట సినిమా ప్రమోషన్స్‌ టైంలో మహేశ్‌ సినిమా విషయాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు. తన డైట్‌ గురించి ప్రస్తావిస్తూ..  “చాలా వరకు అన్నీ తింటాను, కానీ లిమిట్స్ లో తింటాను.పెరుగు, డైరీ ప్రోడక్ట్స్, పిజ్జాలు, బర్గర్, బ్రెడ్, జంక్ ఫుడ్ లాంటివి అస్సలు తినను. పిల్లలతో ఉన్నప్పుడు సరదాగా స్వీట్స్ లాంటివి కొన్ని తింటాను వాళ్ళ కోసం. ఆల్మండ్ మిల్క్ తో చేసిన పదార్థాలు తింటాను. ఇలా స్ట్రిక్ట్‌ డైట్‌ ఫాలో అయ్యి సుమారు పదేళ్లవుతుంది. మొదట్లో కాస్త కష్టంగా అనిపించినా ఆ తర్వాత అలవాటైపోయింది అంటూ మహేశ్‌ స్వయంగా తెలిపాడు.

మనం తినే తిండి ఎంత ముఖ్యమో, సంతోషంగా ఉండటం కూడా అంతే ముఖ్యమని, బహుశా అదే తన ఎనర్జీకి కారణమై ఉంటుందని వివరించాడు. జీవితంలో ఒత్తిడి లేకుండా చూసుకుంటాను. ఏ విషయాన్ని అయినా పెద్దగా ఆలోచించను. అదే నా ఎనర్జీ సీక్రెట్’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక మరో సీక్రెట్‌ ఏంటంటే.. ప్రతిరోజూ మహేశ్‌ మూన్‌ ధ్యానం చేస్తారట. అంటే ప్రతిరోజూ చంద్రుని నీడలో ధ్యానం చేస్తారట. దీని వల్ల మనసు ప్రశాంతంగా ఉండటంతో పాటు పాజిటివ్‌ ఎనర్జీ వస్తుందట.

సుధీర్ఘ కాలం నుంచి మహేశ్‌ ఈ మూన్‌ ధ్యానం చేయడం వల్ల ఇంత ఛార్మింగ్‌గా కనిపిస్తారని ఆయనతో పనిచేసిన ఫైట్‌ మాస్టర్స్‌ రామ్ –లక్ష్మణ్‌లు గతంలో ఓ ఇంటర్వ్యూలో రివీల్‌ చేశారు. ఇక ఫిజికల్‌ ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ద వహించే మహేశ్‌ బాబు షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా క్రమం తప్పకుండా జిమ్‌ చేస్తాడట. ఇక మహేశ్‌ బాబు అందం వెనుక ఓ డెర్మటాలజిస్ట్‌ కూడా ఉన్నారు.  క‌ర్ణాట‌క‌కు చెందిన ర‌ష్మి శెట్టి అనే డాక్టర్‌ గత కొన్నాళ్లుగా మహేశ్‌కు పర్సనల్‌ డెర్మలాటజిస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు