Breaking News

మూడు నెలల ముందే పదేళ్ల జీవితానికి ప్లాన్‌ : కానీ అంతలోనే!

Published on Thu, 06/26/2025 - 11:43

జీవితం బుద్భుత ప్రాయం. ఎవరి ప్రాణాలు ఏ క్షణంలో గాల్లో కలిసిపోతాయో ఎవరికీ తెలియదు. కానీ  అందమైన జీవితం కోసం ఎన్నో  కలలు కంటాం. కీర్తి, ఆస్తి, పిల్లలు, వారి భవిష్యత్తు అంటూ.. రాత్రింబవళ్లు తిండి తిప్పలు కూడా మర్చిపోయి కష్ట పడతాం. కానీ  కొన్ని విషాదాల గురించి తెలుసుకున్నపుడు మాత్రం   ఒకలాంటి నిర్వేదం మన మనసుల్ని ముసురుకుంటుంది.

ముఖ్యంగా ఇటీవలి కాలంలో విహార యాత్రలు విషాదంగా మారిపోయిన  పహల్గాం ఉదంతం,  బెంగళూరు తొక్కిసలాట,  ఘోర విషాదాన్ని మిగిల్చిన విమాన ప్రమాదం లాంటి ఘటనలు చూసినపుడు మనసు మరింత భారమవుతుంది. దాదాపు ఇలాంటి గాథే వ్యాపార వేత్త సంజయ్‌ కపూర్‌ ఆకస్మిక మరణం.

జూన్ 13న ఇంగ్లాండ్‌లో పోలో ఆటలో ప్రమాదవశాత్తు తేనెటీగను మింగి గుండెపోటుకు గురై  53 ఏళ్ల పారిశ్రామికవేత్త ప్రాణాలు కోల్పోతాడని   అసలెవరైనా ఊహిస్తారా?  40వేల కోట్ల ఆస్తిపరుడు సంజయ్ కపూర్, చిన్న ప్రాణి తేనేటీగ మూలంగా కన్నుమూశాడు.  ఆయన అకాల మరణం స్నేహితులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల హృదయాల్లో తీవ్ర శూన్యతను మిగిల్చింది. అంతేకాదు రాబోయే  పదేళ్ల కాలంలో ఎంతో సంతోషంగా,  కుటుంబ సభ్యులతో  కలిసి జీవించాలని కలలు కన్న  ఆయన  కలలు  కల్లలుగానే  మిగిలిపోవడం మరింత  విషాదం. మూడు నెలల క్రితం, తన జీవితంలో ముఖ్యమైన విషయాలపై మరింత దృష్టి పెట్టాలనే ఆశతో  పదేళ్ల తన  జీవిత ప్రణాళికను ఒక సందర్భంలో పంచుకున్నాడు.


"నేను గొప్ప ప్రణాళికదారుడిని. అక్టోబర్‌లో, నేను నా కోసం  పదేళ్ల ప్రణాళికను రాసుకున్నాను.  ఏమి చేయాలి, ఏం చేయకూడదు అనేది చాలా స్పష్టంగా  ప్లాన్‌ చేసుకున్నా. నా గేమ్‌ నాకు చాలా ముఖ్యం, ఆరోగ్యం , ఫిట్‌నెస్ నాకు చాలా ముఖ్యం. నేను యాక్టివ్‌గా  , వీలైనంత ఎక్కువగా పోలో ఆడతాను. అంతకంటే ముఖ్యమైనది ఏమిటంటే నేను నా కుటుంబానికి  సమయాన్ని ఇవ్వాలనుకుంటున్నా..నేను ఉమ్మడికుటుంబం నుంచి వచ్చాను.  ఉమ్మడి కుటుంబాల్లో జీవితం అంత  ఈజీకాదు. కానీ అదృష్టవశాత్తూ ఒకర్నొకరు ప్రేమించుకుంటూ ఆనందంగా గడిపాం. ఇపుడు కూడా భార్యతో జీవితాంతం అలాగే కొనసాగాలను కుంటున్నానని తెలిపారు. కానీ అంతలోనూ అనూహ్యంగా ఈ లోకాన్నించి శాశ్వతంగా సెలవు తీసుకోవడం విషాదం.

కాగా సంజయ్‌ నలుగురు పిల్లల తండ్రి. సమైరా, సఫీరా, కియాన్, అజారియాస్. మాజీ భార్య  బాలీవుడ్‌ నటి కరిష్మాతో కుమార్తె సమైరా, కుమారుడు కియాన్ ఉన్నారు. విడాకుల తరువాత కూడా కరిష్మా  పిల్లలతో తన స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగించారు. మూడో భార్య, ప్రియా సచ్‌దేవ్‌  కుమారిడితో పాటు,  మొదటిభర్త ద్వారా పుట్టిన కుమార్తె సఫీరాను కూడా తండ్రిలాగానే చూసుకునేవాడు. సంజయ్‌ కపూర్‌ అంత్యక్రియలకు  కరిష్మా కపూర్, సైఫ్ అలీ ఖాన్,కరీనా కపూర్ హాజరైన  సంగతి తెలిసిందే.

 నోట్‌ : జీవితాల్ని చిన్నాభిన్నం చేసే ఇలాంటి విషాదాల గురించి  రోజూ వింటూనే ఉంటాం.  నిట్టూరుస్తూనే ఉంటాం. ‘చివరికి మిగిలేది’  ఇదే కదా  అని కూడా అనుకుంటాం. అలాగని జీవితం ఆగిపోదు.  ‘జరిగేవన్నీ మంచికనీ అనుకోవడమే మనిషి పని’ అనుకుంటూ ముందుకు  సాగాల్సిందే. 

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు