Breaking News

'డయాబెటిక్ రైస్' అంటే..? ఇది మధుమేహాన్ని నియంత్రించగలదా..

Published on Tue, 06/03/2025 - 12:47

ఇటీవల కాలంలో అందరిని వేధిస్తున్న తీపి వ్యాధి మధుమేహం. దీని కారణంగా ఏం తినాలన్నా..బాబోయ్‌ షుగర్‌ లెవెల్స్‌ పెరిగిపోతాయేమో అన్న అనుమానం వెంటాడుతుంటుంది చాలామందిలో. దాన్ని క్యాష్‌  చేసుకునేలా మార్కెట్‌ డయాబెటిస్‌ వాళ్లకు ఉపయోగపడే రైస్‌, కూరగాయాలు, స్వీట్లు అంటూ మార్కెట్లో ఇబ్బడిముబ్బడిగా వచ్చేస్తున్నాయి. వాస్తవానికి చాలామందికి కూడా రైస్‌తో భోజనం కానిస్తే కానీ కడుపునిండిన ఫీల్‌​ రాదు. ఇలానే అంటున్నారు బాలీవుడ్‌ ప్రముఖ హీరో గోవింద్‌ భార్య సునీతా అహుజా సైతం. ఆమె కూడా హాయిగా అన్నం తింటేనే ఆ అనుభూతే వేరు అంటున్నారు. కానీ తాను కూడా డయాబెటిస్‌తో పేషెంటేనని, అందుకని రైస్‌ని ఇలా తీసుకుంటానంటూ తన డైట్‌కి సంబంధించిన ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారామె. అంతేగాదు మనకిష్టమైన రైస్‌నే వదులకోకుండా ఆరోగ్యకరంగా ఎలా తీసుకోవాలో కూడా చెప్పారామె. మరి నిపుణులు దీని గురించి ఏమంటున్నారో సవివరంగా చూద్దామా..!.

సెలబ్రిటీ సునీతా ఆహుజా తన ఆహారపు అలవాట్ల గురించి చెబుతూ..తాను నేపాలీగా ఎక్కువ వైట్‌రైస్‌ తినేందుకే ఇష్టపడతానని అన్నారు. అయితే మధుమేహం ఉంది కాబట్టి డయాబెటిక్ రైస్‌కి ‍ప్రాధాన్యత ఇస్తానన్నారామె. దాంతోపాటు రోటీలు కూడా తీసుకుంటానని అన్నారు. 

‘డయాబెటిక్ రైస్’ అంటే..
ఈ ‘డయాబెటిక్ రైస్’ఇటీవలకాలంలో బాగా ప్రజాదరణ పొందింది. ఇది మధుమేహంతో బాధపడుతున్న వారికి ప్రత్యామ్నాయమైన రైస్‌ అని చెప్పొచ్చు. ఇవి రక్తంలో చక్కెర నియంత్రణ కోసం ఉపయోగిస్తారు. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) తక్కువగా ఉంటుంది. సాదారణ బియ్యం కంటే..వీటిలోనే గ్లూకోజ్ స్థాయిలను నెమ్మదిగా పెరుతాయి. అందువల్ల వీటికే మొగ్గు చూపుతున్నారు చాలామంది. అవేంటంటే..

నల్ల బియ్యం
ఎర్ర బియ్యం
గోధుమ బియ్యం
దంపుడు బియ్యం
తక్కువ GI బాస్మతి బియ్యం
మిల్లెట్ ఆధారిత బియ్యం
ప్రాసెస్ చేసిన తక్కువ-కార్బ్ బియ్యం
వాటిల్లో గ్లైసెమిక్‌ సూచిక..
తెల్ల బియ్యం: GI 70–89 (ఎక్కువ)
గోధుమ బియ్యం: GI 50–60 (తక్కువ)
ఎర్ర బియ్యం: GI దాదాపు 55 (తక్కువ)
దంపుడు బియ్యం: GI 38–50 (అత్యల్పం )
మిల్లెట్స్: GI దాదాపు 40–55 (అత్యల్పం)

డయాబెటిక్ బియ్యంతో కలిగే లాభాలు..
భోజనం తర్వాత రక్తంలో గ్లూకోజ్ పెరుగుదల తక్కువగా ఉంటుంది. 
సంతృప్తిని పెంచడం, భాగం నియంత్రణకు సహాయపడుతుంది
దీర్ఘకాలికంగా రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపరగలదు
శుద్ధి చేయబడిన తెల్ల బియ్యంతో పోలిస్తే, తృణధాన్యాలు లేదా తక్కువ GI బియ్యం గ్లూకోజ్ ప్రతిస్పందనను మాడ్యులేట్ చేయడంలో బెస్ట్‌

నిపుణులు ఏమంటున్నారంటే..

ఇక వైద్య నిపుణులు సైతం "డయాబెటిక్ బియ్యం"లో కార్బోహైడ్రేట్ కంటెంట్ తక్కువ అని చెబుతున్నారు. అదే సమయంలో ఇది ఆరోగ్యకరమని అతిగా తీసుకుంటే మాత్రం.. దీనివల్ల కూడా రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోయే అవకాశం లేకపోలేదని హెచ్చరించారు

గ్లైసెమిక్ ప్రభావాన్ని తగ్గించడానికి ఎల్లప్పుడూ స్టార్చ్ లేని కూరగాయలు, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులతో కలిసి తీసుకోవాలని అన్నారు. 

దీంతోపాటు ఇతర ప్రాసెస్‌ చేసిన ఆహారాలను కూడా నివారించాలని సూచించారు. చివరగా తక్కువ-GI, అధిక-ఫైబర్ బియ్యం రకాలు చక్కెర నిర్వహణను గణనీయంగా మెరుగుపరుస్తాయని నమ్మకంగా చెప్పారు. 

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించండి.

(చదవండి: ‘ఎలక్ట్రో కన్వల్సివ్‌ థెరపీ’ అంటే..? ఈ చికిత్స ఎందుకోసం అంటే..)
 

#

Tags : 1

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)