Breaking News

Sundeep Kishan: అలాంటి డైట్‌ ఫాలో అవుతాడా..! అందుకే..

Published on Thu, 02/27/2025 - 17:15

స్నేహగీతం, ప్రస్థానం' చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన యువ కథానాయకుడు సందీప్‌కిషన్‌.బాలీవుడ్‌లోనూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని 2010లో టాప్‌ 3 చిత్రాల్లో ఒకటైన 'షోర్‌ ఇన్‌ ద సిటీ' చిత్రం ద్వారా బాలీవుడ్‌కు పరిచయమై అందరి దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్నాడు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌ తాజాగా రాణాల తరువాత హిందీ సినిమాల్లో నటిస్తున్న హీరోగా సందీప్‌ గుర్తింపు తెచ్చుకున్నాడు. చూడటానికి పక్కింటి కుర్రాడిలా ఉంటే సందీప్‌ చాలా స్మార్ట్‌గా మంచి బాడీని మెయింటైన్‌ చేస్తాడు. అలాగే సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా తన రూపురేఖలను కూడా మార్చుంటాడు చాలా సులభంగా. మరీ అతడి ఫిటనెస్‌ సీక్రెట్‌ ఏంటో చూద్దామా..!.

అందరి హీరోల మాదిరిగా స్ట్రిక్ట్‌ డైట్‌ ఫాలో అవ్వడట. తనకస్సలు స్ట్రిక్ట్ డైట్'పై నమ్మకం లేదని తేల్చి చెప్పాడు. దానికంటే ఏడాది పొడవునా మంచిగా తినడమే మంచిదని చెబుతున్నాడు. చాలామంది కఠినమైన డైట్‌లు ఎంచుకోమని చెబుతారు గానీ, దానిపై తకెందుకనో నమ్మకం రాదని, హయిగా నచ్చిన ఫుడ్‌ తింటూ వ్యాయామాలు చేసుకోవడమే మేలు. 

అలాగే అందరీ బాడీకి ఒకేవిధమైన డైట్‌ సెట్‌ అవ్వదు. ప్రతి శరీరానికి వివిధ రకాలు ఆహార నియమాలు అవసరమవుతాయిని అన్నాడు సందీప్‌. కాబట్టి ఎవరికి వారు తమ బాడీకి ఏది సూటవ్వుతుందో పరీక్షించుకుని ఎంచుకోవడమే ఉత్తమం అని సూచిస్తున్నాడు. తీవ్రమైన కఠిన ఆహార నియంత్రణ కంటే ఒత్తిడిని దూరం చేసే మంచి ఉత్తేజకరమైన ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వడం మంచిదని నొక్కి చెబుతున్నాడు. 

ఏదైతే ఇష్టంగా తింటారో దాన్నే తీసుకోండి, అయితే అది ఆరోగ్యకరమైనదే అయ్యి ఉండాలన్నది గుర్తించుకోండి అని అంటున్నాడు. తాను మాత్రం వివిధ రకాల ఆహారాలను ఆస్వాదించడం తోపాటు, రోజంతా యాక్టివ్‌గా ఉంచే ఆహారానికే ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. 

అలాగే తన బాడీకి సరిపోయే వర్కౌట్‌లు, వ్యాయామాలు కూడా చేస్తానని అన్నాడు సందీప్‌. కాగా, సందీప్‌ నటించిన అమెజాన్‌ ప్రైమ్‌ ఒరిజినల్ సిరీస్ 'ఫ్యామిలీ మ్యాన్ 3' షూటింగ్‌ దాదాపుగా పూర్తి కాగా, త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన 'మజాకా' మూవీ విడుదలైంది.
 

(చదవండి: పదిలో అత్తెసరు మార్కులు, ప్రిలిమ్స్‌ పదిసార్లు ఫెయిల్‌.. అయినా..!)
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)