Breaking News

'డ్రోన్‌ ఐస్‌'

Published on Sun, 07/12/2026 - 10:40

చీకట్లోనే కాదు, వెలుతురులో కూడా చీకటి నేరాలు జరిగే సమయం.. మధ్యాహ్నం రెండు గంటలు. హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్‌ సమీపంలోని ఒక నిర్జన ప్రదేశం. మహాలక్ష్మి బ్యాంక్‌కు చెందిన చెస్ట్‌ వ్యాన్‌ భారీ నగదుతో వెళ్తోంది. అకస్మాత్తుగా రెండు బైక్‌లు, ఒక ఎస్‌యూవీ వ్యాన్‌ ను అడ్డుకున్నాయి. ముసుగులు ధరించిన నలుగురు దుండగులు క్షణాల వ్యవధిలో వ్యాన్‌ తలుపులు బద్దలు కొట్టారు. గార్డులపై దాడి చేసి, డబ్బుతో పరారయ్యారు.

ఇదంతా మెరుపు వేగంతో జరిగింది. గార్డులు తేరుకునేలోపే ముసుగువ్యక్తులు మాయమయ్యారు. రాబరీకి ఐదు నిమిషాల ముందు ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాల వైర్లు కట్‌ చేయబడ్డాయి. స్థానిక పోలీసులకు ఎలాంటి ఆధారాలూ దొరకలేదు. దీంతో ఢిల్లీ నుంచి ప్రైవేట్‌ డిటెక్టివ్‌ సిద్ధార్థ రంగంలోకి దిగాడు. సంఘటనా స్థలంలో సిద్ధార్థకు ఎలాంటి వేలిముద్రలు దొరకలేదు. సీసీటీవీ వైర్లను కట్‌ చేసిన తీరు చూసి, ఇది పక్కా ప్రొఫెషనల్స్‌ చేసిన రాబరీ అని గ్రహించాడు. ఏ కెమెరా ఎప్పుడు పనిచేయదు అనే విషయం తెలిసిన వారే దీని వెనుక ఉన్నారు. అదే సమయంలో ఆ ఏరియాకు కొద్ది దూరంలో ఒక సినిమా షూటింగ్‌ జరుగుతోంది.

ఆ రోజు అక్కడ ఒక భారీ యాక్షన్‌ సీక్వెన్‌ ్స షూట్‌ చేస్తున్నారు. సిద్ధార్థ వెంటనే డైరెక్టర్‌ను కలిసి, ‘రాబరీ జరిగిన సమయంలో మీ దగ్గర ఎలాంటి కెమెరాలు రన్నింగ్‌లో ఉన్నాయి?’ అని అడిగాడు. అప్పుడు ఆ సినిమా కెమెరామెన్, తాము లొకేషన్‌ వైడ్‌ యాంగిల్‌ కోసం ఆ సమయంలో ఒక హై–రెజల్యూషన్‌ 4కే డ్రోన్‌ను గాల్లోకి పంపినట్లు చెప్పాడు.

సిద్ధార్థ వెంటనే ఆ సమయంలో లొకేషన్‌ వైడ్‌ యాంగిల్‌ కోసం వాడుతున్న హై–రిజల్యూషన్‌ డ్రోన్‌ ఫుటేజీని సేకరించాడు.
ల్యాబ్‌లో స్క్రీన్‌ పై ఆ డ్రోన్‌ ఫుటేజీని ప్లే చేసి చూశాడు. అందులో దొంగల ముఖాలు కనిపించలేదు కానీ, వాళ్ళు ఏ వైపు నుంచి వచ్చారో, దోచుకున్న తర్వాత ఏ రహదారి గుండా ఎటువైపు పారిపోతున్నారో స్పష్టంగా రికార్డయ్యింది. ఆ రూట్‌ మ్యాప్‌ను విశ్లేషిస్తున్నప్పుడు సిద్ధార్థకు ఒక కీలకమైన ట్విస్ట్‌ దొరికింది. వ్యాన్‌ లాక్‌ తీయడానికి దొంగలు వాడిన ఎలక్ట్రానిక్‌ కోడ్‌  బ్యాంక్‌ అంతర్గత సిస్టమ్‌కు చెందింది. అంటే లోపలి వాళ్ళ సహాయం లేనిదే ఈ ప్రొఫెషనల్‌ రాబరీ సాధ్యం కాదు.

డిటెక్టివ్‌ సిద్ధార్థ నేరుగా మహాలక్ష్మి బ్యాంకుకు వెళ్లాడు. స్టాఫ్‌ అందరినీ ఒక కాన్ఫరెన్స్‌ హాల్‌లోకి పిలిపించాడు. అందులో బ్యాంక్‌ క్యాషియర్‌ రాఘవన్, సెక్యూరిటీ మేనేజర్‌ విక్రమ్‌ కూడా ఉన్నారు. అందరి ముందూ ఒక పెద్ద ప్రొజెక్టర్‌ స్క్రీన్‌ ను ఏర్పాటు చేశాడు సిద్ధార్థ.
అందరూ చిన్నపాటి కన్ఫ్యూజన్‌లో వున్నారు. ‘ఓ వైపు రాబరీ జరిగిన ఆందోళనలో ఉంటే, ఏమిటిది?’ అనే ప్రశ్న వాళ్ళ మొహాల్లో క్లియర్‌ గా కనిపిస్తోంది.

అందరి వైపు నవ్వుతూ చూస్తూ, ‘‘బ్యాంకు రాబరీ జరిగినప్పటి నుంచి మీరంతా టెన్షన్‌లో ఉన్నట్లున్నారు. ఆ టెన్షన్‌ నుంచి బయటపడడానికి ఒక మంచి యాక్షన్‌ సీక్వెన్‌ ్స చూద్దాం’’ అని చెప్పి డ్రోన్‌ ఫుటేజీని ప్లే చేశాడు.
డిటెక్టివ్‌ సిద్దార్థకు ఎదురు చెప్పలేక చూడడం మొదలుపెట్టారు.
స్క్రీన్‌ పై దొంగలు పారిపోతున్న విజువల్స్‌ వస్తుండగా సిద్ధార్థ గంభీరంగా మాట్లాడటం మొదలుపెట్టాడు.

‘‘ఈ దొంగలు చాలా ప్రొఫెషనల్‌గా ప్లాన్‌ చేశారు. కానీ వ్యాన్‌ బయలుదేరడానికి మూడు నిమిషాల ముందు బ్యాంక్‌ లోపలి నుంచే ఒక ఎన్క్రిప్టెడ్‌ మెసేజ్‌ బయటకు వెళ్ళింది. దొంగలు వాడిన డిజిటల్‌ కీని కూడా బ్యాంక్‌ లోపలి నుంచే యాక్సెస్‌ చేశారు. ఆ పక్కా సమాచారం ఇచ్చింది మరెవరో కాదు...’’ అంటూ సిద్ధార్థ ప్రొజెక్టర్‌ లైట్‌ వెలుతురులో రాఘవన్, విక్రమ్‌ వైపు తీక్షణంగా చూశాడు.
అప్పటికే రాఘవన్, విక్రమ్‌ ముఖ కవళికల్లో భయం స్పష్టంగా కనిపిస్తోంది. వారి ముఖాలు పాలిపోయాయి, నుదుటిపై చెమటలు పట్టాయి. వారి గుండె వేగం పెరగడం పక్కనే ఉన్నవాళ్లకు కూడా అర్థమవుతోంది.

సిద్ధార్థ వారి ముందుకు నడుచుకుంటూ వచ్చి, ‘‘మిస్టర్‌ రాఘవన్‌ అండ్‌ విక్రమ్‌! మీ కోసం బయట పోలీసులు రెడీగా ఉన్నారు. వెళ్లి వాళ్లకు సరెండర్‌ అవ్వండి. నాక్కూడా ఢిల్లీకి వెళ్లే ఫ్లైట్‌కు టైమ్‌ అవుతోంది’’ అని స్టైలిష్‌గా తన వాచ్‌ చూసుకుంటూ చెప్పాడు.
హాల్‌లోకి పోలీసులు ప్రవేశించి రాఘవన్, విక్రమ్‌లను బేడీలు వేసి తీసుకువెళ్లారు.
డిటెక్టివ్‌ సిద్దార్థ ఎయిర్‌ పోర్ట్‌లో ఉండగా బ్యాంకు చైర్మన్‌ ఫోన్‌ చేశాడు.

‘‘థాంక్యూ... గంటల వ్యవధిలోనే బ్యాంకు డబ్బును  కాపాడారు’’ అన్నాడు కృతజ్ఞతాపూర్వకంగా...
‘‘ఈ పరిశోధనలో ఒక క్రూషియల్‌ క్లూ డ్రోన్‌! డ్రోన్‌ కళ్ళే ఇంటి దొంగలను పట్టించాయి. డిటెక్టివ్‌లు అవసరంలోనే కాదు, వ్యాపారంలో అప్రమత్తంగా ఉండడానికి కూడా... బ్యాంకులో జరిగే కార్యకలాపాల మీద నిఘా వేయడానికి కూడా ఉపయోగపడుతారు’’ చెప్పాడు డిటెక్టివ్‌ సిద్దార్థ.

- శ్రీసుధామయి

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)