Breaking News

సండే ఫండే.. ఇక సందడే..

Published on Thu, 05/15/2025 - 08:18

మెట్రో నగరాల్లో వీకెండ్స్‌ సందడికి కొదవే ఉండదు. వీకెండ్స్‌ అంటేనే ఇక్కడ ఒక ట్రెండ్‌ అన్నట్టు. అయితే గత కొంత కాలంగా ఈ ట్రెండ్‌ నెమ్మదించింది. వారాంతాల్లో ఫుల్‌ జోష్‌తో జరిగే ఈవెంట్లు కరోనా తర్వాత నెమ్మదించాయి. దీనికితోడు నగరంలో అధికారికంగా నిర్వహించే వీకెండ్‌ కార్యక్రమాలు సైతం తగ్గుముఖం పట్టాయి. అయితే గతంలో కొంత కాలం పాటు నగరవాసుల్ని ఉర్రూతలూగించిన వారాంతపు వినోద కార్యక్రమం మరోసారి ‘సండే.. ఫండే’ తిరిగి రానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే జరిగిపోయాయి. నగరం వేదికగా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న మిస్‌ వరల్డ్‌ పోటీల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని మరోసారి నిర్వహిస్తున్నారు.   

నగర వాసులు ఎంతో ఆసక్తిగా పాల్గొనే వీకెండ్‌  కార్నివాల్‌  కార్యక్రమం మళ్లీ తిరిగి రానుంది. ప్రతి వారాంతపు రోజును ‘సండే–ఫండే’ పేరిట ఉర్రూతలూగించే విధంగా నిర్వహించారు. కరోనా తర్వాత పూర్తిగా నెమ్మదించిన ఈ పరిస్థితి. అనంతరం కొంత కాలం నిర్వహించినా.. ఆ తర్వాత అనివార్య పరిస్థితుల వల్ల ఆగిపోయింది. అయితే ప్రస్తుతం ఈ వీకెండ్‌ జోష్‌కు మిస్‌ వరల్డ్‌ పోటీ తిరిగి ఊపిరిపోయనుంది. ఈ ఈవెంట్‌ మే 18న ట్యాంక్‌ బండ్‌ వద్ద నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా సాయంత్రం 5.30 గంటల నుంచి 7.30 గంటల వరకూ విభిన్న రకాల కార్యక్రమాలు జరగనున్నాయి. ఇందులో జానపద నృత్యాలు, వంటల పోటీలు వంటి మరెన్నో నగర వాసులను అలరించనున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనంపై రాష్ట్ర చరిత్ర, అభివృద్ధి ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

నాటి వీకెండ్‌.. సూపర్‌ హిట్‌.. 
నగరవాసులకు వినోదం ద్వారా వారాంతపు ఆహ్లాదాన్ని పంచడానికి హైదరాబాద్‌ మెట్రో పాలిటన్‌ అథారిటీ ఆధ్వర్యంలో ఈ ‘సండే–ఫండే’కు రూపకల్పన చేశారు. దీని కోసం ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకూ ట్యాంక్‌ బండ్‌ రోడ్డు మీద వాహనాలకు ప్రవేశం ఆపేసి, ఈ వినోద కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు. ఆ రహదారిని పలు రకాల సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, స్టాళ్ల ఏర్పాట్లతో ట్యాంక్‌ బండ్‌ రోడ్‌ ఒక ఓపెన్‌ ఎంటర్‌టైన్‌ మెంట్‌ ప్లేస్‌గా అవతరించేది. ఆ సందర్భంగా మ్యూజికల్‌ ప్రదర్శనలు, అబ్బురపరిచే ఫైర్‌వర్క్స్, జానపద కళలు, ఇంద్రజాల ప్రదర్శనలు వంటి ఎన్నో వినోద కార్యక్రమాలు నిర్వహించేవారు.

ప్రమోషన్‌ యాక్టివిటీస్‌..  
ఆరీ్మకి చెందిన బ్యాగ్‌ పైపర్‌ బ్యాండ్‌ ప్రదర్శనలు, శిల్పారామం కళాకారుల చేతి వృత్తిదారుల ఉత్పత్తుల అమ్మకాలు, ఫుడ్‌ ట్రక్స్‌ ద్వారా వివిధ రకాల వంటకాలు.. వంటివి ఇందులో భాగమయ్యేవి. అంతే కాకుండా హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎమ్‌డీఏ) ద్వారా ఉచిత మొక్కల పంపిణీ కూడా జరిగేది. లేజర్‌ షోలు, ఫైర్‌ స్పోర్ట్స్‌ ఉండేవి.  పలు ప్రైవేటు టీవీ చానెళ్లు తమ ప్రమోషన్‌ యాక్టివిటీస్‌కు కూడా అదే సందర్భాన్ని ఉపయోగించుకునేవి. దీంతో చిన్నితెర సెలబ్రిటీలు, యాంకర్స్‌ సైతం నగరవాసులకు కనువిందు చేసేవారు. అదే సమయంలో హుస్సేన్‌ సాగర్‌ వద్ద ఫౌంటెన్‌ షో కూడా ప్రత్యేక ఆకర్షణగా ఉండేది. కోవిడ్‌ కారణంగా నిలిపేసిన ఈ కార్యక్రమం ఆ తర్వాత మధ్యలో ఒకసారి పునరుద్ధరించినా దీర్ఘకాలం కొనసాగలేదు. చివరిసారిగా రెండున్నరేళ్ల క్రితం ఈ ఈవెంట్‌ను నిర్వహించారు.

రీఛార్జ్‌.. రీస్టార్ట్‌.. 
సండే ఫండే నాటి ఉత్సాహాన్ని మళ్లీ తీసుకురావడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీని కోసం నగరం కేంద్రంగా నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక మిస్‌ వరల్డ్‌ పోటీలను ఎంచుకున్నారు. నగరవాసులు మరచిపోయిన వారాంతపు సందడి సండే ఫండేకు పునరై్వభవం రావాలంటే.. అది మిస్‌ వరల్డ్‌ పోటీదారులను ఇందులో భాగం చేయడం ద్వారా సాధ్యపడుతుందని భావించి, మిస్‌ వరల్డ్‌ డైలీ షెడ్యూల్‌లో దీనిని కొత్తగా జేర్చారు. ఈ నేపథ్యంలో ఇకనైనా ఈ ఈవెంట్‌ నిరాటంకంగా కొనసాగుతుందని వారమంతా అలసి, సొలసిన  నగర జీవికి సాంత్వన పంచుతుందని ఆశిద్దాం.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)