పికిల్స్‌.. పీక్స్‌.. టన్నుల కొద్దీ : భారీ డిమాండ్‌

Published on Fri, 06/13/2025 - 11:14

మామిడి సీజన్‌ ముగుస్తుండగానే మరోవైపు.. పచ్చడి మామిడి సీజన్‌ హడావుడి మొదలవుతోంది. తెలుగుతనానికి ప్రతీకలైన 
ఆవకాయ, మాగాయ వంటి పచ్చళ్ల తయారీ ఇంటింటా ఊపందుకోగా.. నగరం నుంచి విదేశాలకు ఎగుమతి కోసం పచ్చళ్ల తయారీ మొదలైంది. నగరం నుంచి వివిధ ప్రాంతాలకు సరఫరా చేసేందుకు తయారీదారులు సిద్ధమవుతున్నారు. దీనికి తోడు ఏటా జూన్‌లోభారీగా ఎగుమతయ్యే నేపథ్యంలో ఆ హడావుడి, సందడి కనిపిస్తోంది. – సాక్షి, సిటీబ్యూరో 

ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న తెలుగు ప్రజలు జూన్‌ నెల వస్తుందంటే నోరూరించే పచ్చళ్ల కోసం లొట్టలేసుకుంటూ ఎదురు చూస్తుంటారు. ఈ సీజన్‌లో వారి పచ్చళ్ల ప్రియత్వాన్ని తీర్చడంలో నగరమే కీలకంగా మారుతోంది. ఉద్యోగం, ఇతరత్రా వ్యాపకాల రీత్యా నగరం నుంచి వెళ్లి విదేశాల్లో నివసిస్తున్న తమ బంధువుల కోసం ఈ మామిడికాయ పచ్చళ్లను సిటిజనులు పంపిస్తుంటారు. ప్రస్తుతం హోమ్‌మేడ్‌ ఆర్గానిక్‌ పచ్చళ్ళకు ఎక్కువ ఆదరణ ఉంది. అలాగే ఆర్గానిక్‌ వెరైటీలకు కూడా డిమాండ్‌ భారీగా ఉందని సరఫరాదారులు చెబుతున్నారు. 

చదవండి: Hanuman Chalisa: మోస్ట్‌ వ్యూడ్‌ వీడియో! 460 కోట్లు

ఎందరో తయారీ ‘దారులు’.. 
నగరానికి చెందిన పికిల్‌ కార్ట్, తెలుగు పికిల్స్, అమ్మ చేతి వంట వంటి కొన్ని ప్రత్యేక డెలివరీ స్టార్టప్స్, సంస్థలు ఆన్‌ లైన్‌ ఆర్డర్ల ద్వారా విదేశాలకు నేరుగా డెలివరీ చేస్తూన్నాయి. ఇక మియాపూర్‌లోని పికిల్స్‌ బై శ్రీదేవి, కూకట్‌పల్లిలోని మై గ్రాండ్‌ మా పికిల్స్, ఇసీఐఎల్‌ అనంత్‌ నగర్‌లోని పికిల్స్‌ బై రేణుక, గచ్చిబౌలిలోని అమ్మచేతి వంట, మాదాపూర్‌లోని తెలుగు హోమ్‌ ఫుడ్స్‌ ఇలా అనేక సంస్థల పచ్చళ్లు విదేశాల ఎగుమతులకు పేరొందాయి. అలాగే పచ్చడి తయారు చేయడం కంటే, దాన్ని విదేశాలకు పంపించడానికే ఎక్కువ ఖర్చు అవుతోందని తయారీదారులు అంటున్నారు. ఒక కేజీ ఆవకాయ పచ్చడి తయారీ ఖర్చు అన్ని దినుసులకూ కలిపి రూ.125 నుంచి రూ.150 వరకూ అవుతుందని అంచనా. అదే కేజీ ఆవకాయను అమెరికాకు పంపించేందుకు అన్ని రకాల పన్నులూ కలిపి రూ.900 వరకూ అవుతుంది.  

చదవండి: Anjana Sri రెండు సార్లు దురదృష్టం.. కానీ ఆ మాటే ధైర్యం చెప్పింది!

టన్నుల కొద్దీ సరఫరా.. 
నగరంలో తయారయ్యే ఆవకాయ, మాగాయ, ముక్కాళి తదితర సంప్రదాయ హోమ్‌మేడ్‌ పచ్చళ్లకు విదేశీ మార్కెట్లలో భారీ డిమాండ్‌ ఏర్పడింది. ప్రతి సంవత్సరం వేసవి ముగింపు దశలో, జూన్‌ నెల నుంచే పచ్చళ్ల సరఫరా గణనీయంగా పెరుగుతుంది. నగరం నుంచి కనీసం 1500–2000 టన్నుల వరకూ వివిధ రకాల పచ్చళ్ళను  అనేక దేశాలకు తరలిస్తారని అంచనా. ఇందులో 70% భాగాన్ని ఆవకాయ ఆక్రమిస్తుంది. ప్రధానంగా రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (శంషాబాద్‌) ఈ పచ్చళ్ల భారీ సరఫరాకు కేంద్రబింధువుగా నిలుస్తోంది. మరోవైపు వీటిని పెద్ద ఎగుమతిదారులు సముద్ర మార్గం ద్వారా కూడా ముంబై పోర్టు లేదా చెన్నై పోర్ట్‌ ద్వారా కూడా కన్సైన్మెంట్లు పంపిస్తున్నారు.

 ఎక్కడెక్కడికి.. ఎక్కువగా.. 
నగరం నుంచి అమెరికాలోని న్యూయార్క్, కాలిఫోర్నియా, టెక్సాస్‌ వంటి రాష్ట్రాలకు, కెనడాలోని టొరంటో, వాంకూవర్, యునైటెడ్‌ కింగ్‌డమ్‌లోని లండన్, బర్మింగ్‌హామ్, ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్‌బోర్న్, మిడిల్‌ ఈస్ట్‌లో దుబాయ్, ఖతార్, సౌదీ అరేబియాలకు అత్యధిక పరిమాణంలో ఈ పచ్చళ్లు సరఫరా అవుతాయి. అక్కడి ఇండియన్‌ స్టోర్లలో ఇవి రిటైల్‌ ఫార్మాట్‌లో పికిల్స్‌ విక్రయాలు భారీగా జరుగుతున్నాయి. అమెరికాలోని పటేల్‌ బ్రదర్స్, అప్నా బజార్‌ తదితర స్టోర్లలో హైదరాబాద్‌ పచ్చళ్లకు మంచి డిమాండ్‌ ఉంది. 

ఆవకాయ బిర్యానీకి ఆదరణ.. 
అమెరికాలోని పలు ప్రాంతాల్లో ఉన్న రెస్టారెంట్స్‌లో ఆవకాయ బిర్యానీ హల్‌ చల్‌ చేస్తోంది. దీని కోసం కూడా పచ్చళ్ల తయారీ దారులు ఆవకాయను పెద్ద యెత్తున తరలిస్తున్నారు. ‘ఈ సీజన్‌లో వందల కిలోల పరిమాణంలో ఆవకాయను పంపిస్తాం. అక్కడ ఉన్న మన బావార్చి రెస్టారెంట్‌ సహా పలు స్టాల్స్‌కి వీటిని సరఫరా చేస్తాం’ అంటూ చెప్పారు మల్కాజ్‌గిరిలో ఆవకాయ తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్న రాజశేఖర్‌ అనే వ్యాపారి.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)