Breaking News

సుధామూర్తి హెల్త్‌ టిప్స్‌: అధిక కేలరీల ఆహారాన్ని ఎలా నివారించాలంటే..?

Published on Fri, 04/04/2025 - 12:08

రాజ్యసభ ఎంపీ, ఇన్ఫోసిస్‌ కోఫౌండర్‌ నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి సింప్లిసిటీకి కేరాఫ్‌ అడ్రస్‌ ఆమె. తరుచుగా చుట్టూ జరుగుతున్న లోపాల గురించి  తనదైన శైలిలో మాట్లాడుతూ..సలహాలు సూచనలు ఇస్తుంటారు. చిన్నారులు దగ్గర నుంచి నేటి యువత వరకు ఎలాంటి జీవన విధానంతో లైఫ్‌ని లీడ్‌ చేస్తే బెటర్‌ అనే దాని గురించి అమూల్యమైన సలహలిస్తుంటారు కూడా. అలానే తాజాగా ఆహారపు అలవాట్లు ఎలా ఉంటే ఆరోగ్యానికి మంచిదో చెప్పారు. దాంతోపాటు తన తన ఆరోగ్యకరమైన డైట్‌ సీక్రెట్‌ని కూడా పంచుకున్నారు. మనం మనుషులం కాబట్టి ఒక్కోసారి చీట్‌ మీల్‌ తినేస్తుంటాం. అందుకు తాను కూడా మినహా కాదని నవ్వతూ చెప్పారామె. మరీ ఆ విషయాలేంటో చూద్దామా..!.

పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్‌తో జరిగిన సంభాషణలో రాజ్యసభ ఎంపీ, విద్యావేత్త సుధామూర్తి భారతదేశం ఆహారం, భారతీయుల ఆహారపు అలవాట్ల గురించి మాట్లాడారు. సుధామూర్తి ఆ భేటీలో ఇంట్లో వండిన ఆహారం తినడం ప్రాముఖ్యతను హైలెట్‌ చేశారు. మనసుకు సంతృప్తిని, హాయిని ఇచ్చే ఆహారం తినడం గురించి నమ్ముతానన్నారు. అయితే అధిక కేలరీల ఆహారాన్ని మాత్రం తప్పకుండా నివారించాలన్నారు. అందుకోసం తానేం చేస్తారో కూడా వివరించారు. 

నోరూరించే అధిక కేలరీలు ఆహారాలు తన భోజనం టేబుల్‌పై లేకుండా ఉండేలా చూసుకుంటారట. చాలావరకు ఆ విషయంలో స్వీయ నియంత్రణ చాలా కష్టంగా ఉంటుంది. తాను కూడా ఒక్కోసారి చీట్‌ మీల్‌ చేస్తుంటానని అన్నారు. తనకు పెడ, బర్ఫీ లేదా మైస్ వంటి స్వీట్లంటే ఎంతో ఇష్టమని చూడగానే మనసు పారేసుకుంటానని నవ్వుతూ చెప్పారు. అయితే తీసుకునే ముందు ఇదొక్కటే లేదంటే తన ఆరోగ్యానికి ఇబ్బంది అని సర్ది చెప్పుకుంటూ ఆపేస్తా అన్నారు. 

డైట్‌ ఎలా ఉంటుందంటే..

  • రోటీలలో ఒకటైన భక్రిని తాను ఇష్టంగా తింటానన్నారు. ఇక్కడ భక్రి అంటే మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో తినే ప్రసిద్ధ ఫ్లాట్‌బ్రెడ్.

  • ఎర్రటి గోధమ జోవర్‌ వంటి చిరుధాన్యాలను తీసుకుంటారెమె. 

  • చివరగా తీపి తినాలనే కోరికను నివారించడానికి పండ్లు ఎక్కువగా తీసుకుంటానన్నారు. అన్నీంట్ల కంటే కంఫర్ట్ ఫుడ్ - పోహా అంటారెమె. తన ప్రతి భోజనంలో తప్పనిసరిగా అది ఉండాల్సిందేనట.

(చదవండి: అలనాటి గోల్డెన్‌ డేస్‌: ఆ తాతయ్య కనులలో కోటి పండగల కళ..)

 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)