Breaking News

నాట్యమయూరి సుధా చంద్రన్‌ వెల్నెస్‌ సీక్రెట్‌..!

Published on Mon, 02/23/2026 - 11:27

భారతీయ భరతనాట్య నృత్యకారిణి, నటి సుధాచంద్రన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటిగానూ, నృత్యకారిణిగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని, గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే బుల్లితెరపై విలక్షణమైన నటతో అశేష ప్రేక్షక ఆదరాభిమానాలు పొందారామె. అలాంటి సుధాచంద్రన్‌ ఆరు పదుల వయసులో కూడా అంతే అందం, ఫిట్‌నెస్‌తో యాక్టివ్‌గా ఉండే ఆమె..అందం, ఆరోగ్యపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసుకున్నారామె. ప్రస్తుతం ఉన్న హెల్త్‌ అండ్‌ బ్యూటీ ట్రెండ్‌లకు విరుద్ధంగా పూర్వకాల నాటి ఆయుర్వేద ఆచారాలే తన అందం, ఆరోగ్యం వెనుక సీక్రెట్‌ అంటోందామె. వాటి గొప్పతనం గురించి సుధా మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా..!.

 

ప్రస్తుతం బ్యూటీ అనగానే సీరమ్‌లు, షీట్‌ మాస్క్‌లు ట్రెండ్‌ల హవా ఎక్కువగా ఉంది. పైగా చాలామంది సీనియర్‌ ‍సెలబ్రిటీలు ఈ ఆధునిక కాలానికి అనుగుణంగా ఉన్న ట్రెండ్‌లే అనుసరిస్తే..ఆమె పాతకాలం నాటి ఆయుర్వేదం, నాటి ఆచార సంప్రదాయలకే జై కొడుతోంది సుధాచంద్రన్‌. అంతేగాదు ఆరోగ్యం, చర్మ సంరక్షణ అనేవి దినచర్యలు కావని, అవి మన అమ్మమ్మల నాటి జ్ఞాపకాతో ముడిపడి ఉన్నావి, తరతరాలుగా ఒకరి నుంచి ఒకరికి సంక్రమించినవిగా పేర్కొన్నారామె. 

తాను దక్షిణి భారత్‌లోని కేరళ నుంచి వచ్చానని, అందువల్ల దేశీ ఆచారాలకే ప్రాముఖ్యత ఇస్తానని అన్నారామె. తనకు ఆయుర్వేదం ఒక ట్రెండ్‌ కాదని, అదొక జీవన విధానమని అన్నారు. చిన్ననాటి నుంచి చూసినవే ఈనాటికి తూ.చా తప్పకుండా ఆచరిస్తున్నానని అన్నారామె. దక్షిణ భారత దేశం నుంచి రావడంతో మంగళ, శుఖ్రవారాల్లో తలస్నానం తప్పనిసరి అని చెప్పారు. కొబ్బరి నూనె రాసుకుని మరి స్నానం చేయడం అలవాటని కూడా చెప్పారామె. 

తన అమ్మమ్మ జుట్టు అందంగా, ఒత్తుగా ఉండాలంటే కొబ్బరినూనె తప్పనిసరి అని చెబుతూ తాను పాఠశాలకి వెళ్తున్నప్పుడూ అమ్మమ్మ ఎంతలా తన జుట్టుకి శ్రద్ధగా నూనె రాసేవారో గుర్తు తెచ్చుకున్నారామె. అలాగే 15 రోజులకొకసారి కడుపుని శుభ్రపరుచుకోవడం అంటే..సాఫీగా విరేచనాలు అయ్యేలా కేటాయించడం. మన పురాతన భారతీయ వైద్య విధానమైన ఆయుర్వేదన్నే గట్టిగా విశ్వసిస్తానని చెప్పారామె. కనీసం జలుబు చేసినప్పుడు కూడా దశములారాష్టాన్ని క్రమం తప్పకుండా ఉపయోగిస్తానని చెప్పారామె. 

దశములారాష్టం అనేది సాంప్రదాయ ఆయుర్వేద టానిక్. ఇది పది వేర్లు, ఇతర మూలిక మిశ్రమాలతో తయారు చేస్తారని తెలిపారు. శ్వాసకోశ ఆరోగ్యానికి చాలామంచిదని చెప్పారు. అలాగే కళ్లకు పెట్టుకునే కాజల్‌ కూడా ఇంట్లో తయారుచేసినదే వాడతానని, ఇది తన అమ్మమ్మ నుంచి అమ్మకు..అలా తనకు సంక్రమించిన ఆచారమని. అదే తాను ఇప్పటికీ ఫాలో అవుతానని అన్నారామె. అలాగే జుట్టు ఆరోగ్యానికి ఆముదం కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారామె. 

అలాగే మాయిశ్చరైజింగ్‌ కొబ్బరి నూనెని ఉపయోగిస్తానని, ఆఖరికి మేకప్‌ని తొలగించేందుకు కూడా వెట్‌ వైప్స్‌ వాడనని, కొబ్బరినూనెతోనే తొలగిస్తానని అన్నారామె. తాను కేరళ నుంచి వచ్చి ముంబైలో స్థిరపడ్డా తన మూలాలను, ఇంటి ఆచారాలనే అనుసరిస్తానని చెప్పారామె. అంతేగాదు కేరళ మసాజ్‌లు తీసుకుంటానని కూడా అన్నారు. శరీరంలోని అదనపు నీటి నిలుపుదలను తొలగించేందు ఎంతగానో ఉపకరిస్తాయని అన్నారు. 

తాను కొత్తగా ఎలాంటి ప్రయోగాలు చేసేందుకు ఇష్టపడనని, తరతరాల సంప్రదాయాలు, ఆచారాలనే పాటిస్తానని చెప్పారామె. అప్పుడే జీవితం చాలా సులభంగా తేలికగా ఉంటుందన్నారామె. కానీ నేటితరం మార్కెట్లో వచ్చేప్రతి ట్రెండ్‌ ఫాలో అయ్యి జీవితాన్ని క్లిష్టతరంగా మార్చుకుని సమస్యలు కొనితెచ్చుకుంటున్నారంటూ..తన పోస్ట్‌ని ముగించారు సుధాచంద్రన్‌.

 

(చదవండి: The 'Ideal Self' Trap: ఎదుటివారిలా ఉండాలనుకోవడమే సమస్య!)
 

Videos

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)