Breaking News

సైకిల్ నేర్పించి రూ. 35 ల‌క్ష‌లు సంపాదించాడు!

Published on Tue, 02/10/2026 - 18:16

చిన్న‌త‌నంలో సైకిల్ తొక్క‌డం నేర్చుకున్నారా? పెద్ద‌య్యాక కూడా సైకిల్ తొక్కే అలవాటును కొన‌సాగిస్తున్నారా? అబ్బే.. అస‌లు అల‌వాటు చేసుకోలేదండీ అంటారా? మ‌రేం ఫ‌ర్వాలేదు. వ‌య‌సుతో సంబంధం లేకుండా సైకిల్ తొక్క‌డం ఎంచ‌క్కా నేర్చేసుకోవ‌చ్చు. ఏంటీ.. సైకిల్ తొక్క‌డం కూడా నేర్పుతారా? కారు, బైక్ డ్రైవింగ్ నేర్ప‌డం గురించి విన్నాం కానీ.. దీని గురించి ఎప్పుడూ విన‌లేదే అనుకుంటున్నారా? మీకో ఆస‌క్తిక‌ర సంగ‌తి తెలుసా? సైకిల్ తొక్క‌డం నేర్పించి ఓ కుర్రాడు రెండేళ్ల‌లో ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌లు సంపాదించాడు. ఆశ్చ‌ర్య‌పోతున్నారా? ఇంత‌కీ ఎవ‌రా కుర్రాడు, ఏమా క‌థ.. తెలుసుకుందాం రండి.

డ‌బ్బు సంపాదించ‌డం కోసం మ‌నుషులు ర‌క‌ర‌కాల ప‌నులు చేస్తుంటారు. చైనాలోని షాంఘై యూనివర్శిటీ ఆఫ్ స్పోర్ట్‌లో మూడవ సంవత్సరం మాస్ట‌ర్ డిగ్రీ చ‌దువుతున్న లీ అనే విద్యార్థి కూడా ఖాళీ స‌మ‌యంలో డ‌బ్బు సంపాదించాల‌నుకున్నాడు. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో సైక్లింగ్‌కు పెరుగుతున్న ఆద‌ర‌ణ‌ను గ‌మ‌నించి ఆ దిశ‌గా అడుగులు వేశాడు. త‌న స్నేహితుడితో క‌లిసి షాంఘైలో ప్రొఫెషనల్ సైక్లింగ్ శిక్ష‌ణ మొద‌లు పెట్టాల‌ని భావించాడు. అయితే త‌న మిత్రుడికి ఉద్యోగం దొర‌క‌డంతో అత‌డు మ‌ధ్య‌లోనే వెళ్లిపోయాడు. లీ మాత్రం ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్నాడు.

చ‌దువు కొన‌సాగిస్తూనే..
ముందుగా సైకిల్ తొక్క‌డం ఎలా నేర్చుకోవాలో బోధిస్తూ చేసిన వీడియోల‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ప్రారంభించాడు. రెండు నెల‌ల త‌ర్వాత అత‌డికి తొలి అవ‌కాశం ద‌క్కింది. అక్క‌డి నుంచి లీ వెనుదిరిగి చూసుకోలేదు. ఒక్క చ‌దువు కొన‌సాగిస్తూనే, మ‌రో ప‌క్క ఉపాధి వెతుక్కున్నాడు. పిల్ల‌లు, పెద్ద‌ల‌కు ఎంతో ఓపిగ్గా సైకిల్ తొక్క‌డం (bicycle ride) నేర్పిస్తూ మ‌న్న‌న‌లు పొందాడు. దీంతో అత‌డికి ద‌గ్గ‌ర సైకిల్ నేర్చుకునేందుకు స్థానికులు ఆస‌క్తి క‌న‌బ‌రిచారు. 

త‌న వ‌ద్ద‌ నేర్చుకుంటే క‌చ్చితంగా సైకిల్ వ‌స్తుంద‌న్న భ‌రోసా ఇవ్వ‌డంతో ఔత్సాహికులకు న‌మ్మ‌కం పెరిగింది. ఒక్కొక్క‌రి నుంచి 800 యువాన్లు (సుమారు రూ. 10 వేలు) తీసుకునేవాడు. రెండు క్లాసుల‌తోనే శిక్ష‌ణ పూర్తి చేసేవాడు. ఒక్కొ క్లాస్‌కు గంట‌న్న‌ర నుంచి 2 గంట‌ల స‌మ‌యం తీసుకుంటాడు. పిల్ల‌లు త్వ‌ర‌గా నేర్చుకోలేరు కాబ‌ట్టి వారికి ఎక్కువ స‌మ‌యం కేటాయించేవాడు. సైక్లింగ్ శిక్ష‌ణ ద్వారా రెండేళ్లలో అత‌డు దాదాపు 35 ల‌క్ష‌ల‌ రూపాయ‌ల‌కు పైగా సంపాదించిన‌ట్టు 'సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్' వెల్ల‌డించింది.

అలా నేర్పిస్తాడు..
ఓర్పుగా నేర్పించ‌డ‌మే త‌న విజ‌య ర‌హ‌స్యం అంటాడు లీ. శిక్ష‌ణ కోసం త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే వారితో ముందుగా 10 నిమిషాలు మాట్లాడతాన‌ని, దీని ద్వారా వారు ఎంత స‌మ‌యంలో నేర్చుకోగ‌లుగుతారో అంచ‌నా వ‌స్తాన‌ని చెప్పాడు. చిన్నత‌నం సైకిల్ నేర్చ‌కుంటూ ప‌డిపోవ‌డంతో క‌లిగిన భ‌యం వ‌ల్ల చాలా మంది  వెనుకంజ వేస్తుంటారు. వారిలో ఆ భ‌యాన్ని పొగొట్టడానికే వారితో మాట క‌లుపుతాన‌ని వివ‌రించారు.

చ‌ద‌వండి: ఫిట్స్‌తో ఎవ‌రైనా ప‌డిపోతే ఇలా చేయ‌కండి

షాంఘై దాటి..
సైక్లింగ్‌కు ఇంత ఆద‌ర‌ణ ఉంద‌ని తాను ఊహించ‌లేద‌ని లీ చెప్పాడు. జూన్‌లో త‌న చ‌దువు పూర్త‌వ‌గానే త‌న సేవ‌ల‌ను విస్తరిస్తాన‌ని తెలిపాడు. తన బోధనా పద్ధతులను మరింత మెరుగుపరుచుకుని షాంఘై వెలుప‌ల కూడా శిక్ష‌ణ ఇస్తాన‌ని వెల్ల‌డించాడు. జెజియాంగ్, జియాంగ్సు ప్రాంతాల్లోనూ సైక్లింగ్ కోచింగ్‌కు ప్లాన్ చేస్తున్నానని పేర్కొన్నాడు. 

Videos

ప్రభుత్వమే ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పుకోవాలి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గగ్గోలు

తమ్ముడి సర్టిఫికెట్లు పెట్టిన అన్నకు టీచర్ ఉద్యోగం.. నిజం ఒప్పుకున్న పెద అప్పల్రాజు

బయటపడ్డ లోకేష్ DSC అక్రమాల పుట్ట బాబు వెన్నులో వణుకు...

వైభవ్ పై BCCI ప్రత్యేక నిఘా

ఎవరు మంత్రి కావాలి..? ఎవరి మాట వినాలి?

సాక్ష్యాలతో వస్తాం .. సిద్ధంగా ఉండు..! లోకేష్ కు YSRCP ఎమ్మెల్సీ సవాల్

కూటమిలో లోకల్ వార్.. బాబుకు జనసేన, బీజేపీ హెచ్చరిక

ఎక్కడ దాక్కున్నావ్ లోకేష్.. కొండారెడ్డి బురుజుకు ఇప్పుడురా..

సరదాకు ఉద్యమాలు చేయడం లేదు.. ఇంకెంతకాలం సాగదీస్తావ్ చంద్రబాబు

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడం కూటమి పిరికి చర్య..

Photos

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!