Breaking News

కుచేలా... కుచేలా!

Published on Mon, 10/27/2025 - 10:16

బెంగుళూరుకు చెందిన ఒక బంగారు వ్యాపారి శ్రీ కృష్ణ భక్తుడు. ప్రతి ఏడాదీ ఇతర భక్తులతో కలిసి క్రమం తప్పకుండా మథుర వెళ్ళివస్తూ ఉంటాడు. ‘ఎప్పుడూ మనం వెళ్ళి రావడమేనా, ఒక పేద వాడైన కృష్ణ భక్తుడికి ఆ అవకాశం కల్పిస్తే బాగుంటుంది కదా’ అని అతడి భార్య సూచించింది. అనుకున్నదే తడవుగా తమ బృందనాయకుడితో ఆ విషయం చెప్పాడు. బృంద నాయకుడు అతడి ఆలోచనకు హర్షం వెలిబుచ్చాడు. అయితే తాను ప్రయాణ ఖర్చులతో  పాటు అన్ని ఖర్చులూ భరిస్తున్నట్లు ఎక్కడా బహిరంగపరచవద్దని కోరు కున్నాడు వ్యాపారి. 

అలాగే ఆ ఏడాది హరేకృష్ణ బృందం విమానంలో బయలుదేరింది. దేశ రాజధాని దిల్లీకి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న మథుర చేరుకుంది. యమునా నదీతీరంలో శ్రీ కృష్ణ జన్మ స్థానమైన కారాగారాన్ని చూస్తూ ఒక బృంద సభ్యుడు కన్నీళ్ళు పెట్టుకుంటూ కూర్చున్నాడు. ఉండబట్టలేని బంగారు వ్యాపారి కారణమేమిటని ప్రశ్నించాడు. ‘‘నేను చిన్న కూలీని. నా ఆదాయం అంతంత మాత్రమే. శ్రీ కృష్ణుడి భక్తుడినైనా ఇంతింత డబ్బు ఖర్చు పెట్టుకుని వచ్చేంత స్తోమత నాకు లేదు. ఈ  జన్మలో మథుర వస్తానని అనుకోలేదు. శ్రీ కృష్ణ జన్మస్థానం కళ్ళారా చూస్తానని కలలో కూడా అనుకోలేదు. ఏ మహానుభావుడికో ఒక ఆలోచన వచ్చి నాకు ఈ ప్రయాణ అవకాశం కల్పించాడు. అతడి ఋణం ఎలా తీర్చుకోగలను? అతడికి కృతజ్ఞతలు తెలుపుదామంటే కూడా వీలుపడటం లేదు. ఎందుకంటే అతడు గుప్తదానం చేశాడు’’ అని విలపించాడు.

బంగారు వ్యాపారి మనసు చలించింది. అయినా తానే ఆ గుప్తదాత అని చెప్పుకోదలచలేదు. గమ్మున ఉండిపోయాడు. ఆ బృందం అలాగే నైమిశారణ్యం, అయోధ్యలు చూసి విమానం ఎక్కారు. యాత్ర విజయవంతం అయినందులకు బృంద నాయకుడు అందరికీ ధన్యవాదాలు తెలిపాడు. విమానం బెంగళూరు విమానాశ్రయం చేరుకుంది. అందరూ ఒకరినొకరు కౌగిలించుకుని అభినందనలు తెలుపుకున్నారు. లగేజీ అందించే సమయం వచ్చింది. లగేజీలు అందుకునే సమయంలో బంగారు వ్యాపారి సంచికన్నా కూలీ సంచి ముందు వచ్చింది. ఆనందంతో అతడు సంచి ఎత్తుకుంటూ ఉంటే సంచిపై అతడి పేరు చూశాడు వ్యాపారి. తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు.‘శ్రీ కృష్ణలీలలు ఇంతింత కాదయా’ అనుకున్నాడు. ఎందుకంటే ఆ కూలీ పేరు కుచేలన్‌!
– ఆర్‌.సి.కృష్ణస్వామి రాజు  

Videos

AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..

సంచలనం రేపుతున్న డ్యాన్సర్స్ యూనియన్ వివాదం

అంబానీపై SBI కేసు.. అసలు కారణం ఇదే!

నేను తప్పు చేయలేదు కన్నీరు పెట్టుకున్న కవిత.. ఎందుకంటే..!

కోడిగుడ్లు, టమాటాలతో కోమటిరెడ్డి కార్యాలయంపై దాడి

Nepal Flood: చావు అంచున ప్రాణాలు కాపాడిన అసలైన హీరో!

నీ చరిత్ర మొత్తం బయట పెడితే.. మొహం ఎక్కడ పెట్టుకుంటావో తెలుసా..

బాబుకు ఏపీ కంటే తెలంగాణ అంటేనే ప్రేమ ఎక్కువ..!

ద్రౌపది ముర్ము ADC 'నేషనల్ క్రష్' రిషబ్ సింగ్ రాజీనామా

ఏపీలో మందు బాబులకు బిగ్ షాక్

Photos

+5

రోమాంచకం హీరోయిన్ అనంతిక గ్లామరస్ లుక్స్.. ఫోటోలు

+5

అమెరికా ట్రిప్‌లో బుట్టబొమ్మ పూజా హెగ్డే చిల్.. ఫోటోలు

+5

'ఇరుముడి'లో చీరతో.. ఇప్పుడేమో స్టైలిష్‌గా (ఫొటోలు)

+5

పెళ్లి పీటలెక్కనున్న కొత్త జంట (ఫొటోలు)

+5

చెల్లితో కలిసి ప్రకృతి ఒడిలో 'ప్రేమమ్' హీరోయిన్ (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ హీరోయిన్ గుర్తుందా? బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో 'రద్ధిమా' సాంగ్.. సాయి-భాగ్యశ్రీ కెమిస్ట్రీ (ఫొటోలు)

+5

వెలిగొండకు జగన్‌ అప్పుడే.. క్రెడిట్‌ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ!

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబర్ 05)

+5

కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు)