Breaking News

ఉల్లిపాయలు, బంగాళదుంపలు కలిపి నిల్వ చేయకూడదా..?

Published on Tue, 07/22/2025 - 17:15

సాధారణంగా ఉల్లిపాయలు, బంగాళదుంపలు ఫ్రిడ్జ్‌లో ఉంచం. సాధారణంగా బయట అరమాల్లో రెండింటిని ఒకే చోట ఉంచుతాం. కొందరైతే నేరుగా ఉల్లిపాయ బుట్టలోనే ఉంచుతారు. అయితే ఇలా మాత్రం అస్సలు ఉంచకూడదంటూ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇస్తున్నారు. ఇది ప్రాణాంతంకమని, ఒక్కోసారి ఇలా నిల్వచేసిన వాటినే గనుక వండి తింటే ప్రాణాలు పోయే అవకాశాలు  ఉన్నాయని చెబుతున్నారు. అందుకు సరైన ఆధారాలు స్పష్టం కానప్పటికీ ఇలా రెండింటిని కలిసి నిల్వ చేయద్దని మాత్రం సూచిస్తున్నారు. ఎందుకంటే..

ఇలా ఎప్పుడైతే రెండింటిని కలిపి నిల్వ చేస్తారో..అప్పుడు ఉల్లిలో విడుదలయ్యే ఎథెలిన్‌ బంగాళదుంపలతో చర్య జరిపి..త్వరగా మొలకెత్తేలా చేస్తుందట. అంతేగాదు అలాంటి బంగాళ దుంపల్లో సోలనిన్‌, చాకోనిన్‌ అనే విషాలు ఉత్పత్తి అవుతాయి. అవి గనుక తీసుకుంటే..అల్సర్లు, పేగువాపు, ఫుడ్‌ పాయిజనింగ్‌ అయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయట. అంతేగాదు ఒక్కోసారి నాడీ సంబంధిత రుగ్మతలకు దారితీసి ప్రాణాంతకంగా మారే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు నిపుణులు. 

అధ్యయనంలో కూడా..
అమెరికా సెంటర్‌ ఫర్‌​ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన​ అధ్యయనాల ప్రకారం ఉల్లిపాయలు ఇథలీన్‌ను విడుదల చేస్తాయి. ఎప్పుడైతే వాటి సమీపంలో ఇతర ఆహార పదార్థాలను ఉంచుతామో.. అవి త్వరగా పాడవ్వడం జరగుతుందని చెబుతున్నారు నిపుణులు. అదీగాక ఈ బంగాళ దుంపలు సహజంగా సోలనిన్‌, చాకోనిన్‌ వంటి ఆల్కాలయిడ్‌లను కలిగి ఉంటుంది. 

ఎప్పుడైతే ఇలా ఉల్లిపాయల వద్ద వాటిని ఉంచగా..అవి త్వరగా మొలకెత్తి..పెద్ద మొత్తంలో విషపూరితమైన ఆల్కలాయిడ్లను విడుదల చేస్తుందని యూరోపియన్‌ ఫుడ్‌ సేఫ్టీ అథారిటీ పేర్కొంది. ఈ పచ్చి లేదా చెడిపోయిన బంగాళ దుంపలు మానవులకు అత్యంత ప్రమాదమని అధ్యయనంలో వెల్లడైంది. అందువల్ల మొలకెత్తని తాజా బంగాళ దుంపలే తినడం మంచిదని పేర్కొంది. సాధ్యమైనంత వరకు ఈ రెండిని కలిపి నిల్వ చేయకపోవడమే మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. 
(చదవండి: నేచురల్‌ బ్యూటీ కోసం ఐదు పువ్వులు..! ఆ సమస్యలు దూరం..)

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)