నర్మదా ఒడ్డున ఉక్కు మనిషి.. ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం!

Published on Mon, 11/23/2026 - 09:38

నర్మదా ఒడ్డున... ఉక్కు మనిషి
182 మీటర్ల ఐక్యతా శిల్పం
నది పలికే ఏకతా గీతం
భారతదేశాన్ని భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా గుర్తిస్తారు. అయితే ఆంగ్లేయులు వెళ్లిపోయే సమయానికి భారతదేశంలో 500 పైగా సంస్థానాలు ఉండేవి. అందులో కొన్ని సంస్థానాలు మేము సెపరేట్‌ దేశంగా ఉంటామని స్పష్టం చేశాయి.

ఇలా రకరకాల కారణాలతో భారతదేశం మధ్యలోనే ఉంటూ కలవము అని చెప్పిన సంస్థానాలను కూడా ఏకం చేసి నేడు ఇంత విలక్షణమైన, విశాలమైన భారతదేశాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌. ఆయన ఉక్కు సంకల్పానికి ప్రతీకగా ఆయన్ను ఐరన్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా... అంటే భారతదేశ ఉక్కు మనిషి అని అంటారు.

అలాంటి ఉక్కు మనిషికి దేశంలో విగ్రహాలే లేకపోవడంతో ఏకంగా ప్రపంచంలోనే అత్యంత పొడవైన విగ్రహాన్ని నిర్మించారు.
గుజరాత్‌ లోని నర్మదా జిల్లా, కెవాడియా వద్ద ఉన్న ఈ విగ్రహం భారతదేశ ఐక్యతకు ప్రతీకగా నిలుస్తోంది. 565 సంస్థానాలను ఏకం చేసిన ఉక్కు మనిషి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ స్ఫూర్తితో నిర్మించిన ఈ శిల్పం ఇప్పుడు గుజరాత్‌ లో అత్యధికంగా సందర్శించే ప్రదేశంగా మారింది. కేవలం విగ్రహం మాత్రమే కాదు, చుట్టూ ఉన్న 15 కి పైగా పర్యాటక ప్రదేశాలు కలిసి ఇది ఒక కంప్లీట్‌ డెస్టినేషన్‌ గా మారింది.

సందర్శనీయ ప్రదేశాలు

  • స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ అసలు ప్రయాణం విగ్రహం నుంచే మొదలవుతుంది. 2013 లో ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన ఈ కల 2018 అక్టోబర్‌ 31న 182 మీటర్ల నిజంగా మారింది. ప్రముఖ శిల్పి రామ్‌ వి. సుతార్‌ దీన్ని డిజైన్‌ చేశారు. ఇది స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ కంటే రెండు రెట్లు ఎత్తు.

  • 135 మీటర్ల ఎత్తులో ఛాతీ దగ్గర ఉన్న వ్యూయింగ్‌ గ్యాలరీ నుంచి చూస్తే సర్దార్‌ సరోవర్‌ డ్యామ్, వింధ్య, సాత్పురా పర్వతాలు, నర్మదా నది కనిపిస్తాయి. లిఫ్ట్‌ లో 50 సెకన్లలో 400 అడుగుల ఎత్తుకు చేరుకోవడం ఒక ప్రత్యేక అనుభవం.

  • వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌ లో రంగు రంగుల పూల మొక్కలు, ఫోటో పాయింట్లు ఉంటాయి. జంగిల్‌ సఫారీలో టైగర్, లెపర్డ్, వివిధ రకాల పక్షులను చూడవచ్చు. పిల్లలకు ఇది ప్రత్యేక ఆకర్షణ.

  • గ్లో గార్డెన్‌ రాత్రి వేళ ప్రధాన ఆకర్షణ. లైట్లతో మెరిసే మొక్కలు, జంతువుల ఆకారంలో ఉన్న లైటింగ్‌ శిల్పాలు రాత్రి 7 గంటల తర్వాత వెలిగిపోతాయి.

ఎలా వెళ్లాలి?

  • హైదరాబాద్‌ నుంచి స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీకి డైరెక్ట్‌ విమానం లేదు. హైదరాబాద్‌ నుంచి అహ్మదాబాద్‌ లేదా వడోదర వరకు ఫ్లైట్‌ లో వెళ్లాలి. శంషాబాద్‌ నుంచి వడోదరకు 2 గంటల ప్రయాణం. వడోదర నుంచి కెవాడియాకు 90 కిలోమీటర్లు. వడోదర నుంచి కెవాడియాకు ప్రత్యేక జన్‌ శతాబ్ది ట్రైన్‌ ఉంది. 2 గంటల్లో చేరుకోవచ్చు.

  • తక్కువ బడ్జెట్‌ లో అయితే హైదరాబాద్‌ నుంచి అహ్మదాబాద్‌ కు ట్రైన్‌ లో వెళ్లి అక్కడి నుంచి బస్సులో కెవాడియా చేరుకోవచ్చు. విజయవాడ నుంచి వచ్చేవారు హైదరాబాద్‌ మీదుగా వెళ్లడం సులభం.

  • కెవాడియా లోపల అన్ని ప్రదేశాలకు ఉచిత బస్‌ సౌకర్యం ఉంది. టికెట్‌ లోనే బస్‌ ఛార్జీ కలిసి ఉంటుంది.

ఎక్కడ ఉండాలి?
కెవాడియా లోని టెంట్‌ సిటీలో ఉండటం ఒక ప్రత్యేక అనుభవం. నర్మదా నది ఒడ్డున ఏసీ టెంట్లు, రిసార్ట్‌ లు ఉంటాయి. ఉదయం టెంట్‌ తలుపు తీస్తే నది, పర్వతాలు కనిపిస్తాయి. బడ్జెట్‌ లో అయితే గుజరాత్‌ ప్రభుత్వం నడిపే సర్దార్‌ సరోవర్‌ రిసార్ట్, స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ దగ్గర ఉన్న హోటళ్లు ఉన్నాయి. వడోదరలో ఉండి ఒక రోజు ట్రిప్‌ గా కూడా వెళ్లవచ్చు.

ఏం చూడాలి?
స్టాచ్యూలో చూడాల్సింది కేవలం విగ్రహం మాత్రమే కాదు. ఉదయం 8 గంటలకు వ్యూయింగ్‌ గ్యాలరీ, మధ్యాహ్నం జంగిల్‌ సఫారీ, సాయంత్రం నర్మదా నదిపై ఏక్తా క్రూయిజ్‌ లో బోటింగ్, రాత్రి 7 గంటలకు లేజర్‌ లైట్‌ అండ్‌ సౌండ్‌ షో చూడవచ్చు. అడ్వెంచర్‌ ఇష్టపడేవారికి నర్మదా నదిపై రివర్‌ రాఫ్టింగ్‌ ఉంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు రాఫ్టింగ్‌ చేయవచ్చు. 3 కిలోమీటర్ల పాటు నదిపై సాగే ఈ రాఫ్టింగ్‌ కు గైడ్‌ లు ఉంటారు.

ఏం తినాలి?
కెవాడియాలో గుజరాతీ థాలీ ఫేమస్‌. దాల్, రోటీ, ఖిచిడీ, ఫాఫ్డా, థెప్లా దొరుకుతాయి. టెంట్‌ సిటీలోనే రెస్టారెంట్‌ లు ఉంటాయి. నాన్‌ వెజ్‌ ఎక్కువగా దొరకదు. బయట నుంచి ఫుడ్‌ తీసుకెళ్లడం కుదరదు.

యాత్ర, బడ్జెట్‌ వివరాలు?

  • రెండు రోజుల ట్రిప్‌ కు బడ్జెట్‌ స్టే, ట్రావెల్‌ ను బట్టి మారుతుంది. హైదరాబాద్‌ నుంచి వడోదర రిటర్న్‌ ఫ్లైట్‌ రూ.8 వేల నుంచి రూ.14 వేల వరకు ఉంటుంది. ట్రైన్‌ అయితే స్లీపర్‌ కు రూ.800, 3అఇ కు రూ.2200 వరకు.

  • ఎంట్రీ టికెట్‌ రూ.150 నుంచి రూ.1030 వరకు ఉంటుంది. వ్యూయింగ్‌ గ్యాలరీతో కలిపి రూ.380 టికెట్‌ బెస్ట్‌. జంగిల్‌ సఫారీకి రూ.200, రివర్‌ రాఫ్టింగ్‌ కు రూ.500, క్రూయిజ్‌ కు రూ.300 అదనం.

  • హోటల్‌ రోజుకి రూ.2500 నుంచి రూ.5000, టెంట్‌ సిటీ రోజుకి రూ.6000 నుంచి మొదలవుతుంది. ఫుడ్‌ రోజుకి రూ.1000.

ఇదీ చదవండి: రామాయణ చిత్రం తర్వాత ట్రెండ్‌ అవుతున్న ప్రదేశం ఏదో తెలుసా?

Videos

బిస్లరీ వాటర్ తాగుతున్నారా.. అయితే అంతే సంగతి.. FSSAI షాకింగ్ ప్రకటన..

షర్మిల గారు మిమ్మల్నే అడుగుతున్న.. వీటికి సమాధానం చెప్పండి చాలు..

పాక్ చేతిలో భారత్ కు ఘోర ఓటమి...

పెళ్ళికొడుకు తరుపు వాళ్ళు ఎంత బాధ పడుతున్నారంటే.. రాంనాథ్ షాకింగ్ నిజాలు

కేవలం 1 లక్షతో 10 లక్షలు సంపాదించే ప్లాన్.!

రణబీర్, యష్ కాదు..! పార్ట్ 2లో ఆయనే హైలెట్...

కండువా కప్పుకోలేదంతే..! బాబు చిటికెయ్యగానే.. పెళ్లి ఉన్నా సరే బెంగళూరు వెళ్లిపోయింది..

పేర్ని కిట్టు ఆధ్వర్యంలో YSRCP చేరిన TDP సీనియర్ నేత

చెల్లి అడిగిందని సొంత ఆస్తి ఇచ్చాడు.. తనది కాని ఆస్తి ఎలా ఇస్తాడు?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. లక్షకు దిగి రానున్న బంగారం..!

Photos

+5

‘భోగి’ మూవీ ప్రీ రిలీజ్... రెడ్‌ శారీలో మెరిసిన హీరోయిన్‌ డింపుల్ హయాతి (ఫోటోలు)

+5

కార్తీక సోమవారం.. శివనామస్మరణతో మార్మోగిన శివాలయాలు (ఫోటోలు)

+5

విశాఖపట్నం : కార్తీక సండే.. సందడి (ఫోటోలు)

+5

అనిరుధ్- కావ్య రిసెప్షన్‌లో సినీ, క్రీడా ప్రముఖుల సందడి.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : కోటి దీపోత్సవంలో వైభవంగా మధుర మీనాక్షి కల్యాణం (ఫోటోలు)

+5

శర్వానంద్‌ ‘భోగి’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

మిర్నా తాజా ఫొటోలు..

+5

ప్రభాస్‌ బ్యూటీ.. చీరలో మెరిసి (ఫోటోలు)

+5

డేంజర్ బాయ్స్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. (ఫోటోలు)

+5

హై మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫోటోలు)