Breaking News

తను కేసు పెడితే... మీరే జైలుకు వెళ్లాల్సి వస్తుంది!

Published on Wed, 02/12/2025 - 09:29

నాకు ఇటీవలే పెళ్లయింది. నా భార్యకి నాకు పెళ్ళికి ముందు 7 నెలల పరిచయం ఉంది. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. కట్నంగా 5లక్షల రూపాయలు ఫోన్‌ పే ద్వారా తీసుకున్నాను. పెళ్ళి వరకు అంతా బాగానే ఉంది కానీ, తర్వాత తన ప్రతి చిన్న దానికి గొడవ చేస్తుంది. తనకి అందం మీద ఉన్న శ్రద్ధ నా మీద, నా కుటుంబం మీద లేదు. ఊరికే ఫోటోలు దిగుతూ ఉంటుంది. స్కార్ఫ్‌ కట్టుకోమంటే కట్టుకోను అంటుంది. గొడవ పడిన ప్రతిసారి తలబాదుకుని నేను ఫిజికల్‌ అబ్యూస్‌ చేశాను అని వాళ్ళ కుటుంబ సభ్యులతో చెబుతుంది. అందంగా ఉంది, బాగానే సంపాదిస్తుంది అని పెళ్లి చేసుకున్నాను. అందం డబ్బు ఉంటే సరిపోదు, మాట వినే భార్య కూడా అయి ఉండాలి అని అర్థమైంది. మేమిద్దరం ఉద్యోగస్తులమే. నా జీతం 40,000. ఎం.బీ.ఏ చదివాను. తన జీతం 60,000. తను ఎం.సీ.ఏ యూనివర్సిటీ గోల్డ్‌ మెడలిస్ట్‌ కూడా. ఇంట్లో ఖర్చులకు తన జీతం పైసా కూడా ఇవ్వను అంటుంది. తన పెత్తనమే నడవాలి అంటుంది. ఎప్పుడూ తనని పొగుడుతూ ఉండాలి. తనకి నేను కౌన్సిలింగ్‌ కూడా ఇవ్వలేకపోతున్నాను. విడాకులు తీసుకోవాలి అంటే కనీసం సంవత్సరం ఆగాలి అని ఎక్కడో చదివాను. దయచేసి నా సమస్యకు పరిష్కారం సూచించగలరు.
– ఆదినారాయణ, గుంటూరు

ఏమిటి? ఐదు లక్షలు వరకట్నం తీసుకున్న మీరు, మీ భార్య మంచిది కాదు, సద్గుణాలు లేవు, నన్ను హరాస్‌ చేస్తోంది అంటున్నారా? హాస్యాస్పదంగా లేదూ? పైగా కట్నం డబ్బులు ఫోన్‌పే ద్వారా తీసుకున్నారు కదా... తను కేసు పెడితే జైలుకు వెళ్తారేమో చూసుకోండి!
ఇకపోతే... విడాకుల గురించి మీరు చదివింది నిజమే. హిందూ వివాహ చట్టం ప్రకారం కనీసం ఒక సంవత్సరం గడవకుండా విడాకుల కోరడం కుదరదు. పరస్పర ఒప్పందంతో విడిపోవాలి అనుకున్నా గాని కనీసం ఒక సంవత్సరం విడివిడిగా ఉంటున్నట్లు చూపించాలి.
మీ భార్య ఫోటోలు ఎక్కువ దిగుతుంది, ముఖానికి స్కార్ఫ్‌ కట్టుకోమంటే వినడం లేదు, తన పెత్తనం నడవాలి అంటుంది, జీతం కూడా నాకు ఇవ్వడం లేదు అని మీరు రాసిన ఈ–మెయిల్‌ చదివిన తర్వాత, కౌన్సెలింగ్‌ మీ భార్యకి కాదు మీకు అవసరం అనిపించింది. భార్య మీతో సమానం, మీరు చెప్పినట్లు వినడానికి తను మీ బానిస కాదు. 

ఇది మీకు తెలిసినట్లుగా లేదు. ఏ విధంగా చూసుకున్నా మీకన్నా తనకే మెరిట్‌ ఎక్కువ కదా... మీరెందుకు మీ జీతం ఆవిడకి ఇచ్చి ఇంటిని నడపమని చెప్పరు? ఇంటికి యజమాని పురుషుడు మాత్రమే అని అనుకుంటున్నారా? కనీసం మీ మాట తను వినట్లేదు, జీతం ఇవ్వడం లేదు అనకుండా ‘‘కుటుంబ బాధ్యతలు, ఆర్థిక బాధ్యతలు పంచుకోవడం లేదు’’ అనివుంటే నేను బహుశా ఆవిడ వైపు నుంచి కూడా చాలానే తప్పు ఉంది అని అనుకునేవాడిని

. చాలామంది పురుషులలో – పురుషుల తల్లిదండ్రులలో కూడా ఈ పురుషాధిక్య భావాలు ఇంకా వుండటం బాధాకరం. మీరు పంపిన ఈ–మెయిల్‌ని బట్టి చూస్తే అందులోని విషయాలు గృహహింస చట్టం – వరకట్న నిషేధ చట్టం కింద నేరాలే! తనది కూడా ఎంతో కొంత తప్పు ఉంది అనే బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌తో మీకు నేను ఇచ్చే సలహా ఏమిటి అంటే: ఇద్దరూ కలిసి మంచి ఫ్యామిలీ కౌన్సెలర్‌ దగ్గర కౌన్సెలింగ్‌ తీసుకోండి. తప్పు ఎవరిదైనా సరిచేసుకొని హాయిగా వైవాహిక జీవనాన్ని సాగించండి. అప్పటికీ కుదరకపోతే సామరస్యంగా విడిపోండి. ఆౖన్‌లైన్‌లో కట్నం తీసుకున్నారు కాబట్టి కేసులు మీ మీద వేస్తే మీకే నష్టం!  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)