Breaking News

సామాన్యులు సైతం సులభంగా భగవంతుని అనుగ్రహం పొందాలంటే..

Published on Wed, 05/06/2026 - 14:53

తిరుపతి సమీపంలోని రాయలచెరువులో ఉన్న శ్రీ శక్తి పీఠం ఒక ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రం. శ్రీ మాతాజీ రమ్యానంద భారతీ స్వామిని ఈ శ్రీ శక్తి పీఠాన్ని నిర్వహిస్తున్నారు. ఈ పీఠం భారతీయ సనాతన సంస్కృతి, యోగ విద్యలకు నిలయంగా అలరారుతోంది. ఈ పీఠాన్ని మాతాజీ రమ్యానందభారతీ స్వామిని (సిద్ధాశ్రమ యోగి) నిర్వాహిస్తున్నారు. ఆమె ధర్మాచరణ ప్రచారంలో భాగంగా మన భాగ్య నగరానికి విచ్చేసిన నేపథ్యంలో మన సాక్షి ఆ అమ్మతో సంభాషించి..మన పాఠకులుకు కలిగే ఎన్నో దర్మసందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేసింది. మరి అవేంటో సవివరంగా చూద్దామా..

"శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః" అన్న రీతిలో సామాన్యులు సైతం సులభంగా ఆ భగవంతుని కృపకు ఎలా పాత్రులు కాగలరు, అలాగే శ్రీ విద్యా ఉపాసన, సులభంగా ఇంట్లోనే చేయడం, యజ్ఞ యాగ క్రతువులు ఏవిధంగా చేయొచ్చు, ఇంకా..మరకతవర్ణ కాళిదేవి విశిష్టత, క్షుద్ర పూజలు ఉన్నాయా..? తదితర ధర్మ సందేహాలు గురించి సవివరంగా తెలుసుకుందామా..!

తిరుపతి శ్రీశక్తి పీఠాధిపతి మాతాజీ రమ్యానందభారతీ స్వామిని జగద్గురువులు శ్రీ సిద్ధేశ్వరానందభారతీ మహాస్వామివారి ప్రధాన శిష్యులలో ఒకరు. ఆమెను స్వయంగా సిద్ధేశ్వరానందభారతీ స్వామివారే "సిద్ధాశ్రమ యోగి"గా  అభివర్ణించారు. మాత రమ్యానంద భారతీ స్వామి ప్రస్థానం డాక్టర్‌గా మొదలైన ఆధ్యాత్మికత వైపుకి అడుగులు వేసిన గొప్పయోగి ఆమె. సామాన్య భక్త జనం మదిలో మెదిలో ఎన్నో సందేహాలను చిరుదరహాసంతో నివృత్తి చేసేలా అద్భుతమైన పరిష్కార మార్గాలను అందించారు. అవేంటంటే.

సువాసిని పూజ ప్రధానోద్దేశ్యం? ఎందుకోసం?
లలితాదేవిని "సువాసినర్చన ప్రీత" అని లలితా త్రిశతి మంత్రల్లో ఉంటుంది. అంటే దీని అర్థం సువాసినులను (భర్తతో కూడిన స్త్రీలను) పూజించడం (అర్చించడం) వల్ల సంతోషించే దేవత అని. ఇక్కడ సువాసినీ: అంటే సౌభాగ్యవతి, పసుపు కుంకుమలతో ఉన్న స్త్రీ. లలితా దేవిని సువాసినీ పూజ ద్వారా ఆరాధిస్తే, ఆమె అత్యంత ప్రసన్నురాలై భక్తుల కోరికలను నెరవేరుస్తుందని లలితా త్రిశతి తెలియజేస్తుంది. 

అలాగే ఎక్కడ యత్ర నార్యంతు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః! అన్న ఆర్యోక్తిని చాటి చెప్పేలా ఈ పూజలను నిర్వహిస్తున్నామని చెప్పారు అమ్మ రమ్యానంద భారతీ. అదీగాక జనవరిలో తిరుపతి క్షేత్రంలో కలియుగ వేంకటేశ్వరుడు, పద్మావతి దేవి వకుళమాత ఉన్న ఆ పుణ్యక్షేత్రంలో దశసహస్ర సువాసినీ పూజ జగడమే గాక గిన్నిస్‌ రికార్డులకెక్కిన సంగతి కూడా తెలిసిందే. స్తీల గొప్పతనం, వారిని గౌరవించటం గురించి సమాజానికి తెలియజేయడమే ఈ పూజ ప్రదానోద్దేశ్యమని అన్నారామె.

పంచాయతన పూజ..పంచాయతన సమేత/పూజ అంటే..?
హిందూ సాంప్రదాయంలో, ముఖ్యంగా స్మార్త సంప్రదాయంలో పంచాయతన పూజ (ఐదుగురు ప్రధాన దేవతల ఆరాధన) చాలా ముఖ్యమైనది.
పంచాయతన 
'పంచ' (ఐదు) + 'ఆయతన' (స్థానం/నివాసం). ఐదుగురు ప్రధాన దేవతల సమూహం.
దేవతలు: శివుడు, విష్ణువు, శక్తి (దేవి), గణపతి, మరియు సూర్యుడు.
ఉద్దేశ్యం: ఆది శంకరాచార్యులచే ప్రచారం చేయబడిన విధానం ఇది. వివిధ ఆరాధనా మార్గాల (శైవం, వైష్ణవం, శాక్తేయం మొదలైనవి) మధ్య ఐక్యతను తెస్తుంది.

పంచాయతన సమేత
పైన పేర్కొన్న ఐదుగురు దేవతలను ఒకే సమయంలో, నిర్దిష్టమైన స్థానాల్లో ఉంచి పూజించటం. క్తుడు తన ఇష్ట దైవాన్ని (శివుడు, విష్ణువు మొదలైనవారు) మధ్యలో ఉంచి, మిగిలిన నలుగురిని నాలుగు దిక్కులలో ఉంచి పూజిస్తారు. ఉదాహరణకు, శివుడు ప్రధానమైతే, అది "శివ పంచాయతనం" అవుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఇష్టం దైవం మధ్యలో ఉంచి మిగిలిన వారిని పరివార దేవతలుగా పూజించటం. 

తంత్రం అంటే..
తంత్రం అంటే.. మనల్ని రక్షించేదాన్ని తంత్రం అంటారు. అవి చాలా రకాలు ఉదాహరణకు శ్రీ విద్యా తంత్రం మేరుశాస్త్ర తంత్రం అని పలు రకాలు ఉన్నాయి మన శాస్త్రాల్లో. అదీగాక సమస్త శాస్త్రంలో తంత్ర శాస్తం ఉత్తమం అని, వేద సమ్మతమైనదని మన పురాణాలే నొక్కి చెబుతున్నాయి. దేవతకు ఎటువంటి పూజలు చేస్తే అనుగ్రహిస్తుంది, ఏవిధంగా ఆరాధించాలి వంటివే ఈ తంత్రాలు. ఏ సమయంలో పూజ చేయాలి, ఎలాంటి హోమాలు చేయాలి. వీటి గురించి వివరించేది తంత్ర శాస్త్రం.

కాళి అంటే అరుణ వర్ణం, శ్యామ వర్ణం మరకతవర్ణ కాళి అంటే..?
కాలంతో ప్రకాశించే దేవి కాబట్టి నలుపు అని అంతా భావించి అందరూ ఆ మాతను నల్లనిదిగా చెప్పారు. కానీ ప్రతీదేవతకు సత్వ, తామస, రాజస లక్షణాలు ఉంటాయి. తామస లక్షణం కలిగింది నల్లటి కాళి, శ్యామా కాళీ. ఇక శ్రీశక్తిపీఠంలో కొలువుదీరిన మరకతవర్ణం కాళి అంటే..అక్కడ అమ్మ మరకతవర్ణంతో ప్రకాశించాలని ఆదేశింంచిదని, అందువల్ల ఈ ఏర్పాటు చేశామని మాత రమ్యానంద భారతీ చెప్పారు. 

అదీగాక ప్రకృతి రూపమే మరకతవర్ణం. ఇక్కడ మరకతవర్ణం అంటే  చిరునవ్వుతో ప్రేమ స్వరూపిణీగా కనిపించే కాళిమాత. త్వరగా భక్తులను గ్రహిస్తుంది. మరకతవర్ణశిలపై చెక్కిన దేవత. ఇక్కడ కొలువుదీరిన సిద్ధేశ్వరుడు సైతం మరకతవర్ణమే. అంతేగాదు ఈ మరకతవర్ణం ఐశ్వర్యాన్ని, మనశ్శాంతిని అందిస్తుంది. కోరుకున్న సంకల్పం నెరవేరడానికి మరకతవర్ణంలోని దేవతలను పూజించే ఆచారం మన పురాణాల్లో కూడా ఉంది.

శ్వేత పాతాళ వారాహి అంటే..?
హిరణ్యాక్షుడు భూమిని ఎత్తుకుపోయాడు. ఆయన బ్రహ్మదేవుడి గురించి తప్పస్సు చేసినట్లు పురాణాల్లో విన్నాం, చదివాం. కానీ ఆయన వారాహి దేవి కోసం తపస్సు చేశాడు. అమ్మవారు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే. మరణం లేని వరం కావాలని కోరాడు. అందుకు అమ్మ సమ్మతించకపోవడంతో హిరణ్యాక్షుడు తెలివిగా నువ్వే సంహరించాలి..అలాగని ఆమెనే స్వయంగా సంహరించకుండా ఉండేలా వరం కోరతాడు. 

అమ్మ ప్రసన్న వదనంతో తథాస్తు అంటుంది. ఎప్పుడైతే హిరణ్యాక్షుడు భూమిని పాతాళలోకంలో దాచే ప్రయత్నం చేస్తాడో అప్పుడు మానవులకు దేవతాలకు భూ కష్టాలను నివారించేందుకు విష్ణువు సమాయక్తమవుతాడు. 

అప్పుడు వారాహి దేవిలోని శ్వేత వరాహం విష్ణువులో ప్రవేశింపచేస్తుంది. దాంతో విష్ణువు వరాహరూపం ఎత్తి హిరణ్యాక్షుడిని సంహరిస్తాడు. అలా వచ్చిందే శ్వేత వరాహం. ఆమె వ్యవసాయ దేవత కూడా. అందువల్ల భూ సంబంధమైన కష్టాలు, ఆస్తి తగదాలతో సతమతమయ్యే వాళ్లు ఈ అమ్మ పూజించి ఆ సమస్యలను పోగొట్టుకుంటారని చెప్పారు.  

దేవతా విగ్రహాలను ఇంట్లో పెట్టుకోవచ్చా?

ఇంట్లోనే హోమాలు, యాగాలు చేయొచ్చా?
అయితే ఇలాంటి క్రతువులు ఇంట్లోనే చేయడం అనేది సులభం కాదని అన్నారు. అలాగే మన పురాణాల్లో చూసినా కూడా ఎక్కడా కూడా.. పలాన పర్వతం, దేవాలయం, అడవుల్లో చేసినట్లే ఉంటాయి. పైగా ఓ క్షేత్రం, పీఠం అని కూడా ఉంటుంది. అంటే  అక్కడ ప్రాణ ప్రతిష్ట చేసి ఎంతో నిష్టతో పూజలు కైంకర్యలు నిర్వహిస్తారు. 

పైగా అక్కడ అత్యంత శక్తిమంతంగా ఉంటుంది. అందుల్లో అలాంటి పీఠాలలో లేదా దేవాలయాలు, ప్రుమఖ పుణ్యక్షేత్రాల్లోనే హోమాలు, యాగాలు చేయడం శ్రేష్టమని అన్నారామె. అలాగే అంత ఖర్చు పెట్టలేని వారు, తమ శ్రీశక్తిపీఠంలో చేయించుకోవచ్చని, ఇ‍క్కడ ఉచితంగానే నిర్వహిస్తామని, అన్ని తామే ఇస్తామని చెప్పారామె.

శ్రీ చక్రం ఇంట్లో పెట్టుకోవచ్చా?ఎలా పూజించాలి?
యంత్రంలలోకెల్లా గొప్పది శ్రీయంత్రం..విగ్రహాన్ని గానీ, యంత్రాన్ని గానీ తెచ్చి ప్రాణప్రతిష్ట చేస్తే నిత్య పూజలు, నైవేద్యం పెట్టాలి. ప్రాణ ప్రతిష్టలేకుండా విగ్రహం, యంత్రం పూజించినా ఎలాంటి దోషం లేదు. ఎప్పుడైతే ప్రాణప్రతిష్టం చేస్తామో అక్కడ అమ్మవారి వచ్చి కూర్చోంటుంది కాబట్టి అనునిత్యం పూజ చేయాలి. 

అయితే గృహస్థులకు ఏదైనా అనివార్య కారణాల వల్ల ఆటంకాలు వస్తాయి. అలాంటి సందర్భంలో బియ్యం డబ్బాలో ఉంచుకుంటే సరిపోతుంది. కానీ ఇంట్లో మాత్రం ప్రాణప్రతిష్ట చేయకుండా పెట్టుకుని పూజించొచ్చు. ఎలాంటి సమస్య లేదన్నారామె.

క్షుద్ర ప్రయోగాలు ఉన్నాయా? అది నిజమేనా?
ప్రకృతి ఉంటే వికృతి ఉంటుంది. దైవం ఉంటే దెయ్యం కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు అంత నిష్టగా క్షద్రప్రయోగాలు చేయడం లేదు గానీ మనుషులంతా కేవలం తమ నెగిటివ్‌ వైబ్రేషన్స్‌తో అవతవాళ్లపై ప్రయోగాలు చేస్తున్నారని చమత్కరించారామె. తపస్సుకి, మంత్రానికి అధిదేవతలు దేవుళ్లు. దేవతా సాధన చేసేవాళ్లు, మానసిక పరిస్థితి స్ట్రాంగ్‌గా ఉన్నవాళ్లపై ఇలాంటి ప్రయోగాలు అంతగా పనిచేయవన్నారు. 

ఆందోళనలు, బలహీన మనస్సు ఉన్నవారు సులభంగా ఆ ప్రభావానికి గురవ్వుతారని అన్నారు. ఎవ్వరూ ఎలాంటి ప్రయోగాలు చేసినా..మీరు తట్టుకునేలా స్ట్రాంగ్‌గా మారండి. భగవంతుడి సాధన చేయండని పిలుపునిచ్చారామె. మరి ఎవరైనా ప్రయోగాలు చేస్తే..వాటి లక్షణాలు కనిపిస్తాయా? అంటే ఈజీగా తెలుసుకోవచ్చన్నారు. కొన్నింటికి పరిష్కారమార్గం తెలుసుకునే వ్యవధి ఉండదని, కొన్నింటికి మాత్రం సమయం ఉంటుందని అన్నారు కావున సకాలంలో మంచి గురువులని ఆశ్రయించి వాటి నుంచి సులభంగా బయటపడొచ్చని అన్నారు.

వామాచారం అంటే..
ఏకశ్వేరోపాసనే అసలైన వామాచారం. ఒకే దేవుడిని పూజిస్తా అనేదే వామాచారం. ఇందులో సరైన గురువు దొరికితే ఫలితం రావొచ్చు. మన పురాణాల్లో నరకాసురుడి దీన్ని అనుసరించి శక్తులు ఎన్ని సంపాదించినా కామాఖ్య దేవి వెళ్లిపోయింది అన్న విషయాన్ని గుర్తుచేశారామె

డాక్టర్‌ కమ్‌ ఆధ్యాత్మిక వేత్తగా మంత్రం అనారోగ్యం నుంచి రక్షించగలదా?
ఆధ్యాత్మికతలోనే ఎన్నో వైద్య రహస్యాలు ఉన్నాయి. మణి మంత్ర, ఓషధులతో ఎన్నో రోగాలను నయం చేయొచ్చని అన్నారు. తాను వైద్యాన్ని మంత్ర సారాన్ని అనుసంధానిస్తు..కొన్ని పుస్తకాలను సైతం రాశానని చెప్పారు. 

మరింత పూర్తివివరంగా ధర్మ సందేహాల గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ కింది వీడియోపై క్లిక్‌ చేయండి.
 

(చదవండి: ఫలితాలకు ముందు ఆ ఆలయాన్ని సందర్శించిన టీవీకే విజయ్!)

 

#

Tags : 1

Videos

VCK నిర్ణయంపై స్టాలిన్ ఆగ్రహం

వర్మ ఏంటి ఈ కర్మ.. ఇంచార్జి పదవి నుంచి తొలగింపు

ప్రభుత్వం ఏర్పాటుపై క్లారిటీ..! KSR డీటెయిల్ అనాలసిస్

తమిళనాడు సీఎం విజయ్..?

కరీంనగర్‌లోని BRS క్యాంప్ కార్యాలయంపై BJP దాడి

మైనర్ అమ్మాయిలే టార్గెట్.. వెలుగులోకి ఇన్ స్టాగ్రామ్ చీటర్ అర్జున్ అరాచకాలు

సోషల్ మీడియా యాక్టివిస్ట్ పై టీడీపీ గుండాల దాడి

చంద్రబాబు అండతో భారీ భూ కబ్జా... గీతంకు హైకోర్టు నోటీసులు..

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వాహనంపై బీజేపీ శ్రేణుల దాడి

పెద్ది కథ విన్నాక తేరుకోలేకపోయా..! ఆర్ట్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

Photos

+5

‘గోదారి గట్టుపైన..’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

‘అగ్లీ స్టోరీ’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

SRH vs PBKS : ఉప్పల్‌లో ఫుల్‌ జోష్‌.. తారల సందడి (ఫొటోలు)

+5

మహేశ్ బాబు సోదరుడి కుమారుడి మూవీ సాంగ్ షూట్ (ఫొటోలు)

+5

నిర్మాత ఆర్‌బీ చౌదరి భౌతిక కాయానికి సినీ ప్రముఖుల నివాళులు (ఫొటోలు)

+5

బర్త్ డే బ్యూటీ.. అందాల భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)

+5

'టీవీకే' విజయ్‌ని ఇలా ఎప్పుడూ చూసుండరు (ఫొటోలు)

+5

తిరుపతి గంగమ్మ జాతర ప్రారంభం (ఫొటోలు)

+5

శ్రీకాకుళం : అంగరంగ వైభవంగా భద్రమహంకాళి అనుపు ఉత్సవం (ఫొటోలు)

+5

హైదరాబాద్ : నెహ్రూ జూ పార్క్... ‘జూ’లకాలాటలలో పులి (ఫొటోలు)