Breaking News

శ్రావణం శుభప్రదం..! వరలక్ష్మీ వ్రతం ఎప్పుడంటే..?

Published on Mon, 07/21/2025 - 09:19

సకల శుభాల శ్రావణ మాసం ఈ నెల 25న ఆరంభం కానుంది. శ్రావణ మాసంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు, పవిత్రోత్సవాలు, కృష్ణాష్టమి వేడుకల నేపథ్యంలో ఆలయాల్లో భక్తుల సౌలభ్యం కోసం ఆలయ నిర్వహణ కమిటీలు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ మాసంలో ఇంటింటా శ్రావణ శోభ కనిపిస్తుంది. అయితే ఈ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి ఓ విశిష్టత ఉంది, అందుచేత మహిళలు ఈరోజును ఎంతో పవిత్రమైన దినంగా భావిస్తారు. 

నెల రోజులుగా ఆషాఢం కావడంతో ముహూర్తాలు లేవు. ఈనెల 25 నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుండడంతో మహిళలు శ్రావణ లక్ష్మీ వ్రతాలను ఆలయాల్లో భక్తిశ్రద్ధలతో చేసేందుకు సిద్ధమవుతున్నారు.ఈనెల 26న మొదటి శుక్రవారం కావడంతో తమ ఇళ్లల్లో, ఆలయాల్లో శ్రావణ లక్షి్మకి పూజలు చేసేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు.

నోముల మాసం శ్రావణం..
పురోహితులు శ్రావణ మాసాన్ని నోముల మాసంగా అభివర్ణిస్తారు. శ్రావణంలో మంగళగౌరీ వ్రతం, వరలక్ష్మీ వ్రతాలను ఆచరిస్తారు. మంగళగౌరీ వ్రతాన్ని శ్రావణంలో వచ్చే ఏ మంగళవారమైనా చేయవచ్చు. ఈ వ్రతాన్ని యువతులు పెళైన ఏడాది తరువాత ఆచరిస్తారు. వరలక్ష్మీ వ్రతాన్ని పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు జరుపుకుంటారు.ఈ వ్రతాన్ని జీవితాంతం ఆచరిస్తారు. 

ముఖ్యమైన పండగలు..
శ్రావణ మాసమంతా పండగల సందడి ఉంటుంది.ఈ నెల 26న తొలి శుక్రవారం, ఆగస్టు 1న రెండవ శుక్రవారం, ఆగస్టు 3న ఆదివారం స్నేహితుల దినోత్సవం, ఆగస్టు 8న మూడో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం, ఆగస్టు 9న రాఖీ పండగ, అదే రోజు జంధ్యాల పౌర్ణమి, ఆగస్టు 15న నాల్గవ శుక్రవారం, ఆగస్టు 16న శ్రీకృష్ణ జన్మాష్టమి వంటి ముఖ్యమైన పండగలు శ్రావణంలో ఉన్నాయి. ఆగస్టు 22న ఐదవ శుక్రవారంతో శ్రావణ మాసం ముగుస్తుంది.శ్రావణం పూర్తయిన వెంటనే భాద్రపదం మాసం ఈ ఏడాది ఆగస్టు 27న జరగనున్న వినాయకచవితితో ప్రారంభంకానుంది.

శ్రావణమాసానికి అత్యంత ప్రాధాన్యం
సకల శుభాలను ఒసగే శ్రావణం జ్ఞానస్థితిని అందిస్తుంది. హరిహర భేదం లేదని నిరూపించే శ్రావణమాసంలో వైష్టవారాధనతో పాటు మహాశివుడికి పెద్ద ఎత్తున రుద్రాభిషేకాలు నిర్వహిస్తారు.ముఖ్యంగా వివాహాది శుభకార్యాలకు శ్రావణ మాసంలో మంచి ముహూర్తాలు ఉన్నాయి.
ఎస్‌వీఎల్‌ఎన్‌ శర్మయాజీ, యజ్ఞకర్త, వీరఘట్టం

ఈ నెల 28 నుంచి మంచి ముహూర్తాలు.. 
నెల రోజులుగా ఉన్న  ఆషాఢ మాసం ఈనెల 22తో ముగియనుంది. ఈనెల 25 నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుంది. దీంతో ఈనెల 28 నుంచి ఆగస్టు 22 వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. శ్రావణ మాసంలో  వ్రతాలతో పాటు పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, శుభాకార్యాలకు మంచి రోజులు కావడంతో శుభకార్యాలు చేపట్టేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. 

ముఖ్యంగా జూలై 26,27,30,31 ఆగస్టు నెలలో1,3,4,6, 7, 8, 9, 10, 11, 13,14,17,18  తేదీలో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. శ్రావణమాసంలో ఉన్న 17 మంచి ముహూర్తాల్లో జిల్లాలో వందల సంఖ్యలో పెళ్లిళ్లు జరగనున్నాయని పురోహితులు చెబుతున్నారు. 

(చదవండి: వైష్ణోదేవి దర్శనం..హిమాలయాల వీక్షణం..!)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)