Breaking News

ఎవరు చెప్పారన్నది కాదు... స్థితప్రజ్ఞత ముఖ్యం!

Published on Mon, 07/28/2025 - 09:57

ఒకరోజు ఒకతను ఒక ముని దగ్గరకు వెళ్లాడు. ఆయనకు నమస్కరించి ‘జ్ఞానం అంటే ఏమిటి? నేను కలిసిన కొందరు ఒక్కోలా చెప్పారు... మరి మీరేమంటారో తెలుసుకోవాలని ఉంది’  అన్నాడు. ‘జ్ఞానం అంటే సుఖాన్ని పొందినప్పుడు పట్టరాని ఆనందంతో ఉన్న చోటుని మరచిపోవడం కాదు... బాధలో అలసిసొలసి డీలా పడిపోవడం కాదు. కష్టమో సుఖమో దేనికైనా స్థిరంగా ఉండటం ముఖ్యం’ అన్నారు ముని. 

‘మీరు దీనిని ఎక్కడి నుంచి నేర్చుకున్నారు?’ అని అడిగా డతను.  అంతట ఆ ముని ‘నేను ఈ నిజాన్ని గాడిద నుండి నేర్చు కున్నాను’ అన్నారు. ‘ఏమిటి మీరు చెప్తున్నది? అది ఎలా సాధ్యం?’ అని అడిగాడు మునిని. 

ఒక గాడిద ఆ దారిన పోతోంది. ముని దాని వంక చూడమన్నారు. ‘ఈ గాడిద వీపు మీద ప్రతి ఉదయం మురికి బట్టల మూటలు పెట్టి తోలుకుంటూ పోతాడు దాని యజమాని. నదిలో మురికి బట్టలన్నింటినీ ఉతికి సాయంత్రం శుభ్రమైన బట్టల మూటలను గాడిద వీపు మీద ఉంచి ఇంటిబాట పడతాడు. మనం ఆ గాడిదలా ఉండాలి. ఉదయం పోతున్నప్పుడు మురికి బట్టల మూటలని అదేమీ బాధపడలేదు. సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు శుభ్రమైన బట్టల మూటలని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవదు. దేన్ని చూసీ అది చలించలేదు. ఆ స్థిరమైన జ్ఞానాన్ని దాని నుంచి నేర్చుకున్నాను’.

అలాంటి స్థితి పరిపక్వతతోనే సాధ్యం. సుఖమైనా, కష్టమైనా స్థితప్రజ్ఞత ముఖ్యం. ఎవరు బోధిస్తారనేది ముఖ్యం కాదు. గురువు ఎవరైనా కావచ్చు, కానీ మనం ఏమి నేర్చుకుంటున్నామనేదే ముఖ్యం.
– యామిజాల జగదీశ్‌ 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)