Breaking News

‘ఎర్ర’ గౌనులో దీపికా రాయల్‌ లుక్‌ : స్పిరిట్‌పై ఫ్యాన్‌ కామెంట్‌ వైరల్‌

Published on Wed, 05/28/2025 - 14:59

ప్రముఖ దర్శకుడు సందీప్‌రెడ్డి, ‘స్పిరిట్’ మూవీ, బాలీవుడ్‌ స్టార్‌హీరోయిన్‌ దీపికా పదుకొణే మధ్య నడుస్తున్న వివాదం నేపథ్యంలో దీపికా పదుకొనే  ఇన్‌స్టా లుక్‌ వైరల్‌గా మారింది.  బ్రైట్‌ రెడ్‌ డ్రెస్‌లో దీపికా  ఆశ్చర్యపరిచింది.  డైమండ్‌ ఆభరణాలతో స్పెషల్‌ లుక్‌లో అదరగొట్టేసింది.  దీంతో అభిమానులు  కామెంట్స్‌ వైరల్‌గా మారాయి.

ప్రపంచ లగ్జరీ బ్రాండ్ ‘కార్టియర్ ’ ఈవెంట్‌లో  స్టాక్‌హోమ్‌లో  దీపికా పదుకొణే ఎరుపు రంగు అవతారంలో అబ్బురపరిచింది.  ఈ ‍బ్రాండ్‌  అంబాసిడర్‌ అయిన  స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో  అందంగా  మెరిసింది.  ఆషి స్టూడియో  రూపొందించిన ఆఫ్-షోల్డర్ రెడ్ మొహైర్ గౌను, కార్టియర్ ఆభరణాలతో ధరించింది. మదర్-ఆఫ్-ఆల్ ఫ్యాషన్ లుక్స్‌తో ఫ్యాషన్‌ ప్రియులను ఆకట్టుకుంది. తన లుక్‌కు పర్ఫెక్ట్‌  మ్యాచింగ్‌ అనిపించేలా  ధరించిన ప్రిన్సెస్ కోడెడ్ డైమండ్స్ , నీలమణి పొదిగిన నెక్లెస్ , సాలిటైర్ స్టడ్ చెవిపోగులు మరింత ఎట్రాక్షన్‌గా నిలిచాయి. 

అంతేనా  షోల్డర్‌ లెంత్‌ జుట్టును సొగసైన సైడ్ పార్టెడ్ హెయిర్ జెల్ లాడెన్ వెల్ కెంప్ట్ లుక్ లో స్టైల్ చేసింది.  తన రూపానికి తగినట్టు మస్కారా, న్యూడ్ బ్రౌన్ లిప్ ఆయిల్‌మేకప్‌తో గ్లామర్‌ లుక్‌ను సంపూర్ణం చేసుకుంది. దీంతో నెటిజన్లు ఆమె లుక్‌కి ఫిదా అవడం మాత్రమే కాదు..  ‘‘డోంట్‌ వర్రీ..దీపికా మా మద్దతు నీకే..  చాలా అందంగా ఉన్నావ్‌’’ అంటూ కమెంట్‌ చేశారు. అంతేకాదు.. స్పిరిట్‌  ఫ్లాప్‌.. పక్కా అంటూ మరో యూజర్‌ కమెంట్‌ చేయడం గమనార్హం.

ఇదీ చదవండి: ట్విటర్‌ గాలం : ఇండో-అమెరికన్‌ , యూట్యూబ్‌ సీఈవోకి గూగుల్‌ భారీ ఆఫర్‌

కాగా ప్యాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, దర్శకుడు  సందీప్‌రెడ్డి వంగా కాంబినేషన్‌లో  'స్పిరిట్' అనే మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీలో  తొలుత బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనేనును ఎంపిక  చేశారు. కానీ వివాదాల నేపథ్యంలో ఆమెను ఈ ప్రాజెక్ట్‌నుంచి తొలగించారు. దీపిక‌ స్థానంలో యానిమ‌ల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ కనిపించనుంది.

 

Videos

మోడీతో బిగ్ థ్రెట్.. మళ్ళీ జైలుకు చంద్రబాబు..!కారుమూరి షాకింగ్ నిజాలు

విజయ్ కారును అడ్డుకున్న TVK మహిళా నేత

రౌడీ షీటర్ పండుకు స్పెషల్ ట్రీట్ మెంట్

తగలబడుతున్న బంగ్లాదేశ్.. హిందువుల ఇంటికి నిప్పు

నువ్వు బొట్టు, మెట్టెలు పెట్టుకొని తిరుగు! శివాజీకి చిన్మయి కౌంటర్

17 రోజుల్లోనే కాంతార-2 రికార్డు బద్దలు.. ధురంధర్ కలెక్షన్స్ సంచలనం!

వీధి కుక్క దాడి.. ఐదుగురికి గాయాలు

No స్కామ్.. No కేస్.. స్కిల్ స్కామ్ కేస్ కొట్టేయించే పనిలో చంద్రబాబు

ఢిల్లీలో హై టెన్షన్.. బంగ్లాకు హిందూ సంఘాల వార్నింగ్

నా తల్లి చావుకి కారణం వాడే.. ఇదిగో వీడియో ప్రూఫ్.. TDP నేతపై సంచలన కామెంట్స్

Photos

+5

గ్రాండ్‌గా కోలీవుడ్ స్టార్‌ కమెడియన్‌ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

వైఎస్ జగన్‌ ప్రజాదర్బార్‌: సమస్యలు వింటూ.. భరోసా కల్పిస్తూ.. (ఫొటోలు)

+5

నా సూపర్‌స్టార్‌: భార్యకు సంజూ శాంసన్‌ విషెస్‌ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖ సినీతారలు (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

+5

రిసార్ట్‌లో హీరోయిన్ కావ్య కల్యాణ్‌రామ్ (ఫొటోలు)

+5

2025 జ్ఞాపకాలతో హీరోయిన్ శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

పూల డ్రస్‌లో మెరిసిపోతున్న సంయుక్త (ఫొటోలు)

+5

నిర్మాత బర్త్ డే.. బాలీవుడ్ అంతా ఇక్కడే కనిపించారు (ఫొటోలు)

+5

కూటమి పాలనలో పెన్షన్ల కోసం దివ్యాంగుల కష్టాలు (ఫొటోలు)