నా తల్లి చావుకి కారణం వాడే.. ఇదిగో వీడియో ప్రూఫ్.. TDP నేతపై సంచలన కామెంట్స్
వాట్ ఏ టాలెంట్ బ్రో..! రెండు కాళ్లు లేకపోతేనేం..
Published on Tue, 06/03/2025 - 16:01
మనపై మనకున్న నమ్మకం, అచంచలమైన ధైర్యం ముందు..ఏ వైకల్యం అయినా చిన్నబోవాల్సిందే. అందుకు ఉదాహారణ ఈ కొరియోగ్రాఫర్. రెండు కాళ్లు లేపోయినా..విద్యార్థులకు అలవోకగా నృత్యం నేర్పిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. టాలెంట్ అంటే ఇదే అనేలా స్ఫూర్తిగా నిలిచాడు.
అతడే కొరియోగ్రాఫర్ అబ్లు రాజేష్ కుమార్. అతడు దివ్యాంగుడు. అయితేనేం..అతడి మనోధైర్యం, సంకల్పం.. అతడి కాళ్లకు ఊపిరిపోశాయా అనిపించేలా అద్భుతంగా డ్యాన్స్ చేస్తాడు అతను. కూమార్ ప్రోస్థెటిక్ కాళ్లతో తన విద్యార్థులకు డ్యాన్స్ నేర్పిస్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా వారింది.
ఆ వీడియోలో అతడు పిల్లలకు బాలీవుడ్ ప్రముఖ హిట్‌పాట చిట్టియాన్ కలైయాన్ పాటకు డ్యాన్స్ చేయడం నేర్పిస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ పాటకు లయబద్ధంగా కుమార్ కదుపుతున్న స్టెప్పులు చూస్తే..కళ్లు రెప్పవేయడమే మర్చిపోతాం. ఏదో మ్యాజిక్ చేసినట్లు మంచి హవభావాలు పలికిస్తూ..డ్యాన్స్ చేస్తూ కనిపిస్తాడు వీడియోలో.
ఈ వీడియోని చూసి నెటిజన్లు మనసుంటే మార్గం ఉంటుంది అనేందుకు ఇతడే ఉదాహరణ అని ఒకరు, అచంచలమైన ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం అని మరికొందరు కూమార్‌ని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.
(చదవండి: World Bicycle Day: 70 ఏళ్ల వ్యాపారవేత్త ఫిట్‌నెస్‌కి ఫిదా అవ్వాల్సిందే! ఇప్పటకీ 40 కి.మీలు సైకిల్)
Tags : 1