రసభరితం : 40 రసాల మాధుర్యం

Published on Sat, 03/14/2026 - 13:56

సాధారణంగా పెద్దలు మనకు నవరసాల చాతుర్యం గురించి చెబుతుంటారు. సంధ్య రాణి లింగ చెప్పే 40 రసాల మాధుర్యం గురించీ తప్పక తెలుసు కోవాల్సిందే! తెలుగు రాష్ట్రాలలో తరతరాలుగా వస్తున్న సంప్రదాయ రసాల తయారీ గురించి ‘ఫ్రమ్‌ మై కిచెన్‌ టు యువర్స్‌’ బుక్‌ ద్వారా వివరించారు సంధ్య రాణి లింగ. ఐదు తరాల నుంచి వచ్చిన వారసత్వ వంటలు, వాటి వెనక వెనక దాగి ఉన్న సాంస్కృతిక కథనాలనూ పరిచయం చేస్తున్నారు. హైదరాబాద్‌ వాసి సంధ్య లింగ చెబుతున్న తెలుగింటి వారసత్వ వంటకాల పరిచయం గురించి ఆమె మాటల్లోనే... 

‘‘వంట చేయడం, వడ్డించడమే కాదు కొత్త రుచులను సృష్టించడమూ చాలా ఇష్టం. పుట్టింటి–అత్తింటివారసత్వ వంటకాలను, మూలాలను మర్చిపోకుండా ముందు తరాలకు అందించాలన్నది నా ఆలోచన. ఆ ప్రయత్నమే ఇలా మీ అందరి ముందుకు వచ్చేలా చేసింది.  

రోజూ పండగే! 
రసం అనేది భోజనంలోకి ఉపయోగించే వంటకం మాత్రమే కాదు. అనారోగ్యంలో ఉపశమనం ఇచ్చే ఔషధం కూడా. రసాలు, వాటిలో ఉపయోగించే మసాలాలు కూడా విభిన్నమే. సికింద్రాబాద్‌లోని లింగ పేరుతో ఉండే ఉమ్మడి కుటుంబం మాది. మా మామయ్య వాళ్లు ఎనిమిది మంది అన్నదమ్ములు. అందరూ కుటుంబాలతో కలిసే ఉండేవారు. నేను ఆ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టేనాటికి యాభైమందికి పైగా ఉండేవాళ్లు. అందరికీ కలిపి ఒకే వంటగది. అక్కడ ఉదయం లేచింది మొదలు రోజూ పదిహేను మంది వంటల తయారీలోనే ఉండేవారు. మా అత్తగారు వారి పుట్టింటి నుంచి నేర్చుకున్న వంటకాలతోపాటు, మిగతా కోడళ్లందరమూ కలిసి వంటలలో ఎన్నో వెరైటీలు చేసేవాళ్లం. ప్రతిరోజూ పండగ వాతావరణం లాగే ఉండేది. కొబ్బరి చారు, కట్టుచారు, చుక్కకూర, బలుసాకు, పాలక్, క్యాలీఫ్లవర్, పప్పులతో రసాలు, నిమ్మ, ఉసిరి, ఉల్లి, టొమాటో ... ఇలాంటి ఒక్కోప్రత్యేక కూరగాయలు, ఆకుకూరలతో 40 రకాల రసాలు ఉంటాయి. వీటిని నేరుగా సూప్‌గా సేవించవచ్చు.  

ప్రయోగాల వంటిల్లు... పిల్లల చిన్నతనంలో ఉమ్మడి కుటుంబం నుంచి మేం విడిగా జూబ్లీహిల్స్‌కు వచ్చేశాం. అప్పటివరకు నేర్చుకున్నవే చేసేదాన్ని. అయితే, పిల్లలు కూరగాయలతో చేసిన వంటకాలను తినడానికి ఇష్టపడేవారు కాదు. దీంతో ప్రతి కూరగాయ, ఆకుకూరతో రసాలు చేయడం మొదలుపెట్టాను. వాటిలో మా అత్తగారు, అమ్మ చెప్పిన దినుసులను నోట్‌ చేసుకున్నాను. నెలలో నేను 40 రసాలు చేసేదాన్ని. పిల్లలు బాగా ఇష్టపడేవారు. దూరంగా ఉండే బంధువులు కూడా ఈ రసాల తయారీ గురించి అడిగేవారు. మా కూతురు నిఖిత ‘చాలా హెల్తీగా, కొత్తగా వంటలు చేస్తావు కదా, బుక్‌ తీసుకురావచ్చు కదమ్మా’ అనేది. బంధువులు కూడా చెప్పేవారు. కానీ, పిల్లలకు పెళ్లిళ్లు అయ్యి, వారి జీవితాల్లో స్థిరపడటంలో ఆ ఆలోచన పక్కకు వెళ్లిపోయింది. 

ఇదీ చదవండి: 

కోడలు వచ్చాక, తను నా వంటకాల రుచిని ఆస్వాదించడంతో పాటు వంటల బుక్‌ ఆలోచనను తీసుకువచ్చింది. మొత్తం రాసుకున్నాక, రెండు రోజులు ఫోటోషూట్‌ చేశాం. దీని నిర్వహణ అంతా ప్రియే చూసుకుంది. ఈ తరం వాళ్లకు ఇన్ని రసాలు ఉంటాయని తెలియదు. వారు స్వయంగా తెలుసుకొని, చేసుకునే విధంగా సిద్ధం చేశాం. దీనిని కిందేటేడాది తీసుకువచ్చాం.

పండగకు ప్రత్యేకం... తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాల వారీగా ఒక్కో పండగకు ఒక్కో ప్రత్యేకరసాలు, వంటకాల తయారీలు ఉంటాయి. ఇక ఊరగాయలు, రోటి పచ్చళ్లు, పులావ్, బిర్యానీలలో విభిన్న రుచులు ఉన్నాయి. అలాగే, తెలుగు ప్రాతాల్లోని మూలాల్లోకి వెళితే చాలా వైవిధ్యమైన వంటకాలు పరిచయం అవుతాయి. వాటిని అందించడానికి ప్రిపరేషన్‌ మొదలుపెట్టాను’’ అని వివరించారు ఈ పాకశాస్త్ర నిపుణురాలు.


వంటే ఔషధంగా...
‘మా అత్తమ్మ ఆలోచనలు చాలా మోడర్న్‌గా ఉంటాయి. తన పాకశాస్త్ర నైపుణ్యాన్ని, వారసత్వ వంటకాలు ముందు తరాలకు పరిచయం చేస్తే బాగుంటుందనుకున్నాం. సోషల్‌ మీడియాలో చూస్తే చాలా వంటకాలు కనిపిస్తాయి. కానీ, వాటిలో వారసత్వ వంటకాల గురించి, వంట మెడిసిన్‌లా ఎలా ఉపయోగపడుతుందో అంత వివరంగా చెప్పలేక΄ోతున్నారు. అందుకే, మేం కలిసి ఈ ప్రయత్నం చేశాం. – ప్రియ, కోడలు 
 

– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

 

 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)