Breaking News

కలియుగ శ్రవణ కుమారుడు

Published on Fri, 06/13/2025 - 03:49

రామాయణ కాలంలో శ్రవణకుమారుడు అంధులైన తన తల్లిదండ్రులను కావడిలో మోసుకుంటూ తీసుకువెళ్లేవాడని మనం చిన్నప్పుడు చదువుకున్నాం. దాని సంగతి ఎలా ఉన్నా బిహార్‌కు చెందిన ఈ అభినవ శ్రవణ కుమారుడు మాత్రం తొంభై ఏళ్ల తన తల్లిని భుజాలమీద కూచోబెట్టుకుని గయలో స్నానానికి తీసుకువెళ్లాడు. ఈ వార్త వైరల్‌ అయింది. 

బిహార్‌లోని కైమూర్‌ జిల్లాకు చెందిన రాణా ప్రతాప్‌ సింగ్‌ అనే అతనికి తన తల్లి అంటే పంచప్రాణాలు. ఆమె అడిగితే ఏమైనా చేస్తాడు. ఆ ముసలి తల్లి ఓ రోజు తన కుమారుడిని తనకు గంగాస్నానం చేయాలని ఉంది చెప్పింది. ఇంతకాలానికి తనకు తల్లి కోరిక నెరవేర్చే అవకాశం దొరికిందని అతడు ఎగిరి గంతేశాడు. అయితే అమ్మను అక్కడికి తీసుకువెళ్లాలంటే ఏదైనా వాహనం మాట్లాడుకోవాలి. అందుకు చాలా ఖర్చవుతంంది. అంత భారం భరించలేడు తను. 

అందుకోసం అతను తన తల్లిని పసిపిల్లలా ఎత్తి తన మెడలమీద కూచోబెట్టుకున్నాడు. నెమ్మదిగా నడుచుకుంటూ ఆమెను వారణాసికి తీసుకువెళ్లాడు. అక్కడ పవిత్రమైన గంగాస్నానం చేయించాడు. ‘‘అమ్మ అంటే నాకెంతో ఇష్టం. చిన్నప్పుడు బిడ్డలకు అమ్మ చేసే సేవలతో పోల్చుకుంటే ఇదెంత? దుస్తులు పాడుచేసుకున్న ప్రతిసారీ బిడ్డకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా శుభ్రం చేసి పొడిబట్టలు తొడుగుతుంది. గోరుముద్దలు తినిపిస్తుంది. ఉప్పెక్కించుకుని తిప్పుతుంది.

 పిల్లలతో గుర్రం ఆట ఆడుతుంది. ఆ బిడ్డలు మాత్రం పెద్దయ్యాక అమ్మనాన్నలను అంతగా పట్టించుకోరు. అయితే తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకునేవారికి జీవితంలో అపజయం అంటూ ఉండదని నా నమ్మకం. నేను నా తల్లిని నా బిడ్డలా చూసుకుంటాను. ఆమె తనకు గంగాస్నానం చేయాలని ఉందని చెప్పగానే వాహనం కుదుపులు లేకుండా నేనే తనను ఎత్తుకుని తీసుకువెళ్లాలనుకున్నాను. అందుకే అమ్మను ఇలా తీసుకువచ్చి స్నానం చేయించాను. ఇప్పుడు నాకెంతో సంతృప్తిగా ఉంది’’ అంటున్నాడు.

ఇదీ చదవండి: Air India Plane Crash బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్‌పై ఆరోపణలు: ఇంత విషాదం ఇపుడే!

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు