Breaking News

Solar Plexus: మణి పుర చక్రం అంటే ఏంటి?

Published on Thu, 06/12/2025 - 12:47

గతవారం మొదటి రెండుపొరల గురించి చెప్పుకున్నాం కదా.. ఈ వారం మూడవ చక్రం నాభి లేదా మణిపుర చక్రం గురించి...  మీరు మంచి ఆహారాన్ని తిన్నపుడు మీకు కలిగే ఆనందం వర్ణనాతీతం. ఆకలితో ఉన్నట్లైతే మీరు ధ్యానంలో కూడా సరిగా కూర్చోలేరు, ఆనందించలేరు. భగవంతుడు మీ ఎదురుగా ఉన్నా కూడా ‘‘ఓ దేవుడా! మొదటగా నా కడుపు నింపు. నేను నీతో తర్వాత మాట్లాడతాను’’ అని అంటారు. ఆకలితో ఉన్నప్పుడు మనం ఆహారాన్ని తింటున్నప్పుడు కలిగే ఆనందాన్ని వర్ణించలేం. నాభి ఈ ఆనందం కూడా చాలా తాత్కాలికం. అలా సంపూర్ణంగా ఆనందించగలిగితే మీరు మరల మరల కావాలని కోరుకోరు. దానిని అధిగమించడానికి సంతృప్తి ఒక్కటే మార్గం. రెండు ముద్దలు తిన్నా సరే మీరు సంతృప్తి చెందాలి. సంతృప్తితో ఉండటమే మీరు నాభి చక్రాన్ని సరిచేసుకునే మార్గం. మీ వస్తుసంబంధమైన కోరికలకు అంతులేదు. ఎన్ని వస్తువులు ఉన్నా కానీ ఇంకా కావాలనుకుంటారు. కానీ దేనినీ ఆనందించలేరు.. దాని వల్ల నాభి చక్రం అలజడికి లోనవుతుంది. దీనిని అరికట్టే మార్గం నాభి చక్రం సంతృప్తి. ప్రతి విషయంలోనూ మీరు సంతృప్తిని కలిగి ఉండాలి. 

కాబట్టి ఆనందించడానికి సంతృప్తి ఒకటే మార్గం. ఇది నిత్య ధ్యానసాధన ద్వారా  మనలో శ్రీ లక్ష్మీనారాయణ  శక్తిని జాగృతి చేసుకో గలగడం ద్వారా సాధ్యపడుతుంది. సంతృప్తి అనేది ఆత్మ సాక్షాత్కారం లేకుండా సాధ్యం కాదు. కాబట్టి ఆత్మసాక్షాత్కారం ΄÷ందకుండా మీరు సంతృప్తిని కలిగి ఉండాలని చెపితే అది ఏదో ఒక ఉపదేశంలాగానే ఉంటుంది. కానీ ఆత్మ సాక్షాత్కారం ΄÷ందిన తరువాత మీ ఆత్మని ఏది సంతృప్తి పరుస్తుందో మీకు తెలుస్తుంది. కాబట్టి మీ  ప్రాముఖ్యతలు మారతాయి. 

ఇదీ చదవండి: ప్రేమించే వ్యక్తి.. ఆలోచించే వ్యక్తికన్న వెయ్యిరెట్లు ఉత్తమం! ఎలా?
 

-డా. పి. రాకేష్‌
(మన అంతర్గత సూక్ష్మ శరీర నాడీ వ్యవస్థ గురించి శ్రీ మాతాజీ నిర్మలాదేవి 
ప్రవచనం ఆధారంగా) 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)