Breaking News

వెయిట్‌లాస్‌ మందులతో స్లిమ్‌గా ఐశ్వర్య మోహన్ రాజ్..! నిపుణులు ఏమంటున్నారంటే..

Published on Fri, 02/13/2026 - 17:47

కంటెంట్‌ క్రియేటర్‌, కమెడియన్‌, బాలీవుడ్‌ నటి ఐశ్వర్య మోహన్‌ రాజ్‌ స్లిమ్‌గా మారిన సంగతి తెలిసిందే. అంతేగాదు తన వెయిట్‌లాస్‌ సీక్రెట్‌ని కూడా చాలా నిజాయితీగా బయటపెట్టారామె. తాను వెయిట్‌లాస్‌ డ్రగ్‌ మౌంజారోని వాడనని దానివల్ల 22 కిలోలు వరకు బరువు తగ్గానని నర్మగర్భంగా చెప్పారామె. అయితే అలా చెప్పినందుకు పలువురు విమర్శించారు కూడా. కానీ బాలీవుడ్‌ నటి సోహ అలీఖాన్‌ వంటి పలువురు ప్రముఖులు ఆమె నిజాయితీని ప్రశంసించారు. మరి ఇంతకీ ఇలాంటి బరువు తగ్గించే మందులు ఆరోగ్యానికి సురక్షితమేనా..? దీనిపై వైద్యులు ఏమంటున్నారంటే..

అయితే కమెడియన్‌ ఐశ్వర్య మోహన్‌ రాజ్‌ బరువు తగ్గేందుకు మౌంజారోలాంటివి హెల్ప్‌ అవుతాయి గానీ వైద్యుల పర్యవేక్షణ అవసరమని తెలిపినప్పటికీ..చాలామంది ఆమెను ట్రోల్‌ చేస్తూనే ఉన్నారు. అలాంటి మందులు ఆరోగ్యంపై దుష్ప్రభావాలు చూపిస్తాయనేది వారందరి వాదన. ఈ నేపథ్యంలో సోహా అలీ ఖాన్‌ తన తాజా పాడ్‌కాస్ట్‌లో ఎండోక్రినాలజీ అండ్‌ డయాబెటాలజీ గ్రూప్ చైర్మన్ డాక్టర్ అంబ్రిష్ మిథల్‌, క్లినికల్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ జూహి అగర్వాల్‌తో చర్చించి మరి ఎలాంటి వాళ్లు బరువు తగ్గించే మందులు తీసుకోవచ్చు?ఎవరికి మంచిది కాదు తదితరాలను అడిగి అందరి అనుమానాలను పటాపంచలు చేశారామె. 

వాళ్లంతా ఏచెబుతున్నారంటే..
ఒక వ్యక్తికి ఫ్యాటీ లివర్, డయాబెటిస్ లేదా ప్రీ-డయాబెటిక్ , ఊబకాయం వంటి ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యులు బరువు తగ్గించే మందులను సిఫారసు చేస్తారని చెప్పారు. వాటి సాయంతో బరువు తగ్గితే సదరు రోగి పరిస్థితి మెరుగుపడుతుంది..తదనుగుణంగా అప్పటి నుంచి జీవనశైలిలో మార్పులు తీసుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలని చెప్పారు. 

 

బాడీమాస్‌ ఇండెక్స్‌(బీఎంఐ) 27 లేదా 30 ఉంటే వాళ్లు వైద్యుల సూచన మేరకు నిరభ్యంతరంగా ఈ బరువు తగ్గించే మందులు వాడొచ్చని అన్నారు. ఇంతకుమునుపు వెయిట్‌లాస్‌ డ్రగ్స్‌ అత్యంత ఖరీదుగా ఉండేవి. ఇప్పుడు నెలకు తక్కువ మోతాదు అయితే రూ. 12000లని, అదే ఎక్కువ మోతాదు అయితే నెలకు రూ. 22,000 దాక ఖర్చు అవుతుందని వెల్లడించారు. 

ఎవరికి మంచిది కాదంటే..

  • థైరాయిడ్‌ కేన్సర్‌ చరితర ఉన్న వ్యక్తులు

  • ప్యాంక్రియాటైటిస్ చరిత్ర

  • జీర్ణశయాంతర సమస్యలు

  • మధుమేహం కారణంగా కంటివ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు 

తదితరులకు ఈ మందులు సరిపడవని చెప్పారు. ఏమందులైనా..నిపుణలు పర్యవేక్షణలో సలహాలు సూచనలతో ఉపయోగిస్తే ఎలాంటి సమస్య ఉండదని అన్నారు. ప్రస్తుతం కాలంలో అధిక బరువు సమస్యతోనే అనారోగ్యం బారిన పడుతున్న వారెందరికో ఈ మందులు వరంగా మారాయని అంటున్నారు వైద్యనిపుణులు.

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. 

(చదవండి: నటి ఆలియా భట్‌ చెప్పే జీవిత పాఠాలు..!)

 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)