Breaking News

కాటు వేసిందని పామునే కరిచి చంపేయడంతో..!

Published on Fri, 07/05/2024 - 18:12

పాము కాటుకి గురైతే సాధారణంగా వెంటనే ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోవడం చేస్తాం. మరికొందరూ సదరు పాముని చంపి, దాన్ని పట్టుకుని వెళ్లి మరీ చికిత్స పొందిన ఘటనలు చూసి చూశాం. కానీ ఏకంగా ఆ పాముని కరిచి చంపేయడం గురించి విన్నారా. ఈ దిగ్భ్రాంతికర ఘటన బిహార్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకెళ్తే..35 ఏళ్ల సంతోష్‌ లోహార్‌ అనే వ్యక్తి ఒకరోజు రైల్వే లైన్లు వేసే పనిని ముగించుకుని తన బేస్‌ క్యాంపులో నిద్రిస్తుండగా ఓ పాము అతనిపై దాడి చేసింది. దీంతో అతడు వెంటనే ఆ పాముని చేతుల్లోకి తీసుకుని రెండు సార్లు కసితీరా కరిచేశాడు. ఈ అసాధారణ చర్యకు పాము అక్కడికక్కడే చనిపోయింది. ఈ దుశ్చర్య తర్వాత లోహార్‌ ఆస్పత్రిపాలయ్యాడు. 

ఓ రెండు రోజులు ఆస్పత్రిలో చికిత్స తీసుకుని డిశ్చార్జ్‌ అయ్యి వెళ్లిపోయాడు. అయితే సదరు వ్యక్తి కాటు వేసిన పాముని తిరిగి కొరికేస్తే విషం తగ్గిపోతుందనే మూఢనమ్మకంతో చేశాడట. ఈ విషయం తెలుసుకుని అక్కడ ఆస్పత్రి వైద్యులు సైతం ఆశ్చర్యపోయారు.  వాస్తవానికి ఇలా పాము కాటుకి గురయ్యితే ఏం చేయాలో తెలుసుకుందాం..

పాము కాటుకి గురైనప్పుడు త్వరగా చర్య తీసుకోవాలని, వైద్య సహాయం కోరాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. ఈ తక్షణ వైద్య సంరక్షణ అనేది పలు సమస్యలను నివారించడమే గాక దీర్ఘకాలికి వైకల్యం లేదా మరణ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 

తప్పక చేయాల్సినవి..
పాము కరిచినట్లయితే ఆ ప్రాంతం నుంచి దూరంగా వెళ్లడం వంటివి చేయాలి. కాటే వేసిన ప్రదేశంలో బిగుతుగా ఉన్న దుస్తులను తీసివేయాలి. ప్రభావిత అవయవాన్ని కదలకుండా ఉంచి, బాధితుడిని తక్షణమే సురక్షితంగా ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాలని నిపుణులు చెబుతున్నారు. అంతేగాదు వైద్య సహాయం కోసం ఎదరుచూస్తున్నప్పుడూ ప్రభావిత అవయవాన్ని గుండె స్థాయికి దిగువున ఉంచి ప్రాథమి చికిత్స అందించాలి. అలాగే బాధితుడికి తినేందుకు, తాగడానికి ఏమి ఇవ్వకూడదని చెబుతున్నారు నిపుణులు. 

(చదవండి: ఆ రెస్టారెంట్‌లో దోస, ఇడ్లీ రేట్లు తెలిస్తే కంగుతింటారు: హర్ష గోయెంకా ట్వీట్‌)
 

#

Tags : 1

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)