Breaking News

ఆకాశ సిందూరం

Published on Tue, 06/10/2025 - 00:43

అనామిక శర్మ ఆకాశ సాహసాలు కొత్తేమీ కాదు. సాహసానికి సామాజిక సందేశం జోడించడం ఆమె శైలి. ఈసారి ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పతాకాన్ని  ఆకాశమంత ఎత్తున ప్రదర్శించింది. 

భారత సాయుధ దళాలకు మద్దతుగా థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌ గగనతలంలో ఆపరేషన్‌ సిందూర్‌ పతాకాన్ని నింగిన ఎగరేసింది అనామిక. రెండు చేతులతో ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పతాకాన్ని పట్టుకొని  సింగిల్‌–ఇంజిన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ పీఎసీ 750ఎక్స్‌ఎల్‌ నుంచి దూకి ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పతాకాన్ని ప్రదర్శించింది. దాదాపు 14,000 అడుగుల ఎత్తు నుంచి డ్రాప్‌ జోన్‌లోకి దూకింది.

‘ఈ జంప్‌ చేసినందుకు సంతోషంగా ఉంది. ముప్పులు, ప్రమాదాల బారి నుంచి దేశాన్ని రక్షిస్తున్న భారత సాయుధ దళాలకు శాల్యూట్‌ చేస్తున్నాను. మన సాయుధ దళాల సత్తా ఏమిటో మరోసారి ఆపరేషన్‌ సిందూర్‌ ద్వారా నిరూపణ అయింది’ అంటుంది అనామిక.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన అనామిక శర్మ తండ్రి అజయ్‌శర్మ ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ (ఐఎఫ్‌) కమాండోగా పనిచేశారు. స్కైడైవింగ్‌లో అనామికకు తొలి గురువు. ‘యాక్టివ్‌ డైవర్స్‌’గా గుర్తింపు పొందిన ఈ తండ్రీకూతుళ్లు ఎన్నో గగనతల సాహసాలు చేశారు. 

యునైటెడ్‌ పారాచూట్‌ అసోసియేషన్‌ (యుపీఏ)లో పిన్న వయస్కురాలైన అనామిక శర్మ ‘డి’ కేటగిరి డైవింగ్‌ లైసెన్స్‌ను పొందింది. మన దేశంలోని ఏకైక మహిళా స్కైడైవింగ్‌ కోచ్‌ అనామిక. ప్రయాగ్‌రాజ్‌లో ప్రాథమిక విద్యను పూర్తి చేసిన అనామిక దేశంలోని వివిధ ప్రాంతాలలోని పాఠశాలల్లో చదువుకుంది. బెంగళూరులో బీ.టెక్‌. చేసింది. పదేళ్ల వయసులోనే మన దేశంలోని యంగెస్ట్‌ ఫిమేల్‌ స్కైడైవర్‌గా సంచలనం సృష్టించింది. 

300ల స్కైడైవ్స్‌ చేసింది. గత సంవత్సరం 13,000 అడుగుల ఎత్తులో రామమందిరం పతాకాన్ని, ఈ సంవత్సరం మహా కుంభమేళ పతాకాన్ని బ్యాంకాక్‌లో 13,000 అడుగుల ఎత్తులో ప్రదర్శించింది. అనామిక శర్మ తాజా వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.
 

Videos

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)