Breaking News

అక్కాచెల్లెళ్లు తెలుపు రంగు దుస్తులే ధరించడానికి రీజన్‌ ఇదే..!

Published on Mon, 04/13/2026 - 13:27

దిగ్గజ నేపథ్య గాయని ఏప్రిల్ 12, ఆదివారం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఏ తరానికి చెందినవారైన ఆశా మధురమైన గాత్రానికి ఫిదా అవ్వాల్సిందే. ట్రెండ్‌కి తగ్గట్టుగా ఆలపిస్తూ..అభిమానుల మనసును దోచుకునే దిగ్గజ గాయని. ఆ సంగీత నైపుణ్యం ఆమెకు ఎన్నో అవార్డులు, రివార్డులు తెచ్చిపెట్టాయి కూడా. అక్క లతా మంగేష్కర్‌ అడుగుజాడల్లోనే నడుస్తూ..సంగీతంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఎటువంటి పాటలైన ఆశా స్వరంతో జత కలిస్తే ఓ అద్భుతం అనేలా పేరుతెచ్చుకున్నారామె. 

అలాంటి పాటలరాణి మనముందు లేరు అన్నమాటే బాధగా అనిపిస్తున్నా..ఆమె జ్ఞాపకాలు, స్మృతులు మనకళ్లముందు కదలాడుతూనే ఉంటాయి. వాటిలో ఒకటి అక్కాచెల్లెళ్లు ఇద్దరు ఒకే విధమైన రంగు చీరలతో కనిపించిన అద్భుతమైన దృశ్యాలు. ఇద్దరు ఎక్కువగా తెలుపు రంగునే ఎంచుకునేవారు. దీంతో అభిమానులు ఇద్దరూ ఇలా ఎందుకు ధరిస్తారనే దానిపై చాలా కుతుహలంగా ఉండారు. ఒక షాడ్‌కాస్ట్‌లో దివంగత గాయని ఆశా భోంస్లేనే ఆ విషయాన్ని పంచుకున్నారు. 

ఎందుకు ఆ రంగే ఇష్టం అంటే..
గతేడాది ఆర్జే అన్మోల్‌, అతని భార్య నటి అమృతరావు హోస్ట్‌ చేసిన  'కపుల్ ఆఫ్ థింగ్స్' అనే పాడ్‌కాస్ట్‌తో భోస్లే అరంగేట్రం చేశారు. ఆ సంభాషణలో తన సోదరి వృత్తిపరమైన ప్రత్యర్థి అయినప్పటికీ ఆమెతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారామె. అంతేగాదు ఆ ఇంటర్వ్యూలో ఆశా తన సోదరి ఇద్దరూ తెలుపు రంగుకే తొలి ప్రాధాన్యత ఎందుకు ఇచ్చేవారో చెప్పారు. 

 

"నేను దీదీ(లతా మంగేష్కర్) ఎల్లప్పుడూ తెల్ల చీరలే ధరించేవాళ్లం. తెలుపు రంగు మా చర్మ ఛాయకు బాగా నప్పుతుందని మేము భావించేవాళ్ళం.  ఇతర రంగులు ధరిస్తే, మేము మరింత నల్లగా కనిపించేవాళ్ళం. ఆ తర్వాత, నేను గులాబీ రంగు చీరలు ధరించడం మొదలుపెట్టాను, దీదీ నన్ను వింతగా చూసేవారు, కానీ నేను నెమ్మదిగా గులాబీ రంగుతో పాటు ఇతర రంగులను కూడా జోడించడం ప్రారంభించాను." అని నవ్వతూ చెప్పారామె. 

కాగా, ఆశా భోంస్లే తన దుస్తుల విషయంలో రంగులను ఇష్టపడటం మొదలుపెట్టారు. కానీ లతా మంగేష్కర్‌ అడపాదడపా కనిపించే ప్రకాశవంతమైన ఎరుపు రంగు బ్రోకేడ్ పల్లు లేదా షెవ్రాన్ ప్రింటెడ్ బహుళ-రంగుల అంచు మినహా, తెలుపు, లేత తెలుపు వంటి ఐవరీ దుస్తులకే పరిమితమయ్యారు. 

భోంస్లే కాలక్రమేణా తన జీవిత ఉత్సాహాన్ని వ్యక్తపరిచేలా రంగుల దుస్తులతో తన ఇమేజ్‌ను పెంచుకున్నారు. ఆమె ఎక్కువగా చందేరి, బనారసి, చేనేత వస్త్రాలు, కాంజీవరం చీరలు, షిఫాన్ ప్రింట్లు వంటి రకరకాల రంగురంగుల చీరలతో తళుక్కుమనేవారు. గాత్రంలోనే కాదు..వేషధారణలోనూ ఆశా ఎవర్‌గ్రీన్‌ అన్నట్లుగా తన మార్కును చూపించేవారామె.

 

(చదవండి: Asha Bhosle: నిశబ్దంగా ఆ మధుర స్వరం.. కానీ ఆమె జ్ఞాపకాలు చిరస్మణీయం!)

 

Videos

ఆ రోజు ఏంజరిగిందంటే.. విజయ రెడ్డి కేసులో ఊహించని ట్విస్ట్..

ఛీ.. ఛీ.. సిగ్గుచేటు.. మరొక మహిళతో BR నాయుడు స్వామి వారిని దర్శించుకోవడం ఏంటీ

సింగర్ ఆశా భోస్లే అంతిమ యాత్ర

అత్తసొమ్ము అల్లుడుదానమా.. ఎవరి సొమ్ము ఎవడికి దానం చేస్తున్నావ్

సముద్ర దిగ్భందనం.. అమెరికా ఏడ్చే రోజు దగ్గరలోనే.. ఇరాన్ వార్నింగ్

కత్తులతో TDP గూండాలు.. YSRCP కార్యకర్తపై హత్యాయత్నం

మంగ్లీ బండారం బయటపెడతా.. పంజాగుట్ట PSలో హైడ్రామా.. బాధితులతో సుబ్బారావు

EPFO 3.0 తో ఎన్నో మార్పులు.. ఒకేసారి అకౌంట్లోకి రూ. 5 లక్షల వరకు డబ్బులు..!

లెక్క సెట్ చేస్తాం.. 2029లో చూపిస్తా..

అల్లు అర్జున్ రాకాపై షారుఖ్ షాకింగ్ కామెంట్స్..

Photos

+5

చీరలో శెట్టి బ్యూటీ.. అందమే అందం (ఫొటోలు)

+5

భానుడి సెగలకు విశాఖ రుషికొండ తీరంలో పర్యాటకుల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో వైభవ్‌ సూర్యవంశీ ఆట.. SRH vs RR ప్రాక్టీస్‌ (ఫొటోలు)

+5

కూకట్‌పల్లిలో హీరో విక్టరీ వెంకటేష్ సందడి (ఫొటోలు)

+5

‘డెకాయిట్‌’ మూవీ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

కరీనకపూర్‌ రాజసం ఉట్టిపడేలా కుర్తాసెట్‌ స్టైలిష్‌ లుక్‌..!

+5

ఆశా భోంస్లే కన్నుమూత.. జీవితంలో ఇవన్నీ పదిలం (పోటోలు)

+5

హైదరాబాద్ లో మండుతున్న ఎండలు (ఫొటోలు)

+5

తమిళ హీరోయిన్‌ అతుల్య రవి డీసెంట్‌ లుక్స్‌ (ఫోటోలు)

+5

‘పాపం ప్రతాప్‌’ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ (ఫొటోలు)