Breaking News

నయా ట్రెండ్‌ : పెళ్లికి ముందే బేబీ బంప్‌ ఫొటోషూట్ రచ్చ!

Published on Mon, 12/23/2024 - 14:44

ప్రస్తుతం  మెటర్నిటీ ఫోటోషూట్‌ ట్రెండింగ్‌లో ఉంది. మాతృత్వ అనుభూతులను అందంగా, పదిలంగా దాచుకోవాలనే లక్ష్యంతో ఇది పాపులర్‌ అయింది.  కానీ చైనాలో ప్రెగ్నెన్సీ ఫోటోలకు సంబంధించి ఒక నయా ట్రెండ్‌ విమర్శలకు తావిస్తోంది.  చైనాలో ఒంటరి మహిళలు ఇప్పుడు నకిలీ బేబీ బంప్‌, మెటర్నీటి ఫోటోషూట్‌లకు సోషల్‌మీడియాను ముంచుత్తెతున్నారు. దీంతో  చర్చకు దారి తీసింది.

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (SCMP) రిపోర్ట్‌ ప్రకారం  పెళ్లి కాని యువతుల బేబీ బంప్‌తో ఫొటోషూట్‌ చైనాలో కొత్త ట్రెండ్‌గా మారింది.  హునాన్ ప్రావిన్స్‌కు చెందిన  జనరేషన్ Z ఇన్‌ఫ్లుయెన్సర్ “ మెయిజీజీ గెగే” అక్టోబర్ 13న తన మెటర్నిటీ ఫోటోషూట్‌ను షేర్  చేసింది. అదీ ఆమె సింగిల్‌గా(పెళ్లి కాకుండానే), స్లిమ్‌గా ఉన్నప్పుడే బేబీ బంప్‌తో ఫొటోషూట్‌ చేసింది. అంతేకాదు గర్భధారణ సమయంలో పొందే ఆనందాన్ని అనుభవించాను అంటూ ఆమె రాసుకొచ్చింది. దీంతో ఇది ట్రెండింగ్‌లో నిలిచింది. 5.7 మిలియన్లకు పైగా ఫాలోవర్లను  ఆమె విపరీతంగా ఆకర్షించింది.  ఈ ఫేక్‌ బేబీ బంప్‌ ఫోటోషూట్‌  ట్రెండ్‌ వేగంగా ఊపందుకుంటోంది

ఈ ధోరణి చైనాలో జననాలు, వివాహాల రేటు తక్కువగా ఉన్నప్పటికీ మెటర్నిటీ ఫోటోషూట్‌లు విపరీతంగా షేర్‌ అవుతున్నాయి. 26 ఏళ్ల గ్రాడ్యుయేట్  తాను సింగిల్‌  అయినప్పటికీ  23 ఏళ్ల వయస్సులో తన ప్రసూతి ఫోటోలను తీసినట్లు వెల్లడించింది. మరో యువతి తన పెళ్లి ఫోటోలను 22 ఏళ్ల వయసులో తీశానని, “నాకు 30 ఏళ్లలోపు ముడతలు వస్తే” ఎలా అంటూ వ్యాఖ్యానించింది. ఇలా  20 ఏళ్ళ వయస్సున్న అమ్మాయిలుకూడా ఇలా ఫేక్‌ బేబీబంప్‌ ఫోటో షూట్‌ చేయించుకుంటుండటం గమనార్హం.

గర్భధారణ సమయంలో శరీర మార్పులు ఒళ్లు చేస్తే ఫొటోషూట్‌ నైస్‌గా అందంగా కుదరదని భావిస్తున్న యువతులు నాజూకైన శరీరం ఉండగానే ఫేక్‌ బెల్లీ ఫోటోలను తీయించుకుంటున్నారు. అయితే ఈ ట్రెండ్‌పై పలువురు నెటిజన్లు విమర్శలు  గుప్పిస్తున్నారు. 

అటు పాత తరం కూడా   ఇదేం చోద్యం అంటూ మెటికలు విరుస్తూ ఆశ్చర్యపోతున్నారట.  తాము కూడా 70 ఏళ్ల పుట్టినరోజు, అంత్యక్రియల ఫొటోషూట్‌లు నిర్వహించుకొంటామంటూ మండి పడుతున్నారు.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)