Breaking News

మాయదారి గుండెపోటు : చిన్నారి ‘గుండెల్ని’ పిండేస్తున్న వీడియో

Published on Sat, 01/11/2025 - 12:54

చిన్నారుల నుంచి పెద్దల దాకా గుండెపోటుతో సంభవిస్తున్న హఠాన్మరణాలు ఆందోళన రేపుతున్నాయి. ముఖ్యంగా ఇటీవలి కారణంలో   చిన్నారుల గుండె సంబంధిత సమస్యలతో మరణిస్తుండటం కలచివేస్తోంది. తాజాగా మరో విషాద ఘటన చోటు చేసుకుంది. ఈసారి  8 ఏళ్ల బాలిక (School Girl) ప్రాణాలు కోల్పోవడం  దిగ్భ్రాంతికి గురి చేసింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని (Ahmedabad) థల్తేజ్ ప్రాంతంలో  శుక్రవారం ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో నమోదయ్యాయి.

అహ్మదాబాద్‌లోని గార్గి రాణపరా(Gargi Ranapara) జేబార్ స్కూల్ ఫర్ చిల్డ్రన్‌లో  గార్గి మూడో తరగతి చదువుతోంది.  పాఠశాలకు వచ్చిన కొద్దిసేపటికే ఛాతీ నొప్పికి గురైంది. క్లాస్ రూమ్ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా నొప్పి రావడంతో కాసేపు అక్కడే నిలబడింది. నొప్పితో బాధపడుతూనే  అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంది.  అంతే కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. ఇది గమనించిన టీచర్లు ఆమెకు సపర్యలు చేశారు.  బాలికను కాపాడేందుకు టీచర్లు సీపీఆర్ చేశారు. అయినా బాలికలో ఎలాంటి చలనం లేదు.  వెంటనే దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించే సమయానికే బాలిక పరిస్థితి విషమించింది.  వైద్యులు ఆమెను బతికించేందుకు తీవ్రంగా శ్రమించారు. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. గార్గి గుండెపోటుతో మరణించిందని వైద్యులు నిర్ధారించారు.

 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పాఠశాల ప్రిన్సిపల్ శర్మిష్ఠ సిన్హా వెల్లడించారు.గార్గి పాఠశాల ఆవరణలో కొంచెం అనారోగ్యంగా కనిపించిందని, కొద్దిసేపు కూర్చున్న వెంటనే కుప్పకూలిపోయిందని చెప్పారు. వెంటనే అప్రమత్తమైన టీచర్లు, విద్యార్థులు వెంటనే ఆమెకు సహాయం చేయడానికి ప్రయత్నించినా, ఆమెనుకాపాడలేకపోయామని విచారం వ్యక్తం చేశారు.

మరోవైపు దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలిక గుండెపోటుకు గల కారణాలలపై అన్ని కోణల్లో దర్యాప్తు చేస్తున్నామని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నీరజ్ బడ్గుజర్ ప్రకటించారు.

 > కాగా ముంబైకి చెందిన గార్గి, తన బంధువుల ఇంటిలో ఉంటూ అహ్మదాబాద్‌లో చదువుకుంటోంది. గతంలో పెద్దగా ఆరోగ్య సమస్యలు లేవని సమాచారం. ఇటీవల బెంగళూరులో కూడా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది.  ఎనిమిదేళ్ల బాలిక తేజస్విని  పాఠశాల కారిడార్‌లో గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే.

గుండెపోటు లక్షణాలు

  • ఛాతీ నొప్పి,

  • ఊపిరి ఆడకపోవడం

  • వికారం, చెమటలు పట్టడం

  •  చేతులు, వీపు లేదా దవడలో నొప్పి వంటివి సాధారణ లక్షణాలు

నోట్‌:  గుండెలోని రక్త నాళాల్లో రక్త ప్రసరణకు అడ్డంకులు ఏర్పడటం, రక్తనాళాలు పూడుకుపోవడం, రక్తాన్ని గుండె సరిగా సరఫరా చేయలేకపోవడం తదితర కారణాల వల్ల గుండె పోటు వచ్చే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. అయితే, గుండె పోటు వెనుక చాలా కారణాలు ఉండొచ్చు.  అందుకే ఏ చిన్న అనారోగ్యం వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. మరీ ముఖ్యంగా జిమ్‌ చేస్తున్నాం  కదా, ఆరోగ్యంగానే ఉన్నాం కదా అని అస్సలు అనుకోకూడదు.  ఇటీవలి  కేసులను దృష్టిలో ఉంచుకుని చిన్నపిల్లల్లో అయినా అనుమానిత లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించి కారణాలను రూల్‌ అవుట్‌ చేసుకోవడం చాలా అవసరం. 

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)