ఏ క్షణమైనా గుండెపోటు ఖాయం..! కాలమిస్ట్ శోభా డే కుమార్తె వెయిట్‌ లాస్‌ స్టోరీ

Published on Thu, 04/17/2025 - 17:49

అందరిని వేధిస్తున్న సమస్య ఊబకాయం. ఈ అధిక బరువుకి చెక్‌పెట్టడం ఓ సవాలు. ఎంతోమంది సెలబ్రెటీలు దీన్ని ఛాలెంజింగ్‌ తీసుకుని బరువు తగ్గి చూపించారు. అయితే అది అందరికీ సాధ్యం కాలేదు. కేవలం తగ్గాలన్న లక్ష్యంతో, కృతనిశ్చయంతో ఉన్నవారికే సాధ్యమైంది. అమ్మబాబోయ్‌ అనుకుని చేతులెత్తేయకుండా పట్టుపట్టి..ఆరోగ్యం కావాలనుకునే వారికే సుసాధ్యమైంది. ఇప్పుడు తాజాగా ఆ కోవలో ప్రముఖ నవలా రచయిత కాలమిస్ట్ శోభా డే కుమార్తె ఆనందితా చేరారు. ఆమె కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్న ఆలోచనే బరువు తగ్గేందుకు దారితీసిందని చెబుతున్నారు. ఇప్పుడామె ఎంత స్లిమ్‌గా మారారంటే..చూసేవాళ్లకే అసూయ కలిగేంతగా తగ్గిపోయారు. ఎందుకంటే జస్ట్‌ ఏడు నెలల్లోనే 40 కిలోలు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచారామె. మరీ ఆమెకు అదెలా సాధ్యమైందో తెలుసుకుందామా..!.

గత ఆగస్టు 23, 2024 వరకు అధిక బరువుతో ఉండేది. అప్పటి నుంచి తన వెల్‌నెస్‌ జర్నీ ప్రారంభించానని తన ఇన్‌స్టా పోస్ట్‌లో రాసుకొచ్చారు ఫ్రీలాన్స్ రచయిత ఆనందిత. ఆ పోస్ట్‌లో '40 కిలోల తగ్గుదల' అనే శీర్షికతో తన వెయిట్‌లాస్‌ జర్నీ గురించి రాసుకొచ్చారామె. 

అసలు నమ్మలేకపోతున్నా.. ఇంతలా బరువు తగ్గానా..? అంటూ భావోద్వేగానికి గురయ్యారు. అలాగే తాను ఏవిధంగా బరువు తగ్గిందో వివరించింది. ముందుగా తాను ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలు గురించి తెలిపారామె. తన అధిక బరువు కారణంతో కనీసం కొద్ది దూరం నడిచేటప్పటికే ఆయాసం వచ్చేసిందని, కనీసం మెట్లు కూడా ఎక్కలేకపోయేదాన్ని అంటూ మాట్లాడారామె. 

శరరీంలో చెడు కొలస్ట్రాల్‌ లెవెల్స్‌ ఏ స్థాయిలో పెరిగాయంటే ఒక ఫ్లోర్‌ మెట్లు ఎక్కేటప్పటికే గుండెపోటు వచ్చేస్తుందేమోన్న భయం కలిగిందట. అలాగే చర్మం రంగు మారిపోయి తన ఆకృతే ఒకలా అయిపోందని చెప్పుకొచ్చింది. దాంతోపాటు స్లీప్‌ ఆప్నియా, నిద్రలేమి, నిరంతర దగ్గు, డయాబెటిక్‌ వంటి సమస్యలతో ఇబ్బంది పడేదాన్ని అన్నారు. 

ఇక ఇలాగైతే ఎన్నోనాళ్లు ఉండనన్న ఫీల్‌ కలిగి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టానన్నారామె. ముఖ్యంగా షుగర్‌ లేని ఆహారాలకే ప్రాధాన్యత ఇవ్వడమే గాక తగిన వ్యాయామం చేయడం వంటివి చేసినట్లు తెలిపారు. ఈ విధానంతో బరువు తగ్గడమే కాకుండా సులభంగా మెట్లు ఎక్కేయగలనని, పైగా మెట్లు లేని హోటల్‌లో స్టే చేయగలనని ధీమాగా చెబుతోందామె. అంతేగాదు ఆనందిత బరువు తగ్గడం అంటే  శరీరాకృతి మారడంగా భావించొద్దు అది మన వెల్‌నెస్‌ ప్రయాణంగా భావిస్తేనే..బరువు తగ్గడమే గాక ఆరోగ్యంగానూ ఉంటామని చెబుతోంది ఆనందిత. 

 

(చదవండి: Kushboo Sundar: 20 కిలోలు తగ్గిపోయిన ఖుష్బూ.. అందుకోసం ఏం చేసిందంటే?)
 

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)