Breaking News

మళ్లీ పెళ్లి చేసుకుంటారా..? వృద్ధ మహిళలు ఏమన్నారో తెలుసా..!

Published on Wed, 02/04/2026 - 12:43

"పెళ్లి" అంటే నూరేళ్ల పంట..ఎన్నో జన్మల బంధం అని చెబుతుంటారు. కానీ ఇప్పుడు అది అబద్దమా అనిపిస్తుంది. చాలామంది ఆ అనుభవాన్ని గడించిన వివాహిత మహిళలు ఆ పేరు ఎత్తితేనే..హడలిపోతున్నారు.,విముఖత చూపిస్తున్నారు. సరదాకైనా..మళ్లీ వయసు వెనక్కి వెళ్లితే.. పెళ్లి చేసుకుంటారా అని మాటవరసకు అడిగితేనే..బాబోయ్‌ అన్నట్లుగా ఇస్తున్న సమాధానాల తీరు చూస్తే..పెళ్లీడుకి వచ్చిన వాళ్లు సైతం చేసుకోవాలా? వద్దా? అనేలా ఉన్నాయి వారి మాటలు. 

బాలీవుడ్‌ నటి, ట్రావెల్‌ వ్లాగర్‌ షెహనాజ్‌ తన పర్యాటక అనుభవాలను షేర్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంటారామె. కంటెంట్‌ క్రియేటర్‌గా ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్‌ చేస్తుంటారామె. అలానే ఈసారి పెళ్లై ఎన్నో వసంతాలు గడిచిపోయినా.. వృద్ద మహిళలను ఆటపట్టించే కొంటే ప్రశ్నతో పలకరించారు. అయితే వాళ్లందరి సమాధానాలు చూసి షెహనాజ్‌ విస్తుపోయింది. ఇంతకీ ఆ వివాహిత వృద్ధ మహిళను ఆమె ఏం అడిగారంటే..ఈ రోజు గనుక మీ ఏజ్‌ వెనక్కి వచ్చి..20 ఏళ్లు అయితే "మళ్లీ పెళ్లి చేసుకుంటారా"? అని ప్రశ్నించింది. 

అందుకు ఒకరేమో..ఒక్కసారి చాలు..ఇంకోసారి అస్సలు వద్దు అని చెప్పగా, మరొకరు పైళ్లిపై అంతగా ఆసక్తి లేదని, అది బానిసత్వానికి మరోపేరు అని తేల్చి చెప్పేశారు. ఇంకొందరు..మంచి పాఠం నేర్చుకోవాలంటే తప్పకుండా పెళ్లిచేసుకోవాలని అన్నారు. దానికి షెహనాజ్‌ ఏ పాఠం అని కుతుహలంగా ప్రశ్నించగా..అచ్చం కభీ ఖుషీ కభీ గమ్ మూవీలా కొన్ని సార్లు సంతోషం, కొన్నిసార్లు దుఃఖం అని చెప్పారు. చాలామటుకు పెళ్లిని అదొక సర్దుబాటుగా అభివర్ణించారు. 

ఒకరు మాత్రం ఆర్మీ ఆఫీసర్‌ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతాను, ఎందుకంటే..జీవితంపై పూర్తి అవగాహన ఉంటుందని అన్నారామె. అయితే ఆ సీనియర్‌ మహిళలంతా పెళ్లిపై అలా ఎందుకు చెప్పారంటే..వాళ్ల కాలంలో చాలామంది మహిళలు ఉద్యోగాలు చేయకుండా గృహిణులుగా జీవితం గడిపామని, ఇంట్లో చాలా బాధ్యతలు ఉండేవని చెప్పడం విశేషం. ఆ సమాధానాలన్ని విని షెహనాజ్‌ చమత్కారంగా అందుకే తాను పెళ్లిచేసుకోలేదని అంది. వెంటనే అక్కడున్న మహిళ నవ్వుతూ..ఆ..! అది సరైన నిర్ణయం అని సమర్థించడం విశేషం.

(చదవండి: సేవలో అతడికి సాటిలేరెవ్వరూ..! చేసేది డెలివరీ బాయ్‌​ జాబ్‌ కానీ..)

 

Videos

KLSR రేవంత్ బినామీ కంపెనీ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

బ్రేకప్ గురించి నోరు విప్పిన మృణాల్ ఠాకూర్..!

నీయవ్వ తగ్గేదేలే..! పుష్ప & ధురంధర్ డైరెక్టర్ మూవీ..!

శ్మశానం నుంచి ఫుడ్ ఆర్డర్ చేసిన అమ్మాయి.. అర్ధరాత్రి గజగజ వణికిన డెలివరీ బాయ్

ఒక మాజీ మంత్రిని పోలీసులతో కొట్టిస్తారా? సినిమా మాములుగా ఉండదు

పోలీసుల సమక్షంలోనే అంబటి హత్యకు కుట్ర

కాపు కులంలో అంబటి అన్న ఒక టైగర్ పోలీసులకు మాస్ వార్నింగ్

మేం కూడా మీలాగే ప్లెక్సీలు పెడితే ఒప్పుకొంటావా చంద్రబాబు?

గూండాలను వేసుకొచ్చి దాడి చేయిస్తావా? గల్లా మాధవిపై జగన్ ఫైర్

అంబటి రాంబాబు అన్న చేసిన తప్పేంటి?

Photos

+5

నేను తప్పు చేసినా సహించావ్‌.. సంఘవి ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

అంబటి కుటుంబానికి వైఎస్‌ జగన్‌ పరామర్శ (ఫొటోలు)

+5

శరత్ కుమార్-రాధిక పెళ్లిరోజు.. కూతురి క్యూట్ పోస్ట్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)

+5

జగన్‌ రాకతో దద్దరిల్లిన గుంటూరు (చిత్రాలు)

+5

అల్లు శిరీష్ బ్యాచిలర్ పార్టీ.. మరిన్ని కొత్త (ఫొటోలు)

+5

ఫుడ్ అంటే ఎంత ఇష్టమో.. ఆషికా క్రేవింగ్స్ (ఫొటోలు)

+5

పశ్చిమ గోదావరిలో ఎంతో ఫేమస్ ఈ ఆలయం గురించి తెలుసా? (ఫొటోలు)

+5

నెట్‌ఫ్లిక్స్ గ్రాండ్ ఈవెంట్.. సగం బాలీవుడ్ ఇక్కడే ఉందిగా (ఫొటోలు)

+5

జ్యోతిర్లింగాల యాత్ర మొదలుపెట్టిన హీరోయిన్ (ఫొటోలు)