Breaking News

ఢిల్లీ మాజీ సీఎం లవ్‌ స్టోరీ..! కాబోయే అత్తగారి అంగీకారం కోసం..

Published on Wed, 02/19/2025 - 17:44

దేశ రాజధానిని సుదీర్ఘకాలం ఏలిన స్ట్రాంగెస్ట్‌ విమెన్‌ సీఎంగా పేరుగాంచి మహిళ లవ్‌ స్టోరీ గురించి విన్నారా..?. అగ్ర కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించారామె. అస్సలు ఆనాటి భయంకరమైన కట్టుబాటుల నడుమ పెళ్లి అవుతుందా..? లేదా అనే రసవత్తరమైన టెన్షన్‌ల మధ్య ఆమె ప్రేమను గెలిపించుకున్నారు. అలా ఆమెలో ఒక గొప్ప ప్రేమికురాలి తోపాటు బలమైన నాయకురాలు, గొప్ప తల్లి ఉందని నిరూపించారు. ఆమె ఎవరంటే..

భారత చరిత్రలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన మహిళగా నిలిచిన వ్యక్తి ఢిల్లీ మాజీ సీఎం షిలా దీక్షిత్‌. ఆమెలో బలమైన నాయకురాలు, గొప్పతల్లి కంటే ముందుకు ఓ గొప్ప ప్రేమికురాలు కూడా ఉందనే విషయం కొద్దిమందికే తెలుసు. అదికూడా ఆమె ఆత్మకథ "సిటిజన్‌ ఢిల్లీ: మై టైమ్స్, మై లైఫ్" ద్వారానే బహిర్గతమైంది. 

ఆమె తన కాబోయే భర్తను ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని ప్రతిష్టాత్మక మిరాండా హౌస్‌లో చదువుతున్నప్పుడే గుర్తించారు. ఆయన పేరు వినోద్‌ దీక్షిత్‌. అతనిని ఒక తరగతిలో కలిశారు. అదికూడా తమ స్నేహితుల మధ్య నెలకున్న ప్రేమ వివాదాన్ని పరిష్కరించడం నేపథ్యంలో ఇరువురు స్నేహితులుగా మారారు. 

దగ్గర దగ్గర పవన్‌ కళ్యాణ్‌ మూవీ ఖుషీ సినిమాలో మాదిరిగా మొదట స్నేహితులై తర్వాత ప్రేమలో పడ్డారు. అయితే వారి ప్రేమను వినోద్‌ తల్లిదండ్రులు అస్సలు అంగీకరించలేదు. అయితే షీలా వినోద్‌లు మాత్రం ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి కన్నాట్‌కు వెళ్లే బస్ నంబర్ 10లో కలుసుకునే మాట్లాడుకునేవారు. అయితే ఇరువురి అంతరంగం వేరుగా ఉన్నా ఆలోచన తీరు ఒకేవిధంగా ఉండేది. 

అయితే వినోద్‌ ఇంకా విద్యార్థి దశలోనే ఉన్నాడు కాబట్టి ఐఏఎస్‌ ప్రవేశ పరీక్ష పూర్తి అయ్యాకే తల్లిదండ్రులను ఒప్పిస్తానని షీలాతో చెప్పారు. అయితే ఆ రోజుల్లో అమ్మాయిలకు తొందరగా పెళ్లి చేయడం జరుగుతుంది కాబట్టి షీలా పెళ్లి విషయమై ఆమె తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందేవారు. అయితే ఆమె కనీసం ఆయన్ని ప్యూన్‌ ఉద్యోగమైన సంపాదించే వరకు ఆగమని చెప్పేవారట పేరెంట్స్‌కి.  

ఇక వినోద్‌ కూడా 1959లో IAS మెరిట్ జాబితాలో తొమ్మిదవ స్థానంలో నిలిచి, ఉత్తర ప్రదేశ్ కేడర్‌ని ఎంపిక చేసుకున్నారు. ఇక అప్పటి నుంచి వారి ప్రేమ పోరాటం మాములగా సాగలేదు. ఎందుకంటే వినోద్‌ స్వాతంత్ర్య సమరయోధుడు, కాంగ్రెస్‌ సభ్యుడు ఉమా శంకర్‌ దీక్షిత్‌ కుమారుడు. పైగా ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌కి చెందిన ఉన్నత సనాతన కన్యాకుబ్జ్‌ బ్రహ్మణులలో అత్యున్నతంగా పరిగణించే దీక్షతుల కుటుంబం. 

అందులోనూ విపరీతమై కట్లుబాట్లు సంస్కృతి సంప్రదాయలతో పాతుకపోయిన కుటుంబం కావడంతో వారి ప్రేమను వినోద్‌ తల్లిదండ్రులు ససేమిరా అన్నారు. ఆ అమ్మాయి ఎలా ఉంటుందో వినోద్‌ తండ్రికి చూపడంతో ఆయన పెళ్లికి సుమఖం వ్యక్తం చేసినా.. తల్లి అస్సలు ఒప్పుకోలేదు. ఆమె ఆంగీకారం కోసం రెండేళ్లకు పైగా నిరీక్షించక తప్పలేదని షీలా తన ఆత్మకథలో రాసుకొచ్చారు.

పంజాబీ ఖత్రి కుటుంబంలో జన్మించిన షీలా కపూర్‌ భర్త ఎంపికను చూసి తల్లిదండ్రులు కూడా దిగ్బ్రాంతి చెందారు. ఎందుకంటే దీక్షితుల కుటుంబానికి కోడలుగా వెళ్లడం అంత ఈజీ కాదని వాళ్లకు కూడా తెలుసు. అందువల్లే ఆమె తల్లిదండ్రులు అసలు షీలా పెళ్లి అవుతుందా అనే దిగులుతో ఉండిపోయారు. 

అయితే ఆ ఉత్కంఠకు తెరదించేలా షీలా అత్తగారు ఒప్పుకోవడంతో జూలై  11, 1962న షీలా వినోద్‌ల ప్రేమ పెళ్లి పీటలెక్కింది. అలా ఆమె గొప్ప ప్రేమికురాలిగా ఎంతో ఓపిగ్గా ఎదురు చూసి తన ప్రేమను ఫలవంతం చేసుకున్నారు. అలాగే సుదీర్ఘకాలం దేశ రాజధానికి సీఎంగా బాధ్యతలు చేపట్టి అత్యంత బలమైన నాయకురాలిగా పేరు తెచ్చుకున్నారు షీలా.

(చదవండి: ఏడేళ్ల చిన్నారి పేరెంటింగ్‌ టిప్స్‌..! ప్రతి తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సినవి....)

 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)