Breaking News

బిడ్డలు పుట్టే అవకాశం లేదన్నారు..!కానీ ఆ మహిళ ..

Published on Wed, 02/25/2026 - 10:53

వైద్యశాస్త్రం రోజు రోజుకి పురోగమిస్తు బాధిత రోగులకు కొత్త జీవితాన్ని ప్రసాదిస్తుంది. ముఖ్యంగా సంతానం విషయంలో ఇటీవల కాలంలో ఎన్ని జంటలు ఇబ్బందులు పడుతున్నారో తెలిసిందే. ఐవీఎఫ్‌, సరోగసీ ద్వారా కొంత ఉపశమనం లభించినప్పటికీ..కొందరు పుట్టుకతో గర్భాశయం లేని అమ్మాయిలకు మాత్రం సంతానం ఓ కలగానే మిగిలిపోతోంది. రూపం, ఆరోగ్యం.. పరంగా బాగుండి ఆ విషయంలో మాత్రం జీవితాంతం వారికో లోపం, శాపంగా ఉండిపోతోంది. ఇప్పుడు ఆ సమస్యకు చక్కటి ఉపశమనం అందించారు వైద్యులు. వైద్యశాస్త్రంలోనే సరికొత్త అద్భుతం చోటు చేసుకునేలా కొంగొత్త వైద్య ఆవిష్కరణలకు నాంది పలికి రోగుల్లో కొత్త ఆశలను నింపుతున్నారు. అందుకు ఈ జంట ఉదంతమే ఓ ఉదాహరణ. 

అసలేం జరిగిందంటే..యూకేకి చెందిన 30 ఏళ్ల గ్రేస్‌ బెల్‌ పుట్టుకతోనే గర్భం లేదామెకు. గర్భం లేదు కాబట్టి పీరియడ్స్‌ ఉండవు గానీ సాధారణ అండశయాలు ఉంటాయి. ఈ పరిస్థితిని ఎంఆర్‌కేహెచ్‌ సిండ్రోమ్‌గా పేర్కొంటారు. యూకేలో ప్రతి 5 వేల మంది మహిళల్లో ఒకరు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. 

బెల్‌కి పిల్లలు పుట్టాలంటే గర్భమార్పిడి లేదా సరోగసీ ఒక్కటే మార్గం. దాంతో బెల్‌ భర్త  స్టీవ్ పావెల్‌ ఇద్దరూ గర్భశయాన్ని దానం చేసే దాత కోసం ఎదురు చూస్తుండేవారు. గర్భం దొరికిందని, మార్పిడికి సిద్ధంగా ఉండమని ఆస్పత్రి నుంచి వచ్చిన కాల్‌ వారిని ఉక్కిరిబిక్కిరి చేసింది. నమ్మశక్యం కానీ నిజంలా అనిపించింది ఆ జంటకు. అలా బెల్‌కి జూన్ 2024లో ఆక్స్‌ఫర్డ్‌లోని చర్చిల్ హాస్పిటల్‌లో దాదాపు 10 గంటలు శ్రమించి గర్భశయ మార్పిడి ఆపరేషన్‌ చేశారు వైద్యులు. ఆ తర్వాత కొన్ని నెలలకు ఐవీఎఫ్‌ని ఆశ్రయించి ప్రెగ్నెన్సీకి ప్లాన్‌ చేసుకున్నారు. ఆ విధంగా ఈ జంటకు 2025లో ఓ అద్భుత వరంలా 7 పౌండ్ల బరువుతో హ్యోగో అనే బిడ్డ జన్మించాడు.  

ప్రస్తుతం ఆ చిన్నారికి పదివారాల వయసు. ఆ దంపతులు ఇద్దరు తమకు సంతానభాగ్యాన్ని అందించిన ఆ మహిళకు, ఆమె కుటుంబానికి ఎంతో రుణపడి ఉంటామంటూ భావోద్వేగంగా చెప్పారు. మా బిడ్డను చూసిన ప్రతిసారి వాళ్లే మాకు గుర్తొస్తారంని అన్నారు. అయితే ఆ జంట మరో బిడ్డను కనాలనుకునేంత వరకు మార్పిడి చేసిన గర్భాశయాన్ని ఉంచి, ఆ తర్వాత తొలిగిస్తారట. ఎందుకంటే ఆ అవయవంపై శరీర రోగ నిరోధక వ్యవస్థ దాడి చేయకుండా నిరోధించడానికి, అలాగే ఆమె జీవతాంత మందులు తీసకోకుండా నివారించేందుకు ఇది తప్పదని చెబుతున్నారు వైద్యులు. 

కాగా, ఇలాంటి ఘటనే 2025 ప్రారంభంలో యూకేలో మొదటి సజీవ గర్భదానం ద్వారా అమీ అనే శిశువు జన్మించింది. ఈకేసులో అక్క గర్భాన్ని పొందింది సదరు మహిళ. ఆమెకు అప్పటికే ఇద్దరు పిల్లలు ఉండటంతో చెలెల్లికి తన గర్భాన్ని దానం చేసింది. వైద్యశాస్త్రంలో ఈ పురోగతి..పుట్టుకతో గర్భంలేని యువతుల పాలిట వరంగా మారుతుంది. పైగా అవయవ దానం పట్ల ప్రజల్లో అవగాహన పెరిగేందుకు నాంది పలకడమే గాక..మరణం తర్వాత ఇతరుల జీవితాల్లో వెలుగులు పంచేలా బతకడం ఈ దానం వల్లే సాధ్యమని తెలుసుకుంటారని వైద్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. 

(చదవండి: అద్దంలో కనిపించని అసలు రూపం)

 

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)