Breaking News

ఒకప్పుడు సైన్యం కోసం రాకెట్లు..ఇవాళ చిన్నారుల ఫుడ్‌ బ్రాండ్‌ వ్యాపారం!

Published on Wed, 09/09/2026 - 17:32

మాతృత్వం ఆ మహిళను ఆహార వ్యాపారం ప్రారంభించడానికి పునాది వేసింది. ముఖ్యంగా తన పిల్లలకు ఆరోగ్యకరమైన ఫుడ్‌ అందించాలనే అన్వేషణ ఇందుకు అంకురార్పణ. అలా వ్యాపార వేత్తగా మారి సక్సెస్‌​ అందుకుందా అంటే..

ఆ మహిళే ఉత్తరప్రదేశ్‌కి చెందిన జ్యోతి శ్రీ వాస్తవ భారత సైన్యం కోసం ఒకప్పుడు రాకెట్లు రూపొందించేది. కెమికల్‌ ఇంజనీర్‌ అయిన జ్యోతి నానో టెక్నాలజీ, రాకెట్‌  ప్రొపెల్లెంట్ల విభాగంలో మంచి నైపుణ్యం సాధించారామె. అలా ఆమె ఆర్మీ కోసం రాకెట్లు డిజైన్‌ చేసే విభాగంలో పనిచేసింది. అయితే ఆ వర్క్‌లో ఉండే తీవ్రమైన ఒత్తిడికి తట్టుకోలేగా ఆ ఉద్యోగానికి కొన్నాళ్లపాటు విరామం తీసుకునేలా రిజైన్‌ చేసింది. 

ఒక ఏడాది తర్వాత ఆమె గర్భవతి కావడం ఒక పండంటి మగబిడ్డకు జన్మనివ్వడం జరిగింది. ఆ తర్వాత ఆ చిన్నారికి ఘన ఆహారం కోసం అన్వేషిస్తున్నప్పుడే తెలిసింది మార్కెట్లో లభించేవన్నీ పోషకవంతమైనవి కావని. చిన్నప్పటి నుంచి సరైన ఆహారం అందిస్తేనే కదా వాళ్ల పెరుగుదల బాగుంటుందన్న ఆలోచన ఆమెను కుదురుగా ఉండనివ్వలేదు. ఆ క్రమంలో పడిన తపన మళ్లీ ఆమెను తన ఉద్యోగం వైపుకి వెళ్లకుండా ఫుడ్‌ వ్యాపారంలోకి దిగేలా చేసింది.  

మైదా లేనివి, శుద్ధి చేసిన చక్కెరలు ఉపయోగించిన ఆరోగ్యకరమైన ఆహారాలు ఇచ్చేలా యూనిసెఫ్ నుంచి శిక్షణ తీసుకుని మరి సర్టిఫికేషన్‌ పొందింది. అది ఆమెకు శిశువుల పెరుగుదల అభివృద్ధిలో వివిధ సూక్ష్మ, స్థూల పోషకాలు, ఖనిజాలు, విటమిన్ల పాత్రలను అర్థం చేసుకోవడానికి సహాయపడిందని అంటోంది. అలాగే పిల్లల ఆరోగ్యంలో వనమూలికల పాత్రను అర్థం చేసుకునేందుకు ఆయుర్వేదాన్ని అధ్యయనం చేసింది. ఆ తర్వాత వ్యాపారం పెట్టేందకు నిధులు కొరతతో ఇబ్బందులు ఎదురైనా..ఏదోలా కష్టపడి లిటిల్‌ చెర్రీ మామ్‌ అనే వ్యాపారాన్ని తన సొంతూరు మీరట్‌లో ప్రారంభించింది. 

దాన్ని ఓ బ్రాండ్‌లా మార్చి.. పోషకవంతమైన ఆహారం అందించేలా దోస మిక్స్‌లు, చిరుధాన్యల పిండి, పంచదార, బెల్లం లేని లడ్డూలు వంటి మంచి ఉత్పత్తులను అందించింది. అంతేగాదు పిల్లల కోసం సన్నని క్రాకర్లు వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్‌ను కూడా అందుబాటులోకి తీసకొచ్చింది. ముఖ్యంగా ఆరునెలల తదనంతరం ఎలాంటి ఫుడ్‌ పెట్టాలని భయపడే చిన్నారుల తల్లులకు ఈ ప్రొడక్ట్స్‌ని ధైర్యంగా పెట్టొచ్చు అనేలా ప్రజల నమ్మకం సంపాదించుకుంది జ్యోతి. 

ప్రారంభంలో ఎన్నో సవాళ్లు, సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ ఈ బ్రాండ్‌కి దేశవ్యాప్తంగా 70 వేల మంది వినియోగదారులున్నారని ఏడాదికి కోటి రూపాయల టర్నోవర్‌ ఆర్జిస్తుండటం విశేషం. అంతేగాదు జ్యోతి 'షార్క్ ట్యాంక్ ఇండియా' సీజన్ 5లో పాల్గొని తన వ్యాపార సక్సెస్‌ గురించి కూడా పంచుకుంది.

(చదవండి: కార్పొరేట్‌ ఉద్యోగాన్ని కాదని సైన్యంలోకి సివిల్‌ ఇంజనీర్‌!)
 

Videos

బెయిల్ వచ్చింది.! బిగ్ బాస్ లోకి రమానందన ఎప్పుడంటే?

జియో రూ.111 రీఛార్జ్ మతిపోగొట్టే బెనిఫిట్స్

నేషనల్ అవార్డు... క్యాష్ బహుమతిగా ఇస్తే, ఈ రోజు లోకేష్ జాబ్ ఇవ్వకుండా చేశాడు

నేను వస్తున్నానా లేదా అని నా అడ్వకేట్ ఇంటికి CCకెమెరాలు పెట్టించడం ఏంటీ

కులం గొప్పది కాదు మానవత్వం గొప్పది

మజ్జి శ్రీను పార్టీ మారడంపై బొత్స ఇంటి వద్ద అత్యవసర మీటింగ్

బాబును ఇమిటేట్ చేస్తూ ఏకిపారేసిన జగన్

కూకట్ పల్లి హోటల్ లో దారుణం కుళ్లిన 30 కేజీల మటన్, 20 కేజీల చికెన్

అందర్నీ కొనేసింది.! షాకింగ్ నిజాలు బయటపెట్టిన బాధితుడు

పాన్ ఇండియా బరిలోకి దిగుతున్నారా? డిసెంబర్ లో ఒకేసారి సినిమాలు

Photos

+5

స్టార్‌ నటి నిశ్చితార్థం ఫోటోలు వైరల్‌

+5

ఉదయభాను నిర్మాతగా ‘పంచనామా’ వెబ్‌సిరీస్‌ (ఫొటోలు)

+5

‘కళ్యాణం కమనీయం జీవితం’ మూవీ ట్రైలర్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ప్రతి ఇంట్లో అదే చర్చ : వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

సింపుల్ లుక్‌లో స్టన్నింగ్ బ్యూటీ.. శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

భార్యతో సుకుమార్.. 80s రెట్రో లుక్‌లో అదిరిపోయే.. (ఫొటోలు)

+5

రష్మిక పాత ఫొటోలు.. క్యూట్‌నెస్‌కు ఫిదా అవ్వాల్సిందే (ఫోటోలు)

+5

భార్య ప్రేమలో నాగశౌర్య.. క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

ఓయూలో ఘనంగా 85వ స్నాతకోత్సవం (ఫోటోలు)

+5

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)