Breaking News

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Published on Tue, 10/28/2025 - 17:51

"మోంథా" తుఫాను కోస్తా తీర ప్రాంత వాసులను వణికిస్తోంది.  భారీ  వర్షాలు, ఈదురుగాలుతో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు, ప్రభుత్వ అధికారులు హెచ్చరిస్తున్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రమైన తుఫాను  గత 6 గంటల్లో గంటకు 12 కి.మీ వేగంతో ఉత్తర- వాయువ్య దిశగా కదిలి, కాకినాడ (ఆంధ్రప్రదేశ్)కి దక్షిణ-ఆగ్నేయంగా 240 కి.మీ., విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్)కి దక్షిణ-నైరుతి దిశలో 320 కి.మీ., గోపాల్‌పూర్ (ఒడిశా)కి దక్షిణ-నైరుతి దిశలో 530 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది.

తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో  అప్పటికే అనేక  చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ప్రజలు స్వయంగా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. వాతావరణ అధికారుల సూచనలను ఎల్లపుడూ  గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలి. ఈ నేపథ్యంలో తుఫాను సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి  తెలుసుకుందాం.

పాటించాల్సిన జాగ్రత్తలు 

 తుఫాను లాంటి పరిస్థితులను నివారించడానికి ఉత్తమ మార్గం ఈ సమయాల్లో ఇంటి నుండి బయటకు వెళ్లకుండా ఉండటం అవసరం.

 

  • ఆఫీసులోనో, బయటో ఉంటే, వర్షం ఆగే వరకు వేచి ఉండాలి.

  • ఇంట్లో, ఫ్లాష్‌లైట్, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు ,ఇతర ఆహార పదార్థాలను దగ్గర్లో ఉంచుకోవాలి

  • అధికారుల సూచనలను పరిశీలిస్తూ ఉండాలి.

  • భారీ వర్షాలు, ఈదురు గాలలనుంచి  కాపాడుకునేలా ఇంటిలోపలే ఉండాలి.   అత్యవసరమైతే తప్ప, కొన్ని జాగ్రత్తలో బయటికి రావాలి. 

  • ఇంటి లోపల కిటికీలకు దూరంగా ఉండాలి.కిటికీలు ,తలుపులను సురక్షితంగా మూసి ఉంచాలి.   బలమైన గాలులకు కిటికీలుపడిపోకుండా తగిన జాగ్రత్తలుతీసుకోవాలి. గాజు కిటికీలైతే మరింత అప్రమత్తత అవసరం.

  • భారీ వర్షాల సమయంలో ఇంట్లో విద్యుత్ సరఫరా నిలిపివేయాలి.

  • విద్యుత్‌ పరికరాలను టీవీ, ఫ్యాన్, ఫ్రిడ్జ్‌లను  ఆఫ్‌ చేయాలి. 

  • అవసరమైన మందులు, నిత్యావసర సరుకులు నిల్వ ఉంచుకోవాలి. -

  • శిథిల భవనాలు, చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిలబడకుండా, జాగ్రత్తగా ఉండాలి.

  • విలువైన పత్రాలు, నగదు భద్రంగా ఉండేలా చూసుకోవాలి.

  • నిరంతరం అధికారులను సూచలను గమనిస్తూ, అవసరమైతే సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్లండి

  • ఎవరైనా ఆపదలో ఉన్నట్టు గమనిస్తే  తమను తాము కాపాడుకుంటే వారిని ఆదుకోడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా వృద్ధులు,  చిన్నపిల్లలు, మహిళలు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు  జాగ్రత్తగా ఉండాలి.

  • చలిగాలులనుంచి కాపాడుకునేందుకు  వెచ్చని రగ్గులు, స్వెట్లర్లు ధరించాలి. ముఖం , కళ్ళు కప్పి ఉంచుకోవడం చాలా అవసరం.  

  • వాహనంలో ఉంటే, ఎగిరే వస్తువుల ప్రమాదం లేని చోట దానిని పార్క్ చేయండి. తుఫాను సమయంలో వాహనం లోపల రేడియో ప్లే చేయవద్దు; అలా చేయడం వల్ల మీరు మెరుపులకు గురవుతారు.

  • తుఫాను సమయంలో స్నానం చేయడం మానుకోండి. నీటిలో కరెంట్ వేగంగా వ్యాపిస్తుంది.
     (బిగ్‌బీ దివాలీ గిఫ్ట్‌ : నెట్టింట ట్రోలింగ్‌ మామూలుగా లేదుగా!) 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)