Breaking News

ఆనంద్‌ మహీంద్ర మనసు దోచిన పల్లె, అందమైన వీడియో

Published on Tue, 07/08/2025 - 17:40

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra)  తాజాగా మరో ఆసక్తికరమైన విషయాన్ని  సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. తరచూ అనేక శాస్త్ర, వైజ్ఞానిక అంశాలను తన అభిమానులతో పంచుకునే ఇపుడు ఆయన  ప్రకృతికి సంబంధించిన విషయాన్ని  ఎక్స్‌ వేదికగా షేర్‌ చేశారు.

గాడ్స్‌ ఓన్‌ కంట్రీ కేరళలోని కడమక్కుడి (Kadamakkudy) గ్రామంపై ఆయన ప్రశంసలు కురపించారు. ఈ భూమి మీద అత్యంత అందమైన గ్రామాల జాబితాలో ఇది తరచూ నిలుస్తుందని ట్వీట్‌ చేశారు. సండే వండర్‌  అంటూ  ఈ అందమైన గ్రామం గురించి ప్రస్తావించారు. దీనికి సంబంధించి అందమైన వీడియోను షేర్‌ చేశారు. అంతేకాదు కడమక్కుడి సందర్శనను తన ‘బకెట్‌ లిస్ట్‌’లో  ఉందని, ఈ ఏడాది డిసెంబర్‌లో వ్యాపార పర్యటన నిమిత్తం తాను కొచ్చికి వెళ్తున్నానని తెలిపారు.ఈ క్రమంలోనే  కొచ్చి నుంచి ఈ గ్రామం కేవలం అరగంట దూరంలో ఉందన్నారు. పల్లెకు సంబంధించిన అందమైన ప్రకృతి దృశ్యాలతో కూడిన వీడియోనూ పోస్ట్‌ చేశారు.

 కాగా జాతీయ రహదారి 66 కి సమీపంలో, కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో ఉంటుంది కడమక్కుడి అనేగ్రామం.కేరళ సంప్రదాయ గ్రామీణ జీవనాన్ని  ప్రతిబింబించేలా మనోహరమైన ప్రకృతి దృశ్యాలు, పచ్చని పంటపొలాలు, కనువిందు చేసే బ్యాక్ వాటర్స్‌తో అలరారుతూ  ఉంటుంది. కడమక్కుడిని సందర్శించడానికి ఉత్తమ సమయం అక్టోబర్, మార్చి గా చెబుతారు. ఈ  సమయంలో వాతావరణం పొడిగా ఉంటుంది కానీ ఆహ్లాదకరంగా ఉంటుంది.


ప్రత్యేకతలు
14 చిన్న చిన్న దీవులతో కూడిన సుందరమైన ద్వీపసమూహం.
కడమక్కుడి సమీపంలోనే శతాబ్దాల చరిత్ర కలిగిన సెయింట్ జార్జ్ ఫోరెన్ చర్చి, వల్లర్పదం బసిలికా, మంగళవనం పక్షుల అభయారణ్యం వంటి ప్రసిద్ధ ప్రదేశాలు ఉన్నాయి
.సుస్థిర వ్యవసాయం,చేపలు పట్టడం , వ్యవసాయంలో మునిగిపోయిన స్థానికులకు  జీవనోపాధి 
పర్యావరణ వ్యవస్థను రక్షించి, పోషించే మడ అడవులు
అరుదైన వలస పక్షులను చూడాలనుకునేవారికి నిజంగా ఇది స్వర్గధామం
 

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)