Breaking News

'ఏక్‌ దిన్‌-ఏక్‌ గల్లీ'..! స్వచ్ఛమైన భారతీయుడిగా విదేశీయుడు..

Published on Tue, 08/12/2025 - 15:36

మన ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛ భారత్‌ మిషన్‌ని చేపట్టి.. దశల వారీగా పలు కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. మరుగుదొడ్లు నుంచి పారిశుధ్య కార్యక్రమాలు, తాగునీరు, తదతరాలన్నింటిని స్వచ్ఛంగా పరిరక్షించుకునేలా సమర్థవంతమైన పథకాలు, కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. ఇంకా కొన్ని రాష్ట్రల్లో  అక్కడక్కడ పరిశుభ్రత విషయంలో పరిస్థితి అత్యంత అధ్వాన్నంగానే ఉంది. అందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వారే కరువు. అలాంటిది ఒక విదేశీయడు ఓ నియమాన్ని ఏర్పాటు చేసుకుని మరి వీధులను శుభ్రం చేస్తున్నాడు అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. 

ఆ వీడియోలో ఒక విదేశీయుడు వీధులను శుభ్రం చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. హర్యానాలోని గురుగ్రామ్‌లో ఒక సెర్బియన్‌ దేశస్తుడు మార్పుని ఆహ్వానించేలా ఆయనే స్వయంగా నడుంకట్టాడు. ఆయన్‌ ఏక్‌దిన్‌కే ఏక్‌ గల్లీ అనే చొరవతో ఈ కార్యక్రమాన్నిచేపట్టినట్లు వీడియోలో వివరించాడు. 

 

దీన్ని నాలుగు రోజుల క్రితం ప్రారంభించినట్లు తెలిపాడు. ఇప్పటి వరకు ‘మిలీనియం సిటీ’లోని అనేక ప్రాంతాలను శుభ్రం చేస్తున్న వీడియోలను కూడా పంచుకున్నాడు. దీనికి స్థానికుల నుంచి కూడా మద్దతు లభించడం విశేషం. ఈ వీడియోలను చూసిన నెటిజన్లు అతడు నిజంగా స్వచ్ఛమైన భారతీయుడిని అభివర్ణించడమే కాకుండా క్లీన్‌ ఇండియా కోసం భారతీయులను ప్రేరేపించేలా చేస్తున్న మహోన్నత వ్యక్తి అని మరి కొందరూ ఆ విదేశీయుడిపై ప్రశంసల జల్లు కురిపిస్తూ పోస్టులు పెట్టారు.   
 

 (చదవండి: అలాంటి ఇలాంటి అధిక బరువు కాదు..! ఏకంగా 325 కిలోలు..చివరికి..)
 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)