Breaking News

ఏఐ ఒక కన్ను వెయ్‌!

Published on Tue, 10/27/2026 - 04:05

అన్ని రంగాలలో ఏఐ గురించిన చర్చ జరుగుతోంది.  అలాగే, జర్నలిజంలో ఏఐ వాడకం ప్రముఖంగా వినిపిస్తోంది. ‘అన్ని రంగాలలోనూ టెక్నాలజీ పాత్ర పెరిగిన ఈ రోజుల్లో ప్రజలకు ఏ కంటెంట్‌ను అందిస్తున్నామనే విషయంపై మహిళా జర్నలిస్టులు తప్పనిసరిగా దృష్టి పెట్టాలంటూ...’  హైదరాబాద్‌లో జరిగిన నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ ఉమెన్‌ జర్నలిస్ట్స్‌ప్రోగ్రామ్‌లో పలువురు వక్తలు అబీప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ముంబై నుంచి హాజరైన సీనియర్‌ జర్నలిస్ట్‌ ఖనీజా గరారీ, ఏఐ సేఫ్టీ రీసెర్చర్‌ దీప్తి బత్తిని చర్చించిన విషయాలు...

వార్తా సమాచారాన్ని ప్రజలకు చేర్చే ప్రక్రియలోకి చేరిన కొత్త శక్తి పేరే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ (ఏఐ). క్షణాల్లో సమాచారాన్ని విశ్లేషించడం నుంచి అనువాదం, కథనాల రూపకల్పన వరకు అనేక పనుల్లో సహకరించే ఈ సాంకేతికత .. జర్నలిజం స్వరూపాన్నే మార్చుతోందన్నారు. 

ఏఐ ఫొటోలు, వీడియోలు.. బాధ్యత ఎవరిది?
‘న్యూస్‌ పేపర్లు, టీవీ ఛాన ళ్లు, డిజిటల్‌ మీడియాలో ఏఐ రూపొందించిన చిత్రాలను విపరీతంగా ఉపయోగిస్తున్నారు. ఇది ఆందోళనతో కూడుకునే ఉంటోంది. ముఖ్యంగా నేరాలు, ప్రమాదాలకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు చూపించినప్పుడు ఇబ్బందికరంగా అనిపిస్తుంది. అలాగని ఏఐ ని పూర్తిగా వాడకూడదని కాదు. వార్తను జనాలకు చేరేవేసే క్రమంలో అత్యుత్సాహం కన్నా పరిశీలన అవసరం. ఏఐ పనిని సులువు చేయడానికి కొంతవరకు ఉపయోగపడుతుంది. కానీ, జర్నలిస్టు నేరుగా చూసి, తెలుసుకొని, పరిశీలించిన అనుభవానికి అది ప్రత్యామ్నాయం కాదు.

గుడ్డిగా నమ్మవద్దు..
ఏ సమాచారం అడిగినా, ఏ ట్రాన్స్‌లేషన్‌ అయినా ఏఐ ఇచ్చేస్తుంది. కానీ, దానిని గుడ్డిగా నమ్మవద్దు. తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు ఉంటాయి. పాత వార్తలు, కథనాల ప్రభావం మన అందించే న్యూస్‌ మీద పడుతుంది. కొత్త వార్తలను సొంతంగా తయారు చేయాలి. ఏఐ ట్రైనింగ్‌ ఒక్కరోజుతో పూర్తయ్యేది కాదు. అది నిరంతర సాధనతోనే సాధ్యం. స్పష్టత, వాస్తవం, మన పరిశీలన ఏఐ వాడకంలో తప్పనిసరి.

 ఏఐని ఉపయోగించడమెలాగో నేర్చుకోవడమే కాదు, దాని లిమిట్స్‌ను గుర్తించడమూ అవసరమే. టెక్నాలజీ పనిలో వేగాన్ని అందిస్తుంది. కానీ, వార్తకు విశ్వసనీయతను తీసుకొచ్చేది జర్నలిస్టు పరిశీలన, అనుభవం మాత్రమే. ఏఐ వాడకం నేర్చుకోవడం ఎంత ముఖ్యమో, దాన్ని ఎప్పుడు ఉపయోగించకూడదో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. అత్యుత్సాహంతో లేనిది ఉన్నట్టుగా చూపకూడదు. వ్యక్తిగత సమాచారాన్ని అవసరానికి మించి ఏఐ కి అందించకూడదు.

మారేది పని విధానం మాత్రమే..
ఏఐ సమాచారాన్ని వేగంగా అందించగలదు. కానీ, సమస్యలను ప్రత్యక్షంగా అర్ధం చేసుకోవడానికి, అన్యాయానికి గురైన వ్యక్తి మాటల్లోని బాధను గుర్తించడంలో మానవ స్పందనే ముఖ్యం.  అలాగే, ప్రభుత్వాలను, సమాజాన్ని ప్రశ్నించే తత్వం, పరిశోధనాత్మక దృష్టి .. ఇవన్నీ ఏఐ చేయదు. అందుకే ఏఐని ప్రత్యర్థిగా చూడాల్సిన అవసరం లేదు. అదే సమయంలో దానిపై పూర్తిగా ఆధారపడటమూ సరైంది కాదు. వృత్తినైపుణ్యాలను పెంచుకోవడానికి ఒక హెల్పర్‌గానే ఉపయోగించుకోవాలి. 

మతపరమైన కంటెంట్‌...
ఏఐ ద్వారా రూపొందించే కంటెంట్‌లో చట్టపరమైన సమస్యలకు దారితీసే అంశాలు ఏమైనా ఉన్నాయేమో ముందుగానే ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి. సమాజంలో ఆందోళనకు గురిచేసే కంటెంట్‌ ఎక్కడైనా కనిపించినా చూసి వదిలేయకుండా సంబంధిత అధికారులకు తెలియజేయాలి. బాధితులు లేదా సంబంధిత వ్యక్తులు కూడా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలి. అలాగే, అభ్యంతరకరమైన కంటెంట్‌ను గూగుల్, యూట్యూబ్, జెమినీ, మెటా... వంటి డిజిటల్‌ వేదికల దృష్టికి కూడా తీసుకెళ్లాలి. మతపరమైన మనోభావాలు దెబ్బతీసేలా ఉయని భావిస్తే, అందుకు సంబంధించిన ఆధారాలతో ఫిర్యాదు చేయవచ్చు. అయితే, ఏదైనా కంటెంట్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలా లేదా అనేది ఆ వార్త స్వభావం, అందుబాటులో ఉన్న ఆధారాలు, వర్తించే చట్టాలపైనే ఆధారపడి ఉంటుంది.

సాంకేతికతకు హద్దులు 
⇒ ‘నా ఛానల్‌–నా ఇష్టం’ అంటూ అనుకోకూడదు. ఏఐ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నా, దాని వినియోగానికి కొన్ని స్పష్టమైన హద్దులు ఉండాలి. ముఖ్యంగా ఫొటోలు, వీడియోలు, వ్యక్తుల గొంతు..కు సంబంధించిన అంశాల్లో మరింత జాగ్రత్త అవసరం. 

⇒ నిజంగా జరగని ఘటనను జరిగినట్లుగా చూపించే కృత్రిమ వీడియోలు, ఒక వ్యక్తి చెప్పని మాటలను చెప్పినట్లుగా వినిపించే ఆడియోలు, మహిళలపై వేధింపులకు ఉపయోగించే నకిలీ చిత్రాలు తీవ్ర నష్టాన్ని చేస్తాయి. ఇలాంటి వాటిని గుర్తించడమే కాదు, వైరల్‌ కావడాన్ని అడ్డుకోవాలి. ముఖ్యంగా బాధితుల గోప్యతను కాపాడటం మీడియా బాధ్యతలో భాగం.
⇒ అలాగే ఏఐతో రూపొందించిన దృశ్యాలను నిజమైన వార్తా చిత్రాలుగా చూపించకూడదు. ఏఐ సహాయంతో తయారైన కంటెంట్‌ స్వభావానికి అవసరమైన చోట పాఠకులకు స్పష్టంగా తెలియజేయాలి.  
⇒ సాంకేతికతను వినియోగించుకోవడం ఎంత ముఖ్యమో, దానివల్ల కలిగే ప్రమాదాలను అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం.
– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

కొత్త అవకాశాలకు ఏఐ
మహిళా జర్నలిస్టులు రాజకీయాలు, నేరాలు, వ్యవసాయం, ఆరోగ్యం, సామాజిక సమస్యలు, మహిళల హక్కులు .. వంటి విభిన్న అంశాలపై కథనాలు రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో  సవాళ్లనూ ఎదుర్కొంటున్నారు. సరైన విధంగా ఉపయోగిస్తే ఏఐ కొన్ని పనుల భారాన్ని తగ్గించగలదు. వివిధ భాషల్లో ఉన్న సమాచారాన్ని అర్థం చేసుకోవడం, ఇంటర్వ్యూలను కథనంగా మార్చడం వంటి పనుల్లో సమయం ఆదా అవుతుంది. మిగిలిన సమయాన్ని మరిన్ని  కథనాలు రాయడానికి వాడుకోవచ్చు.                                 – దీప్తి బత్తిని, ఏఐ సేఫ్టీ రీసెర్చర్‌

పెరిగిన వేగం...
గతంలో ఏదైనా సమాచారం కావాలంటే లైబ్రరీలపై ఆధారపడేవాళ్లం. అందుకు చాలా టైమ్‌ పట్టేది. తర్వాత గూగుల్‌లో వెతికి, సంబంధిత సమాచారాన్ని పరిశీలించేవాళ్లం. ఇప్పుడు ఈ మార్గం సులువైంది. అందుకు వార్తలను త్వరగా అందించడంలో వేగం పెరిగింది. ఏఐని పూర్తిగా తిరస్కరించాల్సిన అవసరం లేదు. అలాగని గుడ్డిగా నమ్మకూడదు.
– ఖనీజ గరారీ, సీనియర్‌జర్నలిస్ట్‌

Videos

ఏపీలో స్కూళ్లకు సెలవులు.. ఎన్ని రోజులంటే?

తీరంలో తీవ్ర అలజడి.. ఉప్పాడలో అల్లకల్లోలం ఇది ట్రైలర్ మాత్రమే...

ప్రొద్దుటూరు చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు

YSRCP రమేష్ రెడ్డి కారును ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

ఏపీకి శని కలియుగ శకుని

ప్రజలకు మరో షాక్..! రెండు కొత్త G.O లు.. 16 రంగాలు ప్రైవేటీకరణ

రేపు, ఎల్లుండి వైఎస్ జగన్ పులివెందుల పర్యటన

టీడీపీ అరాచకాలపై అమిత్ షా కు ... ఢిల్లీలో శకుని తాతకు తలంటు

తనపై టీడీపీ నేతల దాడి.. ఇచ్చిపడేసిన హఫీజ్ ఖాన్

బాబుకు షాక్..! TDP MPTC అభ్యర్థి భర్త అరెస్ట్

Photos

+5

దూసుకొస్తున్న అర్నబ్ తుపాన్...ఉప్పాడ తీరంలో అల్లకల్లోలం (ఫోటోలు)

+5

దీపావళి పటాస్‌లా వెలిగిపోతున్న మృణాల్ (ఫొటోలు)

+5

బ్లాక్‌ శారీలో ఆదితి రావు హైదరీ స్టన్నింగ్‌ ..(ఫోటోలు)

+5

బర్త్‌ డే మూడ్‌లో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి.. (ఫోటోలు)

+5

బేబీ బంప్‌తో సమంత.. లేటేస్ట్‌ లుక్ చూశారా? (ఫోటోలు)

+5

ఎల్లో డ్రెస్‌లో హీరోయిన్ అనుపమ అందాలు.. (ఫోటోలు)

+5

రెడ్ డ్రెస్‌లో మెరిసిపోతోన్న ది రాజాసాబ్ బ్యూటీ మాళవిక.. (ఫోటోలు)

+5

'జైలర్' కోడలు ఇంత అందంగా ఉందేంటి? (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం' ప్రమోషన్లలో శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

సెప్టెంబర్ బర్త్ డేస్.. అల్లు స్నేహ జ్ఞాపకాలు (ఫొటోలు)