Breaking News

Secret of Happiness: ఆనంద రహస్యం

Published on Mon, 06/30/2025 - 10:16

తొండమనాడు రాజు ఓ పర్వదినాన శేషాచలం కొండలలోని అద్భుత సహజ శిల్పకళా చమత్కారమైన తుంబురు తీర్థం దర్శించడానికి వెళ్ళాడు. సనక సనంద తీర్థం, నల్లగుండాల మీదుగా దట్టమైన అటవీలోయలో నడుచుకుంటూ తుంబురు తీర్థం చేరాడు. భూ పరిణామ క్రమంలో భాగంగా ఓ కొండ కొబ్బరిచిప్పలా రెండుగా విచ్చుకుని చివర్లో జలజల ΄ారుతున్న తుంబురు తీర్థం జలపాతాన్ని చూస్తూ గంటలకొద్దీ గడిపినాడు. పక్కనే వున్న తరిగొండ వెంగమాంబ గుహ వద్ద వున్న నిశ్చలానంద స్వామిని దర్శించుకున్నాడు.

తనకు అష్టైశ్వర్యాలున్నా ఎందులోనూ ఆనందం కనిపించడం లేదని బాధను వ్యక్తం చేశాడు. నిశ్చలానంద స్వామి చిరునవ్వు నవ్వాడు.  అప్పుడే కాలినడకన కొందరు భక్తులు గోవిందలు చెప్పుకుంటూ తిరుమల కొండకి నడిచి వెళుతున్నారు. వారు నడిచి నడిచి అలసిపోయి ఉన్నారు. వారికి కడుపు నిండా అన్నం పెట్టి, వారు భోజనం చేసి వెళ్లేటప్పుడు రాజును వారి కళ్ళలోకి చూడమన్నాడు.వెంటనే రాజు తనతో వచ్చిన వంటవాళ్లను, భటులను పురమాయించి చకాచకా వంటలు చేయించాడు. వేడివేడిగా అరటి ఆకులో వడ్డించిన వంటలను కాలి నడక భక్తులు ఆవురావురుమని తినసాగారు. అలా తింటున్న వారిని చూస్తున్న రాజుకు తాను తినకుండానే కడుపు నిండిపోయినట్లనిపించింది.

భోజనమయ్యాక భక్తులు ఒక్కొక్కరూ వచ్చి  ‘అన్నదాతా సుఖీభవా’ అని చెప్పి వెళ్తుంటే రాజు  తృప్తిగా తియ్యటి గుటకలు మింగాడు. రాజు ముఖంలోకి మెరుపు వచ్చింది. తనకి తెలియకుండానే కళ్ల నుంచి ఆనంద భాష్పాలు రాలాయి.   అదే అదునుగా భావించిన నిశ్చలానంద స్వామి ‘‘మనం ఒకరికి ఏదైనా ఇస్తున్నామంటే మనం శక్తి మంతులమవుతున్నామని గుర్తుంచుకోవాలి. అందుకే మనం ఎవరికైనా ఏదైనా ఇవ్వడంలో సహజమైన  ఆనందం వుంటుంది. తీసుకోవడం కన్నా ఇవ్వడంలో వున్న ఆనందం పదింతల గొప్పది’’ అని ఇవ్వడంలో వున్న గొప్పదనాన్ని రాజుకు విశదీకరించి చెప్పినాడు.  

ఆనంద రహస్యం ఇవ్వడంలోనూ.... దాన గుణంలోనూ వుందని గుర్తించిన రాజు మరిన్ని దానాలు చేయాలని నిర్ణయించుకుని స్వామి పాదాలకు నమస్కరించి తన రాజ్యానికి బయలుదేరాడు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)