Breaking News

అయ్‌ బాబోయ్‌... ఏఐ వాయిస్‌  క్లోనింగ్‌!

Published on Sat, 05/31/2025 - 06:20

ఆరోజు... ముంబైలో ఉండే కేశవ్‌కు ఫోన్‌కాల్‌ వచ్చింది. దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయం నుంచి కాల్‌ చేస్తున్నట్లు చెప్పారు. కొన్ని సెకన్‌ల తరువాత... ఫోన్‌లో తన కుమారుడు శ్రీకర్‌ అరుపులు విని కేశవ్‌ షాక్‌ అయ్యాడు. ‘దయచేసి నాకు బెయిల్‌ ఇప్పించండి’ ఏడుస్తూనే అంటున్నాడు శ్రీకర్‌. ‘మీరు 80,000 రూ పాయలు చెల్లించాలి’ అని ఫోన్‌ చేసిన వాళ్లు కేశవ్‌ను డిమాండ్‌ చేశారు. ఆ భయంలో, బాధలో ఏమీ తోచని కేశవ్‌ వారు చెప్పినట్లే చేశాడు. అయితే అది మోసం అని తెలుసుకోవడానికి కేశవ్‌కు ఎంతో టైమ్‌ పట్టలేదు. తన కుమారుడు సురక్షితంగానే ఉన్నాడు.

మరి వాయిస్‌ మాటేమిటి?
శ్రీకర్‌ వాయిస్‌ను అనుసరిస్తూ ఏఐ ద్వారా సృష్టించిన ఫేక్‌ వాయిస్‌ అది. సైబర్‌ మోసాలలో ఒకటి... ఏఐ వాయిస్‌ క్లోనింగ్‌. ప్రజల భావోద్వేగాలను, బలహీనతలను ఆసరాగా చేసుకొని అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీతో మోసం చేస్తున్నారు స్కామర్స్‌. గత కొంతకాలంగా ‘వాయిస్‌ క్లోనింగ్‌’ ఊపందుకుంది. అయితే విద్యావంతులు, విద్యావంతులు కాని వారు అనే తేడా లేకుండా డెబ్భైశాతం మంది క్లోన్‌ వాయిస్‌లను గుర్తించలే పోతున్నారు. ఒక వ్యక్తి వాయిస్‌ను క్లోన్‌ చేయడానికి స్కామర్‌లకు జస్ట్‌ మూడు సెకన్‌ల సమయం చాలు.

మోసగాళ్ల బారిన పడకుండా కొన్నిచిట్కాలు
‘అయ్యో... నన్ను గుర్తుపట్టలేదా!’ అంటూ మోసగాళ్లు మాటలు కలుపుతారు. ‘సారీ... గుర్తుపట్టలేదు’ అంటే ఏమనుకుంటారో అని మొహమాటం కొద్దీ మాట్లాడడం మొదలుపెడతారు కొందరు. అలా చేస్తే మోసగాళ్లకు అవకాశం ఇచ్చినట్లే. అందుకే... ‘నేను ఫలానా...’ అని అవతలి వ్యక్తి చెప్పినప్పుడు మీ ఇద్దరికి మాత్రమే తెలిసిన ఒక విషయం గురించి అడగండి. అతను కరెక్ట్‌ అని చెబితే ఓకే. కానిపక్షంలో అనుమానించాల్సిందే.
→ స్నేహితుడు, బంధువు... మొదలైన వారి పేరుతో వచ్చిన కాల్‌ చాలా తక్కువ టైమ్‌ మాత్రమే ఉంటే  అది వార్నింగ్‌ సైన్‌ అనుకోవచ్చు,
→ ఏఐ స్కామ్‌ వాయిస్‌లు తెలియని నంబర్‌ నుంచి జరుగుతుంటాయి.
→ ఆన్‌లైన్‌లో అపరిచితులకు వాయిస్‌ నోట్స్, వీడియో షేరింగ్‌ చేయకూడదు. 
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)